Jasprit Bumrah: నేను జట్టులోకి ఇక తిరిగి రాలేనని అన్నారు- బుమ్రా

ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి తమకు తిరుగులేదని రోహిత్‌సేన మరోసారి చాటింది. ఇంగ్లాండ్‌పై ఘన విజయంతో టీమ్‌ఇండియా(Team India) సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇక నిప్పులు చెరిగే బంతులతో భారత బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడి ఇంగ్లాండ్‌(IND vs ENG)పై విజయాన్ని అందించారు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా(Jasprit Bumrah) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి […]

Share:

ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి తమకు తిరుగులేదని రోహిత్‌సేన మరోసారి చాటింది. ఇంగ్లాండ్‌పై ఘన విజయంతో టీమ్‌ఇండియా(Team India) సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇక నిప్పులు చెరిగే బంతులతో భారత బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడి ఇంగ్లాండ్‌(IND vs ENG)పై విజయాన్ని అందించారు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా(Jasprit Bumrah) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ మొత్తం 14 వికెట్లతో.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Read More: Pakistan: వాట్సప్ చాట్ లీక్.. ఫైర్ అయిన వకార్ యూనిస్

గాయం కారణంగా బుమ్రా ఈ ప్రపంచకప్‌(World cup) ముందు చాలా కాలం జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే… ఆ సమయంలో అతన్ని విమర్శించని నోరు లేదు. కథనాలు రాయని వార్తా పత్రిక లేదు. భారత పేసర్లు విఫలమైన ప్రతి చోటా అతని పేరే ముందుండేది. జట్టులో లేకపోయినా ఓటములకు అతనే బాధ్యుడు అన్నట్లు విమర్శించేవారు. ఐపీఎల్‌కు అడ్డురాని గాయాలు.. దేశానికి ఆడే సమయంలో మాత్రమే ఎందుకు అడ్డొస్తాయని అతన్ని ప్రశ్నించేవారు. అప్పట్లో మీడియా సైతం విమర్శకుల పక్షానే ఉండేది. బుమ్రా దేశానికి ఆడడు.. ఐపీఎల్(IPL) మాత్రమే ఆడతాడు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో కథనాలు వచ్చేవి. ఈ  విమర్శలపై బుమ్రా ఇప్పుడు స్పందించారు.

జట్టుకు దూరమైన సమయంలో తన కెరీర్‌ గురుంచి పలువురు అన్న మాటలను గుర్తుచేసుకున్నాడు బుమ్రా(Jasprit Bumrah). “నా భార్య(సంజన గణేషన్) స్పోర్ట్స్ మీడియా(Sports media)లో పని చేస్తుంది. అందువల్ల, నా గురుంచి ఎవరు ఏమన్నా నాకు తెలిసిపోయేవి. నా కెరీర్‌కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు నేను విన్నా..  ఇక తిరిగి జట్టులోకి రాలేనని కూడా అన్నారు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. ఆటను నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. నేను చాలా సొంతోషంగా ఉన్నా.  గాయం నుంచి తిరిగొచ్చాక సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా..” అని  ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ బుమ్రా విమర్శకులకు బుద్దొచ్చేలా మాట్లాడారు.

అతని బౌలింగ్ విధానం.. పాకిస్తాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్‌(Wasim Akram)ను కట్టిపడేసింది. బుమ్రాను ఆకాశానికెత్తేశాడు అక్రమ్. అతణ్ని కంప్లీట్ బౌలర్‌గా అభివర్ణించాడు. ఈ జనరేషన్‌లో బుమ్రా(Jasprit Bumrah) ఒక్కడే సంపూర్ణ బౌలర్ అని కితాబిచ్చాడు. సమీప భవిష్యత్తులో అతణ్ని ఢీ కొట్టేవాడు మరొకరు లేరని పేర్కొన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. బంతిపై అతని కంట్రోల్, పేస్, వైవిధ్యం.. ఇలా అన్నీ కలగలిసిన బౌలర్ అతను ఒక్కడే. అతని బౌలింగ్‌ విధానం చూసే వారికి ఓ ట్రీట్ ఇస్తుంది..అని అక్రమ్ వ్యాఖ్యానించాడు. కొత్త బంతి ఎలా బౌల్ చేయాలో అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదనీ పేర్కొన్నాడు. పాకిస్తాన్ బౌలర్ల కంటే బుమ్రా అత్యంత ప్రమాదకారి అని తాను బలంగా నమ్ముతానని వసీం అక్రమ్ చెప్పాడు. వన్డే, టీ20తో పాటు ఎక్కువ టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల అతని బౌలింగ్ రాటు తేలిందని, పాకిస్తాన్ బౌలర్లు ఎక్కువ కాలం టెస్ట్ ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం కొనసాగలేరని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah).. ప్రారంభంలోనే రెండు వికెట్లు కూల్చాడు. వరుస బంతుల్లో డేవిడ్ మలన్, జో రూట్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తరువాత కూడా అతని వేగానికి బ్రేకులు పడలేదు. చివర్లో మార్క్‌వుడ్‌ను అవుట్ చేశాడు. దీనితో అతని వికెట్ల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో 14 వికెట్లు కూల్చాడీ స్టార్ పేసర్. ఇక టీమ్‌ఇండియా తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో నవంబర్‌ 2న తలపడనుంది.