ధోనికి గాయం- ఆందోళనలో చెన్నై సూపర్ కింగ్స్

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్‌లో ధోని 2 సిక్సర్లు కొట్టాడు, అయినప్పటికీ, ఈ 41 ఏళ్ల థాలా తన జట్టును గెలిపించు కోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. చివరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ కి 21 పరుగులు చెయ్యాల్సి ఉంది. ఆ ఓవర్ వేసేందుకు సందీప్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. తన ఓవర్‌ను రెండు వైడ్‌లతో ప్రారంభించగా, తరువాతి బాల్ కి […]

Share:

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్‌లో ధోని 2 సిక్సర్లు కొట్టాడు, అయినప్పటికీ, ఈ 41 ఏళ్ల థాలా తన జట్టును గెలిపించు కోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.

చివరి ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ కి 21 పరుగులు చెయ్యాల్సి ఉంది. ఆ ఓవర్ వేసేందుకు సందీప్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. తన ఓవర్‌ను రెండు వైడ్‌లతో ప్రారంభించగా, తరువాతి బాల్ కి రన్ రాలేదు. 2వ, 3వ బంతుల్ని సిక్సర్లుగా మలిచిన ధోని.. 4వ బంతికి ఒక రన్ తీశాడు. ఇక చివరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా.. 5వ బంతికి జడేజా సింగిల్ రన్ తీసి ధోనికి స్ట్రైక్ ఇచ్చాడు. ఇక ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా.. బెస్ట్ ఫినిషర్ ధోని స్ట్రైక్ లో ఉండటంతో.. ఈ మ్యాచ్ చెన్నై గెలుస్తుందని అందరు అనుకున్నారు. కాని.. సందీప్ ఆఖరి బంతిని యార్కర్‌ వేయడంతో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి.. 3 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది చెన్నై. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై.. ఓటమి చవి చూసింది.

చివరి బంతికి ధోని కేవలం సింగిల్ మాత్రమే సేకరించగలిగాడు. IPL 2023 సీజన్‌లో రెండవ ఓటమిని చవిచూసింది చెన్నై. అయినప్పటికీ వారి లెజెండరీ కెప్టెన్ ధోని ఫిట్‌నెస్‌ సరిగా లేనందున అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తుంది.

“అతను మోకాలి గాయంతో బాధపడుతున్నాడు, అతను ఇబ్బంది పడుతున్నట్టు మీరు గమనించవచ్చు. ఇది అతనికి కొంత ఆటంకం కలిగిస్తుంది. అయితే అతని ఫిట్‌నెస్ ఎప్పుడూ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ధోని టోర్నమెంట్ ప్రారంభానికి ఒక నెల ముందు గ్రౌండ్ కి వస్తాడు. అతను ఓ గొప్ప ఆటగాడు. అతని మీద మాకు ఎప్పుడూ అనుమానం లేదు. అతను అద్భుతంగా ఆడతాడు” అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఫ్లెమింగ్  చెప్పాడు.

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారతదేశం 2007లో ICC T20 వరల్డ్ కప్, 2011లో క్రికెట్ ప్రపంచ కప్, 2013లో  ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2010 మరియు 2016 ఆసియా కప్‌లలో కూడా అతను భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ధోని కుడిచేతి వాటం కలిగిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 17,266 పరుగులు చేశాడు (ODI ఇంటర్నేషనల్స్‌లో 10,000 ప్లస్ పరుగులతో సహా) మరియు ఆటలో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు, అలాగే క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్ మరియు కెప్టెన్‌లలో ఒకరిగా పేరుగాంచారు

భారత దేశవాళీ క్రికెట్‌లో అతను బీహార్‌కు, ఆపై జార్ఖండ్ క్రికెట్ జట్టుకు ఆడాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్‌గా ఉన్నాడు. వారిని 9 సందర్భాలలో ఫైనల్‌కు చేర్పించాడు. 2010, 2011, 2018 మరియు 2021 ఎడిషన్‌లలో ట్రోఫీ గెలిపించి పెట్టాడు. అలాగే రెండు ఛాంపియన్స్ లీగ్ T20లు టోర్నీలు గెలిపించిపెట్టాడు. అతను IPLలో 5,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన 7వ క్రికెటర్, అలాగే అలా చేసిన మొదటి వికెట్ కీపర్ కూడా.