వన్డే ప్రపంచ కప్ దూరమైన కెన్ విలియమ్సన్.. ఆయన స్థానంలో ఎవరంటే.?

ఈ సంవత్సరం భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గాయపడిన గుజరాత్ టైటాన్స్ స్టార్ బాటర్ కెన్ విలియమ్సన్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమైయ్యాడు. ఆ మ్యాచ్‌లో కుడికాలి మోకాలి గాయంతో మైదానం వీడిన కేన్ ఆ తరువాత చికిత్స కోసం సొంత దేశానికి చేరుకున్నాడు.. ఆక్లాండ్ విమానాశ్రమంలో ఊత కర్ర సహాయంతో నడుస్తున్న కేన్ వీడియో […]

Share:

ఈ సంవత్సరం భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గాయపడిన గుజరాత్ టైటాన్స్ స్టార్ బాటర్ కెన్ విలియమ్సన్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమైయ్యాడు. ఆ మ్యాచ్‌లో కుడికాలి మోకాలి గాయంతో మైదానం వీడిన కేన్ ఆ తరువాత చికిత్స కోసం సొంత దేశానికి చేరుకున్నాడు..

ఆక్లాండ్ విమానాశ్రమంలో ఊత కర్ర సహాయంతో నడుస్తున్న కేన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మోకాలికి మరో మూడు వారాలలో  శస్త్ర చికిత్స జరగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది. వన్డే ప్రపంచ కప్ సెలక్షన్‌కు అతను అందుబాటులో ఉండకపోవచ్చు అని కూడా ముందుగానే తెలిపింది. కేన్ సారధ్యంలోని టీవీఎస్ జట్టు 2019 ప్రపంచ కప్ రన్నర్ గా నిలిచింది. ఆపరేషన్ అనంతరం విలియమ్సన్ పునరావాసంలో ఉంటాడని బోర్డు తెలిపింది. 

గత కొన్ని రోజులుగా ఐపీఎల్ ఫ్రాంచెజ్ గుజరాత్ టైటాన్స్, న్యూజిలాండ్ క్రికెట్ నుంచి గొప్ప మద్దత్తు ఇచ్చినట్లు విలియమ్సన్ తెలిపారు. గాయం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ప్రస్తుతం తన దృష్టి అంతా సర్జరీ పైనే ఉంటుందని, ఆ తరువాత తిరిగి జట్టులోకి రావడానికి తీసుకోవాల్సిన పునరావాసం పైనే ఆలోచన ఉన్నట్లు తను చెప్పుకొచ్చాడు. మైదానంలో తిరిగి అడుగు పెట్టేందుకు ఏం  చేయాలో అవన్నీ చేస్తానని కూడా తెలిపాడు. కాగా గాయపడి జట్టుకు దూరమైన కేన్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ శ్రీలంక వన్డే కెప్టెన్ ‘దాసున్ షన’ కు 50 లక్షలు రూపాయల కనీస ధర చెల్లించి తీసుకుంది.

2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కెన్ అటు సారధిగానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాణించాడు. ఇంగ్లాండులో జరిగిన గత వరల్డ్ కప్ లో 9 ఇన్నింగ్స్ లలో 578 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా విలియమ్సన్ సారథ్యంలో కివీస్ వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఇది జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ.

ఐపిఎల్ 16లో భాగంగా మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన టోర్నమెంట్ ఓపెనర్ లో సిఎస్కే బ్యాటర్ రుతురాజ్ గై వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు.  బౌండరీ లైన్ వద్ద పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసిన విలియమన్స్ అదుపుతప్పి బౌండరీ లైన్ అవతలపడ్డాడు. కింద పడే క్రమంలో అతని కాలు నేలకు బలంగా తాకింది. దాంతో హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గాయపడ్డ తర్వాత వైద్యులు అతనికి స్కానింగ్ నిర్వహించగా అందులో కుడి మోకాలి ఎముక చిధ్రం అయినట్లు తేలింది. స్కాన్స్ తరువాత విలియమ్సన్ కుడి మోకాలికి శస్త్ర చికిత్స అవసరమైన వైద్యులు తేల్చడంతో, అతడు సర్జరీ చేయించుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితమే విలియమ్సన్ న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు.