వైరల్ అవుతున్న ఎమ్మెస్ ధోని కొత్త లుక్

ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఎల్ జి ఎం ట్రైలర్ లాంచ్ కోసం చెన్నై వచ్చాడు. ఈ సినిమాను ధోని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సందర్భంగా ధోని కొత్త లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఈ లుక్ వైరల్ అవుతుంది. ఒక ఫ్యాన్ తో ధోని తీసుకున్న ఈ సెల్ఫీ వైరల్ అవుతుంది. చెన్నైలో ధోని కి ఘనస్వాగతం లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కావడంతో ధోని చెన్నై వాళ్లు ఒక రేంజ్ లో […]

Share:

ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఎల్ జి ఎం ట్రైలర్ లాంచ్ కోసం చెన్నై వచ్చాడు. ఈ సినిమాను ధోని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సందర్భంగా ధోని కొత్త లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఈ లుక్ వైరల్ అవుతుంది. ఒక ఫ్యాన్ తో ధోని తీసుకున్న ఈ సెల్ఫీ వైరల్ అవుతుంది. చెన్నైలో ధోని కి ఘనస్వాగతం లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కావడంతో ధోని చెన్నై వాళ్లు ఒక రేంజ్ లో ఆరాధిస్తారు. 

అభిమానితో ధోని సెల్ఫీ

రాంచీ నుంచి చెన్నై వెళ్తున్నప్పుడు ధోని తన అభిమాని తో కలిసి ఒక సెల్ఫీ దిగాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ధోని గడ్డంతో ఉండడం కనిపిస్తుంది. తన హెయిర్ కట్ కూడా చాలా బాగుంది. జులై 10వ తేదీన ఎల్జీఎం టైలర్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది. ఈ సినిమాని రమేష్ తమిల్నేని తీశాడు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు, మిర్చి విజయ్ నటించారు. రీసెంట్ గా ధోని తన బర్త్డేని తన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ధోని బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది.

ధోని క్రికెట్ కెరీర్:

ధోని తన కెరీర్లో చాలా సక్సెస్ఫుల్ క్రికెటర్. కెరీర్ మొదట్లో ధోని కొన్ని ఎత్తుపల్లాలు చూసాడు. తను మొదటగా ఆడిన బంగ్లాదేశ్ సిరీస్ లో ధోని అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 

అయినా అప్పటి కెప్టెన్ గంగూలి తనను నమ్మిధోని కి అవకాశాలు ఇచ్చాడు. పాకిస్తాన్ తో

విశాఖపట్నంలో 148 పరుగుల ఇన్నింగ్స్ ధోని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. తర్వాత ధోని నిలకడగా ఆడాడు. 2007 వన్డే వరల్డ్ కప్ లో ధోని కాస్త విఫలమయ్యాడు. ఆ వరల్డ్ కప్ లో భారత ఓటమితో ధోని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత అదే సంవత్సరం జరిగిన 20 20 వరల్డ్ కప్ లో ఇండియాని వరల్డ్ ఛాంపియన్ చేసి గొప్ప కెప్టెన్ అనిపించుకున్నాడు. 20 20 వరల్డ్ కప్ గెలిచాక వన్డేల్లో కూడా ధోనీని కెప్టెన్ గా నియమించారు. తర్వాత ధోని ఇండియా క్రికెట్ నే మార్చేశాడు. ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ గెలిపించాడు. తర్వాత 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2011 ప్రపంచ కప్ తర్వాత ధోని దూకుడు కాస్త తగ్గింది. ధోని కెప్టెన్సీ లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు విజయవంతమయ్యారు. ధోని ఐపిఎల్ లో కూడా గొప్ప కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కి రీసెంట్ గా కూడా ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ధోని అంటేనే సక్సెస్ అనే రేంజ్ కి తను ఎదిగాడు. ఇప్పుడు ధోని సినిమా రంగంలోకి కూడా వస్తున్నాడు. నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ధోని ప్రొడ్యూస్ చేస్తున్న ఎల్ జి ఎం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. ధోనీ కి ఘన స్వాగతం పలకడం పట్ల సాక్షి కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ధోని ముందు ముందు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం.