Rachin Ravindra: నేను 100% కివీని.. భార‌తీయుడి అయినందుకూ గ‌ర్వంగా ఉంది

భారతదేశం (India)లో పుట్టి పెరిగి వేరే దేశాలు వెళ్లి, స్థిరపడి, మళ్లీ తిరిగి భారతదేశానికి వృత్తిపరంగా రావడం చాలా మందికి గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. న్యూజిలాండ్ (New Zealand) తరఫున ఆడుతున్న ఆటగాడు రచిన్ రవీంద్ర (Rachin Ravindra), తను మ్యాచ్ ఆడటానికి తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన భారతదేశానికి రావడం గర్వకారణంగా ఉంది అంటూ మాట్లాడటం జరిగింది.  న్యూజిలాండ్ ఆటగాడిగా భారతీయ రచిన్ రవీంద్ర:  శనివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ (World Cup) 2023 […]

Share:

భారతదేశం (India)లో పుట్టి పెరిగి వేరే దేశాలు వెళ్లి, స్థిరపడి, మళ్లీ తిరిగి భారతదేశానికి వృత్తిపరంగా రావడం చాలా మందికి గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. న్యూజిలాండ్ (New Zealand) తరఫున ఆడుతున్న ఆటగాడు రచిన్ రవీంద్ర (Rachin Ravindra), తను మ్యాచ్ ఆడటానికి తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన భారతదేశానికి రావడం గర్వకారణంగా ఉంది అంటూ మాట్లాడటం జరిగింది. 

న్యూజిలాండ్ ఆటగాడిగా భారతీయ రచిన్ రవీంద్ర: 

శనివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ (World Cup) 2023 మ్యాచ్‌ (Match)లో కివీస్ ఆస్ట్రేలియా (Australia)తో తలపడినప్పుడు న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్ రచిన్ రవీంద్ర (Rachin Ravindra) బ్యాటింగ్‌తో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. రచిన్ రవీంద్ర (Rachin Ravindra) 89 బంతుల్లో 116 పరుగులు చేయడం న్యూజిలాండ్ (New Zealand)‌కు 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సరైన వేదికను ఏర్పాటు చేసింది. అయితే చివరలో జిమ్మీ నీషమ్ చాలా బాగా ప్రయత్నం చేసినప్పటికీ, ఆస్ట్రేలియన్లు అగ్రస్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియా (Australia)తో న్యూజిలాండ్ (New Zealand) ఓడిపోయిన తర్వాత, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, రాచిన్‌ను మధ్యలో తన ఆట తీరు కోసమే కాకుండా, భారతదేశం (India) తరుపు నుంచి కూడా తనకి దక్కిన సపోర్టు గురించి కూడా అడగడం జరిగింది. 

తాను ఈ ప్రశ్న వినడం చాలా సంతోషంగా ఉందని, అయితే తాను భారత సంతతికి చెందిన వాడుగా న్యూజిలాండ్ (New Zealand) తరఫున ఆడడం గర్వకారణం గా ఉందని, అంతేకాకుండా తమ సొంత తల్లిదండ్రులు పుట్టి పెరిగిన భారతదేశానికి వచ్చి న్యూజిలాండ్ (New Zealand) తరఫున ఆడడం చాలా బాగుందని చెప్పుకొచ్చాడు రచిన్ రవీంద్ర (Rachin Ravindra). అంతేకాకుండా భారతదేశం (India) మీద తన అభిమానాన్ని చెప్పుకొచ్చాడు. భారతదేశం (India)లో తమ కుటుంబ సభ్యులు ఎంతో ఉన్నారని మాట్లాడాడు. అయితే కేవలం న్యూజిలాండ్ (New Zealand) తరఫున ఆడడానికి భారతదేశానికి రాకమందు, తాను చాలా సార్లు భారతదేశం (India) వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చాడు రచిన్ రవీంద్ర (Rachin Ravindra). 

Also Read: Bumrah: బుమ్రా బౌలింగ్ పడట్లేదా?

భారతదేశం (India) తరుపు నుంచి తనకి అందిన సపోర్ట్ గురించి కూడా మాట్లాడ్డం జరిగింది రచిన్ రవీంద్ర (Rachin Ravindra). చాలామంది తనకి సపోర్ట్ చేస్తూ తనని మరింత బాగా ఆడేందుకు ప్రోత్సహించడం జరిగిందని, చిన్నతనంలో తాను ఇలా జరిగితే బాగుండు అని అనుకునే వాడినని, అదే విధంగా ఇప్పుడు తాను ఆడుతుంటే చాలా మంది తన పేరుని గట్టిగా అరుస్తూ ప్రోత్సహించడం తనకి చాలా బాగుందని చెప్పుకొచ్చాడు. తనకి భారతదేశం (India) రావడం ఎప్పుడు ప్రత్యేకమే అంటూ మాట్లాడాడు రచిన్ రవీంద్ర (Rachin Ravindra). అయితే ఆస్ట్రేలియా (Australia) – న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ (New Zealand) ఓడిపోయినప్పటికీ, ప్రపంచ కప్ (World Cup) 2023 సెమీఫైనల్స్ కి వెళ్లేందుకు అన్ని అర్హతలు దక్కించుకుంది న్యూజిలాండ్ (New Zealand) జట్టు. 

వరల్డ్ కప్ 2023: 

ఈ నెలలో అక్టోబర్ 5 నుండి మొదలైన వరల్డ్ కప్ (World Cup), నవంబర్ 19 వరకు జరగనుండగా అందులో, దేశవ్యాప్తంగా 10 వేదికలలో జరిగే 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌ (Match)లను చూసేందుకు కనీసం 25 లక్షల మంది అభిమానుల రాక కనిపిస్తుంది. ఓపెనింగ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ ఆదిపత్యం ఇవ్వగా, ఫైనల్ మ్యాచ్‌ (Match)లకు కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. TV, OTT వంటి మాధ్యమాల ద్వారా 2019 ప్రపంచ కప్ (World Cup) చూసిన 552 మిలియన్ల మంది భారతీయ వ్యూయర్స్ కంటే ఈ సంవత్సరం మొత్తం వీక్షకుల సంఖ్య చాలా  ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది

గ్రూప్ దశలో 45 మ్యాచ్‌ (Match)లు జరగనున్నాయి, ఒక్కో జట్టు మిగతా అందరితో ఒకసారి తలపడాల్సి ఉంది. ఈ ఏడాది టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా (Australia), బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ (New Zealand), పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ (Match)లు మరియు ఒక కప్ ఫైనల్‌నాకౌట్ దశకు కేవలం నాలుగు జట్లు మాత్రమే చేరుకుంటాయి.