జస్ ప్రీత్ బుమ్రాకి ప్రత్యామ్నాయం ఎవరు? వారికి ఛాన్స్ దొరుకుతుందా?

రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు. ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే 2023 ఐపీఎల్‌కి ముందు రోహిత్ శర్మ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ ఫాస్ట్‌ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే జస్ ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ముంబై ఇండియన్స్ స్థానంలో ఏ ఆటగాడు జట్టులోకి వస్తాడు అనే ప్రశ్న […]

Share:

రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు.

ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే 2023 ఐపీఎల్‌కి ముందు రోహిత్ శర్మ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ ఫాస్ట్‌ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే జస్ ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ముంబై ఇండియన్స్ స్థానంలో ఏ ఆటగాడు జట్టులోకి వస్తాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మారింది.. 

జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో వీరికి ఛాన్స్

ఆ జట్టుకు ఆడలేకపోయిన యువకులకు ఇది పెద్ద అవకాశం. ముఖ్యంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌‌కు ఇది మంచి అవకాశం. ఐదు టైటిళ్లను గెలుచుకున్న ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు.  ఈసారి మాత్రం ఆజట్టుకు ఇక్కట్లు తప్పేలా లేవు. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగం చాలా బలహీనంగా ఉంది. రేసుగుర్రం బుమ్రాతో పాటు, ఆసీస్‌ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కూడా సీజన్‌ మొత్తం జట్టుకు దూరంగా ఉండనున్నారు. దీంతో ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఆల్‌ రౌండర్‌‌గా పేరున్న అర్జున్ టెండూల్కర్ 2021లో ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరాడు. అయితే టీమ్‌లో టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లు ఉండటంతో అర్జున్‌కు ఇప్పటివరకు అవకాశం రాలేదు. కానీ.. ఈ సీజన్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

అర్జున్ సత్తా చూపుతాడా? 

అర్జున్‌కు అవకాశం ఇవ్వడం వల్ల ముంబై బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా మరింత బలంగా మారుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. క్యామెరూన్‌ గ్రీన్‌ తో కలిసి జట్టుకు ఆల్‌ రౌండర్‌గా సేవలందించగలడని రోహిత్ సేన భావిస్తోంది. కాగా.. రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతూ మంచి ప్రదర్శన చేశాడు. అర్జున్ మొదటి మ్యాచ్‌‌లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్జున్ మొత్తం 547 పరుగులు చేశాడు. అలాగే 12 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక దేశీయ క్రికెట్‌లో 9 T20 మ్యాచ్‌లు ఆడి, 12 వికెట్లు తీశాడు. 180 పరుగులు చేశాడు. 

అర్జన్ నాగ్వాస్వాలా

అర్జన్ నాగ్వాస్వాలా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇతను ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనప్పటికీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జన్ నాగ్వాస్వాలా 25 మ్యాచ్‌ల్లో 16.62 సగటుతో 35 వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా స్థాయి ప్రదర్శనను అర్జన్ నాగ్వాస్వాలా కనపరుస్తాడా లేదా అనేది చూడాలి.

సందీప్ శర్మ

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో సందీప్ శర్మ ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా పవర్‌ప్లే ఓవర్లలో సందీప్ శర్మ గణాంకాలు ఆకట్టుకున్నాయి. ఐపీఎల్‌లో సందీప్ శర్మ 104 మ్యాచ్‌ల్లో 7.77 ఎకానమీతో 114 వికెట్లు పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జట్టు జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో సందీప్ శర్మను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.. 

ధవళ్ కులకర్ణి

ధవళ్ కులకర్ణి గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున కూడా ఆడాడు. ఐపీఎల్‌లో ట్రాక్ చూస్తే..  ఈ ఆటగాడు 92 మ్యాచ్‌ల్లో 28.77 సగటుతో 86 వికెట్లు తీశాడు. 

ఇక వీరిలో ఎవరికి అదృష్టం కలుగుతుందో చూడాలి.