‘ఎంఎస్ ధోనీ ఆటని అంచనా వేసే విధానం పూర్తిగా వేరు… నేను ఒక కెప్టెన్‌గా అతనిలా మాత్రం ఉండను’: ఫాఫ్ డు ప్లెసిస్ పెద్ద వెల్లడి

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్‌ కెప్టెన్సీకి, ఇండియా జట్టులో ఆడేటప్పుడు ధోనీ కెప్టెన్సీకి గల తేడాల గురించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ధోనీ టెస్ట్ కెప్టెన్సీని, వన్డే కెప్టెన్సీని – వేర్వేరు సమయాల్లోనే అయినప్పటికీ.. కోహ్లీకి అప్పగించాడు. ఆ తరువాత వారి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని, ధోనీ ఇచ్చే సూచనలను పాటించడానికి తను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. తాను RCB కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు, డు ప్లెసిస్ […]

Share:

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్‌ కెప్టెన్సీకి, ఇండియా జట్టులో ఆడేటప్పుడు ధోనీ కెప్టెన్సీకి గల తేడాల గురించి విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ధోనీ టెస్ట్ కెప్టెన్సీని, వన్డే కెప్టెన్సీని – వేర్వేరు సమయాల్లోనే అయినప్పటికీ.. కోహ్లీకి అప్పగించాడు. ఆ తరువాత వారి మధ్య ఎటువంటి విభేదాలూ లేవని, ధోనీ ఇచ్చే సూచనలను పాటించడానికి తను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పాడు. తాను RCB కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు, డు ప్లెసిస్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందని కోహ్లీ చెప్పాడు. 

డు ప్లెసిస్ 2022లో RCB కెప్టెన్‌గా మొదటి సీజన్‌ ఆడాడు. అతను IPL ప్లేఆఫ్‌లకు జట్టుకు మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు అసాధారణమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు.

ధోనీ, డు ప్లెసిస్ కి కోహ్లీ మాత్రమే కామన్ కాదు. నిజానికి, ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఆర్‌సిబికి రావడానికి ముందు దాదాపుగా ధోనీ విధానాలే అనుసరించేవాడు. RCB పాడ్‌కాస్ట్ రెండవ సీజన్లోని 10 ఎపిసోడ్‌లలో రెండవదానిలో డు ప్లెసిస్ మాట్లాడుతూ గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనీ వంటి గొప్ప క్రికెటర్ల నుండి కెప్టెన్సీ కళను తను ఎలా నేర్చుకున్నాడో వెల్లడించాడు.

అయినప్పటికీ, 2011లో ఫాఫ్ CSKలో చేరినప్పుడు కెప్టెన్సీకి సంబంధించిన కొత్త కోణాన్ని ధోనీలో చూశానన్నాడు. 

కెప్టెన్ గా నేను

“నా కెరీర్‌లో కొన్ని రోజులు చెన్నై వెళ్లే అవకాశం వచ్చింది. గొప్ప కెప్టెన్లలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒకరు. న్యూజిలాండ్ క్రికెట్‌కు కూడా ఇతను ఒక గొప్ప వరం. విచిత్రం ఏమిటంటే, అతను ఒక ‘మ్యాన్ మేనేజర్’. కేవలం సంబంధాలపై పనిచేసే వ్యక్తి. CSKలో నా మొదటి సీజన్‌లో, నేను అతని పక్కన (ఫ్లెమింగ్ పక్కన) కూర్చున్నాను. నాకు ఎంత కుదిరితే అంత నేర్చుకోవడం కోసం కెప్టెన్సీకి, నాయకత్వానికి సంబంధించిన ప్రశ్నలు అడిగాను. అయితే, ఎంఎస్ ధోనీ మాత్రం అంతకుమించి అని పేర్కొన్నాడు.

“నేను కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్‌లా ఉండను, నేను కెప్టెన్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్‌లా ఉండను, వీళ్లందరిలా నేను ఉండను. ఒక వ్యక్తిగా నేను ఎవరనేది తెలియాలంటే, నేను నాలా ఉండాలి. ఎందుకంటే మనం మనలా లేకపోతే, జనాలకి తెలిసిపోతుంది. బహుశా బాగా పనిచేసినప్పుడు కాదు, కానీ ఖచ్చితంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు నిజమేమిటో బయటపడుతుంది, ” అని అతను చెప్పాడు. సరైన పద్ధతిలో జట్టును నడిపించడానికి అతనిని ప్రేరేపించిన విషయమేమిటో కూడా వెల్లడించాడు ఈ రైట్ హ్యాండర్. 

“ఒక క్రికెటర్‌గా, నేను ఈ స్థాయికి చెందినవాడినని, నేను ఈ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నానని నాకు అనిపించిన ఆ క్షణం, నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నాను. మరి ఆ ఆలోచన ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అప్పటి నుండి నేను ఇలాగే ఉన్నాను, ఇదే నేను చేయాలనుకుంటున్నాను. అవును, నేను సూపర్ పర్పస్ డ్రైవింగ్ అయ్యాను. ఆ తరువాత, నేను చెప్పగలిగితే, నేను ప్రోటీస్ అయ్యాను. క్రికెట్ నా గుండె చప్పుడు అయ్యింది. సౌతాఫ్రికా క్రికెట్ గురించి నేను జీవించాను, శ్వాసించాను.

డు ప్లెసిస్ కెప్టెన్‌గా మాత్రమే కాదు, RCB లో బ్యాటర్ గా కూడా ముందుండి బ్యాటింగ్‌ను నడిపించాడు. అయితే అతను 16 మ్యాచ్‌లలో 3 అర్ధ సెంచరీలు చేసి 468 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా 96 పరుగులు చేశాడు. వాస్తవానికి, అతను IPL 2022 లో అత్యధిక పరుగులు సాధించిన స్కోరర్లలో ఏడవ స్థానంలో ఉన్నాడు.