కొరియా ఓపెన్ బ్యాడ్మింట‌న్: ఫైన‌ల్స్‌కి సాత్విక్ సాయిరాజ్, రాంకి రెడ్డి, చిరాగ్ శెట్టి

చైనా ప్రపంచ చాంపియన్స్ ని, బ్యాట్మెంటన్ సెమీ ఫైనల్స్ లో వెనక్కి నెట్టి.. భారత డబల్ బ్యాట్మెంటన్ మెన్స్ లో, కొరియ 2023 బ్యాడ్మింటన్ ఫైనాన్స్ లోకి సాత్విక్ సాయిరాజ్ అంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఎంపికయ్యారు. ఈ జట్టు రిపబ్లిక్ ఆఫ్ చైనా చెందిన లియాంగ్ వెయిటింగ్, వాంగ్ చాంగ్లను ఓడించారు. చైనాకు చెందిన వీరిద్దరికీ ప్రపంచంలోనే బ్యాడ్మింటన్ లో నెంబర్ 2 ర్యాంకింగ్ ఉంది.  సెమీ ఫైనల్ లో రేకెత్తించిన ఆసక్తి:  కొరియా ఓపెన్ […]

Share:

చైనా ప్రపంచ చాంపియన్స్ ని, బ్యాట్మెంటన్ సెమీ ఫైనల్స్ లో వెనక్కి నెట్టి.. భారత డబల్ బ్యాట్మెంటన్ మెన్స్ లో, కొరియ 2023 బ్యాడ్మింటన్ ఫైనాన్స్ లోకి సాత్విక్ సాయిరాజ్ అంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఎంపికయ్యారు. ఈ జట్టు రిపబ్లిక్ ఆఫ్ చైనా చెందిన లియాంగ్ వెయిటింగ్, వాంగ్ చాంగ్లను ఓడించారు. చైనాకు చెందిన వీరిద్దరికీ ప్రపంచంలోనే బ్యాడ్మింటన్ లో నెంబర్ 2 ర్యాంకింగ్ ఉంది. 

సెమీ ఫైనల్ లో రేకెత్తించిన ఆసక్తి: 

కొరియా ఓపెన్ 2023 బ్యాట్మెంటన్ సెమీఫైనల్స్ లో, భారత క్రీడాకారులు ఇద్దరు రిపబ్లిక్ ఆఫ్ చైనా టీం తో ఆడుతున్నప్పుడు ఆట చాలా హోరా హోరీగా జరిగింది. రెండు జట్లు తమ ఆటను చాలా బాగా ప్రదర్శించడంతో, చివరి నిమిషం వరకు గెలుపు ఎవరిదో అనే ఆసక్తితో కొనసాగింది. అయితే చివరి నిమిషంలో భారత క్రీడాకారులు ఇద్దరు చాలా చక్కగా ఆడి ఫైనల్స్ లోకి దూసుకువెళ్లారు. ప్రపంచంలో టాప్ టు ర్యాంకింగ్ లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ చైనా టీంని ఓడించి గెలిచారు. 

సాత్విక్ సాయిరాజ్: 

సాత్విక్ సాయిరాజ్ రంకి రెడ్డి ఆగస్టు 13, 2000 లో ఆంధ్రప్రదేశ్లో, అమలాపురంలో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటినుంచి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. 2014లో హైదరాబాదులో ఉన్న పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ లో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఇతని రికార్డ్స్ చూసుకున్నట్లయితే 2022లో టోక్యోలో జరిగిన మెన్స్ డబల్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో,  ఇతను పాల్గొన్నారు. 2022 బ్యాంకాక్ లో జరిగిన థామస్ కప్ లో మెన్స్ టీం లో ఆడాడు. 2016 ఏషియా టీం ఛాంపియన్షిప్ హైదరాబాదులో జరిగిన మెన్స్ టీం లో ఆడాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్, గోల్డ్ కాస్ట్ టీం తరపున ఆడాడు. 2023 దుబాయ్ లో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ లో మెన్స్ డబల్ ఆడాడు. 

ఇందులో రాంకి రెడ్డి చిరాగ్ జట్టుతో కలిసి మెన్స్ డబల్ బ్యాడ్మింటన్ లీగ్ లు ఎన్నో ఆడాడు. అయితే వీరిద్దరూ థాయిలాండ్ ఓపెన్ టైటిల్ నీ గెలవడంలో ప్రపంచంలోనే మొదటి భారత డబల్ బ్యాడ్మింటన్ పెయిర్ అని చెప్పవచ్చు. వీళ్లిద్దరి మధ్య కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ చాలా ఛాంపియన్షిప్ లీగులు ఆడారు. 2018 నుండి వీళ్ళిద్దరికీ కెరీర్ జట్టు మొదలైంది. వీళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ పట్ల చూపే ఆసక్తి చాలా గొప్పది. అంతేకాకుండా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. ఇతని స్మాషింగ్ స్పీడ్ 565 గంటకి కిలోమీటర్లు అని చెప్పచ్చు. ఈ స్పీడ్ ఇప్పటివరకు ఎవరికీ లేదు. 2020 లో అర్జున అవార్డు కూడా లభించింది. 

చిరాగ్ శెట్టి: 

చిరాగ్ శెట్టి జూలై 4న 1997 ముంబైలో జన్మించాడు. ఇతనకి చిన్నప్పటినుండి బ్యాట్మెంటన్ అంటే చాలా ఇష్టం. ఇతని కెరీర్ కూడా 2018లో రాంకి రెడ్డితో డబల్ బ్యాడ్మింటన్ ఆడడంతోనే మొదలైంది. 2020 లో అర్జున అవార్డు వచ్చింది.

2022లో రంకిరెడ్డి తో కలిసి ఇండియా ఓపెన్ టైటిల్ని గెలిచాడు. వీళ్లు థామస్ కప్ లో కూడా భాగంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కామన్వెల్త్ గేమ్స్ లో పాపులర్ పెయిర్, బెన్ లైన్ మరియు సీన్ వెండి లను ఓడించి గోల్డ్ మెడల్ తెచ్చారు. బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్డ్ టీం ఛాంపియన్షిప్స్ లో ఇండియాకు బ్రాంజ్ మెడల్ ని తెచ్చారు.

ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో వీళ్ళిద్దరూ ఆట చూసేందుకు తమ అభిమానులు మరియు బ్యాడ్మింటన్ ప్రియులు చాలా ఆసక్తితో ఉన్నారు. చిరాగ్ శెట్టి మరియు రామ్కీ రెడ్డి మెన్స్ డబల్ బ్యాట్మెంటన్ ఫైనల్స్ లో ఎవరు నెగ్గనున్నారో భారతదేశమంతా ఆసక్తితో ఎదురు చూస్తుంది.