చెలరేగిన కోహ్లీ, రాహుల్.. వరల్డ్‌కప్‌లో భారత్‌ బోణీ

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా శుభారంభం చేసింది. వన్డే క్రికెట్‌లో మరోసారి విశ్వవిజేతగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి అడుగును బలంగా వేసింది. ఆస్ట్రేలియా‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో కోహ్లీ, కేఎల్ రాహుల్  సమష్టిగా రాణించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో స్పిన్నర్లు సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్‌లో […]

Share:

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా శుభారంభం చేసింది. వన్డే క్రికెట్‌లో మరోసారి విశ్వవిజేతగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి అడుగును బలంగా వేసింది. ఆస్ట్రేలియా‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో కోహ్లీ, కేఎల్ రాహుల్  సమష్టిగా రాణించడంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

బౌలింగ్‌లో స్పిన్నర్లు సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ, క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు. 

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.

2 పరుగులు 3 వికెట్లు..:

200 స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 2 పరుగుల వ్యవధిలోనే టాప్-3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల ధాటికి ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. హజెల్ వుడ్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ కూడా డకౌటయ్యాడు.

కోహ్లీ క్యాచ్ నేలపాలు..:

రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ కూడా చెత్త షాట్‌తో డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇక హజెల్ వుడ్ వేసిన 8వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విరాట్ కోహ్లీ.. జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ క్విక్ సింగిల్స్, డబుల్స్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 27 పరుగులే చేసింది. అనంతరం ఆడమ్ జంపాను కమిన్స్ బరిలోకి దించగా.. రాహుల్ అటాకింగ్ గేమ్ ఆడాడు. వరుస బౌండరీలతో కాస్త దూకుడు కనబర్చాడు. విజయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కీ రోల్ ప్లే చేసి హీరోలుగా నిలిచారు. భారత్ తరఫున కోహ్లి 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇద్దరి సూపర్ భాగస్వామ్యంతో టీమిండియా తన వేట మొదలుపెట్టింది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన.. కేఎల్ రాహుల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

ప్రశంసల వర్షం

ప్రస్తుతం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. టీమిండియా మిడిలార్డర్ కు వెన్నెముకగా నిలిచాడంటూ కితాబిస్తున్నారు మాజీ క్రికెటర్లు, అభిమానులు. అయితే, ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లకు కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయడంపై విపరీతమైన చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో కేఎల్ రాహుల్ పెద్దగా ఫామ్ లో లేడు. టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న అతడు పూర్ ఫామ్ తో దానిని కోల్పోయాడు. టెస్టు జట్టు ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి స్థానాన్ని కోల్పోయాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో పరమ జిడ్డు బ్యాటింగ్ తో విమర్శల పాలైయ్యాడు. అనంతరం గాయపడ్డాడు. దాంతో నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. 

అయితే తాజాగా కోలుకోవడంతో అతడిని ప్రధాన వికెట్ కీపర్ గా ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ లకు ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే.. బీసీసీఐ అతన్ని సెలక్ట్ చేయడంతో జట్టులో చోటు దండగ అని కామెంట్లు చేశారు. సంజూ శాంసన్, తిలక్ వర్మ లాంటి క్రికెటర్లకు ఛాన్సులివ్వాలని డిమాండ్ చేశారు. అయితే, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. అంతేకాకుండా జట్టులో చోటు దక్కించుకోవడమే కష్టంగా ఉన్న రాహుల్.. ఇప్పుడు ఆపద్భాందువుడిగా మారాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కేఎల్ రాహులే తన బ్యాటింగ్ తో అండగా నిలుస్తున్నాడు.