Bishan Singh Bedi: భారత లెజెండరీ స్పిన్నర్ కన్నుమూత..

టీమ్ ఇండియా స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం కన్నుమూశారు. 22 మ్యాచ్‌లలో బిషన్ సింగ్ బేడీ ఇండియా(India)కు నాయకత్వం వహించారు. వన్డేలలో ఇండియా తొలి విక్టరీ కొట్టిందంటే దానికి కారణం బిషన్ సింగ్ బేడీనే. భారత క్రికెట్ మాజీ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. బిషన్ సింగ్ బేడీ సోమవారం నాడు అనారోగ్యం కారణంగా మరణించారు. […]

Share:

టీమ్ ఇండియా స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం కన్నుమూశారు. 22 మ్యాచ్‌లలో బిషన్ సింగ్ బేడీ ఇండియా(India)కు నాయకత్వం వహించారు. వన్డేలలో ఇండియా తొలి విక్టరీ కొట్టిందంటే దానికి కారణం బిషన్ సింగ్ బేడీనే.

భారత క్రికెట్ మాజీ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. బిషన్ సింగ్ బేడీ సోమవారం నాడు అనారోగ్యం కారణంగా మరణించారు. చనిపోయే నాటికి బిషన్ సింగ్ బేడీకి 77 సంవత్సరాలు. 1946 సెప్టెంబర్ 25వ తేదీన బిషన్ సింగ్ బేడీ అమృత్‌సర్‌(Amritsar)లో జన్మించారు. 1966 నుంచి 1979 వరకు బిషన్ సింగ్ బేడీ టీమ్ ఇండియాకు ఆడారు. ఆయనన 22 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌(Captain)గా కూడా ఉన్నాడు. బిషన్ సింగ్ బేడీ భారత జట్టులోని స్పిన్ క్వార్టెట్‌లో ఒక భాగం. ఈ స్పిన్ క్వార్టెట్ 1970ల్లో చాలా ప్రసిద్ధి చెందింది. బిషన్ సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్. వెంకటరాఘవన్.. నలుగురూ కూడా ఇండియన్ స్పిన్ బౌలింగ్ చరిత్రలోనే ఓ రెవెల్యూషన్ తీసుకువచ్చారు.

13 సంవత్సరాల కెరీర్

1966 డిసెంబర్ 12వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌‌(Eden Gardens)లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో బిషన్ సింగ్ బేడీ తన అరంగేట్రం చేశారు. తన చివరి టెస్టును 1979 ఆగస్టు 16వ తేదీన ఇంగ్లండ్‌తో కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆడాడు. బిషన్ సింగ్ బేడీ 1974 జులై 14వ తేదీన ఇంగ్లండ్‌పై హెడ్డింగ్లీలో తన వన్డే అరంగేట్రం(Debut) చేశారు. 1979 జూన్ 16వ తేదీనన ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో శ్రీలంక(Srilanka)తో తన చివరి వన్డే ఆడారు.

ముఖ్యంగా వన్డేలలో టీమిండియా తొలి విజయాన్ని అందుకుందంటే.. అది బిషన్ సింగ్ బేడీ వల్లేనని చెప్పవచ్చు. 1975 ప్రపంచకప్‌(Worldcup)లో భాగంగా ఈస్ట్ ఆఫ్రికాతో తలపడిన భారత్. 120 పరుగుల తేడాతో వారిని చిత్తుచేసి వన్డేలలో తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన బిషన్ సింగ్ బేడీ..8 మెయిడెన్ ఓవర్లు విసిరారు. కేవలం ఆరు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.

బిషన్ సింగ్ బేడీ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌(West Indies)తో జరిగిన టెస్టు మ్యాచ్‌ను 406 పరుగుల రికార్డుతో గెలుచుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌(Port of Spain)లో భారత్, వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత బిషన్ సింగ్ బేడీ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి కంగారూలను ఇబ్బందుల్లోకి నెట్టాడు.

బిషన్ సింగ్ బేడీ కెరీర్ ఇలా…

బిషన్ సింగ్ బేడీ భారత్(India) తరఫున 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్ దాదాపు 13 సంవత్సరాల పాటు కొనసాగింది. బిషన్ సింగ్ బేడీ తన టెస్టు కెరీర్‌లో 266 వికెట్లు పడగొట్టాడు. బిషన్ సింగ్ బేడీ బౌలింగ్ 28.71గా ఉంది. టెస్టు మ్యాచ్‌ల్లో 98 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడం ఆయన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. టెస్టు మ్యాచ్‌లో ఒకసారి 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అలాగే బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) 14 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. టెస్ట్ మ్యాచ్‌లు కాకుండా బిషన్ సింగ్ బేడీ 10 వన్డే మ్యాచ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బిషన్ సింగ్ బేడీ వన్డే ఫార్మాట్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో బిషన్ సింగ్ బేడీ సగటు 48.57గా ఉంది.  ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 370 మ్యాచ్‌లలో 1560 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలరల్లో ఒకడిగా ఉన్నారు.