Sunil Gavaskar: కపిల్ దేవ్ మాదిరే షమీ కూడా..: సునీల్ గవాస్కర్

భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) తన సత్తా ఏంటో వన్డే ప్రపంచకప్ 2023 వేదికగా బాల్ తో చూపిస్తున్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్ లో షమీ బౌలింగ్ హైలైట్ గా నిలవడం తెలిసిందే.  షమీ అద్భుతమైన బౌలింగ్ ఎటాక్(Bowling attack) పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) స్పందించారు. షమీని భారత్ మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్(Kapil Dev) తో పోల్చారు.  7 ఓవర్లు సంధించిన షమీ నాలుగు వికెట్లు […]

Share:

భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) తన సత్తా ఏంటో వన్డే ప్రపంచకప్ 2023 వేదికగా బాల్ తో చూపిస్తున్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్ లో షమీ బౌలింగ్ హైలైట్ గా నిలవడం తెలిసిందే.  షమీ అద్భుతమైన బౌలింగ్ ఎటాక్(Bowling attack) పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) స్పందించారు. షమీని భారత్ మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్(Kapil Dev) తో పోల్చారు.  7 ఓవర్లు సంధించిన షమీ నాలుగు వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించాడు. పైగా ఏడు ఓవర్లలోనూ ఇచ్చిన పరుగులు ఓవర్ కు 3 మించలేదు. కీలమైన బేర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వికెట్లు తీశాడు.

“అయితే ఇదంతా ఒక్కరోజులోనో.. ఒక్క రాత్రిలోనో జరిగిపోలేదు. దీని వెనుక షమీ కష్టం ఉంది.. కొన్నేళ్ల శ్రమ ఉంది. అంతకుమించి సొంతూరు అలీనగర్(Alinagar) ఉంది. స్టార్ క్రికెటర్‌గా మారి కోట్ల రూపాయలు సంపాందించడం గొప్ప విషయమేమీ కాదు. కానీ ఆట కోసం కోట్లు ఖర్చుపెట్టడం గొప్ప. ఎంత ఎదిగినా ఆటలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని తపన పడటం గొప్ప. అలాంటి ప్లేయర్లలో ఒకడు మహ్మద్ షమీ..  అతడు వ్యక్తిగత క్రికెట్ సామర్థ్యంపై దృష్టి పెట్టాడు. అతడిలోని ప్రత్యేకత ఏంటి అంటే అది ఫాస్ట్ బౌలింగ్(Fast Bowling). అతడు నివసించే చోటే నెట్స్ మధ్య ఎన్నో ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తుంటాడు. అతడు జిమ్ కు వెళతాడా అన్నది నాకు తెలియదు. కానీ, అంతిమంగా మహమ్మద్ షమీ(Mohammed Shami) అచ్చం కపిల్ దేవ్(Kapil Dev) మాదిరే చేస్తున్నాడు’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

Also Read: Mohammed Shami: అలన్ డొనాల్డ్‌ రికార్డును బ్రేక్ చేసిన మహ్మద్ షమీ

‘‘వద్దు వద్దు, కేవలం 15 లేదా 20 బంతులే నెట్స్ లో వేయాలన్న బయో మెకానిక్ నిపుణుల సూచనలను అతడు వినిపించుకోవడం లేదు. ఒక ఫాస్ట్ బౌలర్(Fast Bowler) గా ఎన్నో మైళ్ల పాటు పరుగెత్తగల సామర్థ్యం కాళ్లకు ఉండాలన్న విషయం అతడికి తెలుసు. దాన్నే అతడు చూపిస్తున్నాడు. అతడి రిథమ్ కూడా ఎంతో బావుంది. అతడు బాల్ తో పరుగెత్తుతున్నప్పుడు డ్రోన్ కెమెరాతో చూస్తే చీతా మాదిరే ఉంటుంది’’ అని గవాస్కర్ షమీని మెచ్చుకున్నారు.

సొంతంగా క్రికెట్ గ్రౌండ్

ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పుర్ అలీనగర్(Saashpur Alinagar) మహ్మద్ షమీ సొంతూరు. ఇక్కడే వివిధ రకాల పిచ్‌లతో సొంతంగా క్రికెట్ గ్రౌండ్ తయారు చేయించాడు మహ్మద్ షమీ. ఈ పిచ్‌ల మీద చేసిన బౌలింగ్ ప్రాక్టీస్.. వైట్ బాల్ క్రికెట్లో మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుత ప్రదర్శనలకు కారణమవుతోంది. మెరుగైన సౌకర్యాల కోసం సిటీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రాక్టీస్‌కు ఇబ్పంది కలగకుండా ఉండేలా వివిధ రకాల పిచ్‌లతో షమీ ఈ గ్రౌండ్ నిర్మించాడు. క్రికెట్ తప్ప షమీకి మరో జీవితం లేదని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. 

ఇండియా(India)కు ఆడనప్పుడు.. నైపుణ్యాలను మరింతగా ఎలా మెరుగుపరుచుకోవచ్చనే దానిపైనే ఆలోచిస్తూ ఉంటాడని చెప్తారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన విండీస్ టూర్ నుంచి విరామం దొరికిన సమయంలో షమీ ఈ గ్రౌండ్లోనే ప్రపంచకప్(World Cup) కోసం ప్రాక్టీస్ సాధన ప్రారంభించాడని షమీ చిన్నప్పటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్(Mohammad Badruddin) తెలిపారు. సొంత ఖర్చుతో నిర్మించుకున్న ఆ గ్రౌండ్లోనే షమీ నిరంతరం సాధన చేస్తుంటాడని వివరించారు.

2020 నవంబర్‌ తర్వాత మహ్మద్ షమీని వన్డేల నుంచి పక్కనబెట్టారు. 2022 జులై వరకూ సుమారు 19 నెలల పాటు బ్లూజెర్సీకి దూరంగా గడిపాడు షమీ. అయితే అదృష్టవశాత్తూ అతనికి వన్డేలలో సెలెక్టర్ల నుంచి తిరిగి పిలుపువచ్చింది. బుమ్రా, ప్రసిధ్ కృష్ణ గాయపడటంతో షమీకి స్థానం దక్కింది. “టీమిండియా(Team india)కు తన అవసరం వస్తుందని షమీ బలంగా నమ్మాడు. అందుకే జట్టుతో లేకున్నా కూడా ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు. సొంత డబ్బులు ఖర్చుపెట్టి అన్ని సౌకర్యాలతో ఉన్న గ్రౌండ్ నిర్మించాడు. ఇక్కడ మూడు రకాల పిచ్‌లు సిద్ధం చేయించాడు. ఒక పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉంటుంది. మరొక పిచ్ మీద పచ్చిక ఉంటుంది. బాల్ గ్రిప్ అయ్యి వచ్చేలా మరో పిచ్ తయారు చేయించాడు. అతను పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయడం ఇక్కడే నేర్చుకున్నాడు”.. అని షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ వివరించారు.