2024 ఐపీఎల్‌లో రిషబ్ పంత్ కనిపించకపోవచ్చు

ఇటీవల BCCI కొంతమంది క్రికెటర్ల ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. ఇదే క్రమంలో రిషబ్ పంత్ గురించి కూడా వెల్లడించింది. అయితే ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ అనంతరం, రిషబ్ బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ విషయంలో మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని, వచ్చే వరల్డ్ కప్ లో తన పార్టిసిపేషన్ గురించి క్లియర్ గా చెప్పనప్పటికీ, తాను కోలుకుంటే తప్పకుండా క్రికెట్ గ్రౌండ్లో అడుగు పెడతాడు అని వెల్లడించింది BCCI.  ఇశాంత్ శర్మ చెప్పిన విషయాలు:  అయితే ప్రస్తుతం […]

Share:

ఇటీవల BCCI కొంతమంది క్రికెటర్ల ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. ఇదే క్రమంలో రిషబ్ పంత్ గురించి కూడా వెల్లడించింది. అయితే ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ అనంతరం, రిషబ్ బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ విషయంలో మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని, వచ్చే వరల్డ్ కప్ లో తన పార్టిసిపేషన్ గురించి క్లియర్ గా చెప్పనప్పటికీ, తాను కోలుకుంటే తప్పకుండా క్రికెట్ గ్రౌండ్లో అడుగు పెడతాడు అని వెల్లడించింది BCCI. 

ఇశాంత్ శర్మ చెప్పిన విషయాలు: 

అయితే ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్ అనంతరం, రిషబ్ బ్యాటింగ్ అలాగే ఫీల్డింగ్ విషయంలో మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని, వచ్చే వరల్డ్ కప్ లో తన పార్టిసిపేషన్ గురించి క్లియర్ గా చెప్పనప్పటికీ, తాను కోలుకుంటే తప్పకుండా క్రికెట్ గ్రౌండ్లో అడుగు పెడతాడు అని వెల్లడించింది BCCI. కానీ ఇషాంత్ శర్మ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా వివరించారు. రిషబ్ కి తగిలింది మామూలు గాయం కాదని, తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పుకొచ్చారు. 

అయితే బీసీసీఐ వెల్లడించిన నివేదిక ప్రకారం, రిషబ్ బ్యాటింగ్ అలాగే వికెట్ కీపింగ్ వంటి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ, క్రికెట్ గ్రౌండ్ బరిలో దిగిన తర్వాత పరిగెట్టడం లాంటివి ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి అని, కేవలం ఒక బాటర్ అలాగే వికెట్ కీపర్ గా ఉన్నప్పటికీ పరిగెట్టడం లాంటివి చేయాల్సి అవసరం తప్పకుండా ఉంటుంది కాబట్టి, రిషబ్ వచ్చే ఐపిఎల్ లో పార్టిసిపేట్ చేయలేడు అని తాను భావిస్తున్నట్లు ఇశాంత్ శర్మ పేర్కొన్నాడు. 

ప్రస్తుతానికి, రిషబ్ కి కేవలం ఒక్క సర్జరీ అయినందువలన తాను త్వరగానే కోలుకోవచ్చు అని, అయితే ఈ సంవత్సరం అక్టోబర్ లో జరగబోయే వరల్డ్ కప్ లో రిషబ్ కచ్చితంగా పాటిస్పేట్ చేయడు అని, ఒకవేళ తన ఆరోగ్యం కుదుటపడి పూర్తిగా ఫిట్ అయితే మాత్రం నెక్స్ట్ రాబోయే ఐపీఎల్ విషయంలో, రిషబ్ ఆలోచించే అవకాశం ఉందని, ఇశ్శాంత్ శర్మ చెప్పాడు. 

BCCI నివేదిక: 

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రస్తుతం కోలుకుంటున్నా ఐదుగురు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం, జూలై 21న మెడికల్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ప్రముఖ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఇంకా శ్రేయాస్ అయ్యర్‌లు, క్రికెట్ ఆటలో తీవ్రంగా గాయపడ్డారు, అయితే వీరికి సర్జరీలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఆటగాళ్ళు అన్ని రకాల గా మన భారత జట్టులో ముఖ్యమైన సభ్యులు, అంతేకాకుండా ప్రస్తుతం వారు పాల్గొంటారా లేదా అనే విషయం తేలం ఉంది. ఒకవేళ వారు ఆడినట్టు అయితే అంతర్జాతీయ అసైన్‌మెంట్‌లలో జట్టు పనితీరులో చాలా వరకు నెగిటివ్ ప్రభావం అయితే కనిపిస్తుందని అంచనా.

ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం బ్యాక్ బోన్ గాయం నుండి కోలుకుంటున్నాడు, జస్ప్రీత్ బుమ్రా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. రిషబ్ పంత్ మోకాలికి తీవ్ర గాయం అయింది, కెఎల్ రాహుల్ తొడకి దెబ్బ తగిలింది, శ్రేయాస్ అయ్యర్ బ్యాక్ బోన్ సమస్య నుండి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. BCCI వారిని జాగ్రత్తగా చూసుకున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా, వారు త్వరగా కోలుకోవడానికి అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తోంది.