ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి మహ్మద్ సిరాజ్

టీమిండియా పేస‌ర్.. మన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. బౌల‌ర్ల జాబితాలో 694 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆసియాకప్‌ ఫైనల్‌లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. శ్రీలంకను చావుదెబ్బతీసి.. ఆసియా కప్‌ టీమిండియా సొంతం చేసుకోవడంలో కీ రోల్ పోషించాడు. ఆసియా కప్‌నకి ముందు సిరాజ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తన […]

Share:

టీమిండియా పేస‌ర్.. మన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. బౌల‌ర్ల జాబితాలో 694 పాయింట్లతో సిరాజ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆసియాకప్‌ ఫైనల్‌లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. శ్రీలంకను చావుదెబ్బతీసి.. ఆసియా కప్‌ టీమిండియా సొంతం చేసుకోవడంలో కీ రోల్ పోషించాడు.

ఆసియా కప్‌నకి ముందు సిరాజ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఏకంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలో తనపేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఏకంగా 8 స్థానాలు మెరుగుపరుచుకుని నెంబర్ వన్ ప్లేస్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి, రషీద్ ఖాన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నారు. 

టాప్ 10లో భారత్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహరాజ్ 10 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో 33 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన కేశవ్.. 16.87 యావరేజ్, 4.07 ఎకానమీతో ఐదు వన్డేల సిరీస్‌లో 8 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ వోక్స్ (11వ స్థానం), దక్షిణాఫ్రికాకు చెందిన లుంగి ఎన్‌గిడి (21వ స్థానం) కూడా లాభపడ్డారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా 27వ స్థానంలో ఉన్నాడు.

ఇక బ్యాటర్ల జాబితాలో వన్డే ర్యాంకింగ్‌లో శుభ్‌మన్ గిల్ సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. బాబర్ అజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో పాటు భారత్ నుంచి విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానంలో, రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో విధ్వంసం సృష్టించి 209.64 స్ట్రైక్ రేట్‌తో 174 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ 20 స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు.

ICC ఇటీవలి ర్యాంకింగ్స్‌ను అప్‌డేట్ చేసింది. గత వారం, ఆసియా కప్‌లో చివరి మ్యాచ్‌లతో పాటు, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు, ఇంగ్లాండ్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా జరిగింది. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌పై ఓటమి కారణంగా భారత జట్టు అగ్రస్థానానికి చేరుకోలేకపోయింది. అయితే దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు పరాజయాల తర్వాత ఆస్ట్రేలియా జట్టు మూడవ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ సూపర్ 4లో పేలవ ప్రదర్శన కనబరిచినప్పటికీ, పాకిస్థాన్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

టాప్ 10కి వెలుపల ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ కెరీర్‌లో అత్యుత్తమ 13వ స్థానంలో ఉండగా, వన్డే జట్టులోకి తిరిగి వచ్చిన బెన్ స్టోక్స్ 13 స్థానాలు ఎగబాకి 36వ స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ నాలుగు స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో, శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక రెండు స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ ఐదు స్థానాల లాభంతో 29వ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ కారీ కూడా మూడు స్థానాలు ఎగబాకి 29వ స్థానంలో ఉన్నాడు.

వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, భారత్ నుంచి హార్దిక్ పాండ్యా టాప్ 10లో ఆరో స్థానంలో ఉన్నాడు.