మ‌రో పి.టి ఉష‌.. మ‌న జ్యోతి య‌ర్రాజీ

వైజాగ్ కి చెందిన, యువ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీ, గురువారం నాడు బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌:  బ్యాంకాక్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన జ్యోతి యర్రాజీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అభినందించారు. యర్రాజీ తన గొప్ప నైపుణ్యంతో అందరినీ గర్వపడేలా చేసిందని ఆనందంతో జగన్మోహన్ […]

Share:

వైజాగ్ కి చెందిన, యువ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీ, గురువారం నాడు బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌: 

బ్యాంకాక్‌లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన జ్యోతి యర్రాజీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అభినందించారు. యర్రాజీ తన గొప్ప నైపుణ్యంతో అందరినీ గర్వపడేలా చేసిందని ఆనందంతో జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

23 ఏళ్ల యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో ఇద్దరు జపనీస్ రన్నర్లు టెరాడా అసుకా (13.13 సెకన్లు) మరియు అయోకి మసుమి (13.26 సెకన్లు) కంటే ముందు 13.09 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని విజయం సాధించారు.

జ్యోతి గురించి మరింత: 

జ్యోతి, ఆగష్టు 28, 1999 న జన్మించింది. తన తండ్రి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. తన తల్లి ఒక ఆసుపత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగి. కుటుంబం మొత్తం సంపాదన నెలకు 18,000 కంటే తక్కువ. జ్యోతి పెరిగిన వాతావరణంలో, కుటుంబ ఆదాయాన్ని పెంచాలనే సంకల్పంతో పెరిగారు. ఇది ఆమెకు క్రీడా ప్రయాణం సాగించేందుకు పెద్ద ప్రేరణగా మారింది.

జ్యోతి చదువుకునే రోజుల్లో విశాఖపట్నంలోని పోర్ట్ డిఎల్‌బి హైస్కూల్‌లో ఎక్కువ ప్రాక్టీస్ చేసేది. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆమె మంచి ఎత్తుకు ఎదుగుతుందని మంచి హర్డిలర్ అని గమనించారు. దాంతో ఆమెకు విశాఖ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ద్వారా అవకాశం దొరికింది. అక్కడ ఏపీ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన తన మెంటర్ ఎం. నారాయణరావును కలిశారు.

నారాయణరావు మాటల్లో: 

జ్యోతి ప్రయాణం చాలా కఠినమైనది. ఆమె నాగార్జున యూనివర్శిటీలోని ఎక్సలెన్స్ సెంటర్‌లో చేరింది, అక్కడ ఆమెకు ఒక విదేశీ కోచ్ ద్వారా శిక్షణ అందింది. తర్వాత అక్కడ కేంద్రం మూతపడడంతో ఆమె భువనేశ్వర్ వెళ్లారు. ఆమె కోచింగ్ తీసికునే క్రమంలో చాలా కష్టపడిందని నారాయణ రావు వివరించారు. జ్యోతి ప్రస్తుత కోచ్ జెమ్స్ కె. హిల్లర్, మాజీ ఒలింపియన్. నారాయణరావు మాట్లాడుతూ, తొమ్మిది నెలల్లో, జ్యోతి తన తొమ్మిది రికార్డులను తానే బద్దలు కొట్టింది అన్నారు. ఆమెలో పి.టి. ఉష కనిపిస్తుంది అన్నారు.

వచ్చే నెలలో జ్యోతి చైనాకు వెళ్లనుంది. ఆమె 2024లో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లనుంది. తర్వాత, ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని మహిళల్లో అత్యంత వేగవంతమైన 100 మీటర్ల హర్డిలర్‌గా జ్యోతిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 

అద్భుత క్రీడాకారులు మరెందరో: 

అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీ) మరియు అబ్దుల్లా అబూబకర్ (పురుషుల ట్రిపుల్ జంప్) ఆసియా అథ్లెటిక్స్‌లో రెండవ రోజున మరో మూడు స్వర్ణాలను దక్కించుకోవడానికి ప్రయత్నించగా, హర్డలర్ జ్యోతి యర్రాజీ భారతదేశానికి మొదటి బంగారు పథకాన్ని తీసుకొచ్చారు. నేషనల్ స్టేడియంలో ఉదయం సెషన్‌లో డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్ (కాంస్యం, 7527 పాయింట్లు), మహిళల 400 మీటర్లలో ఐశ్వర్య కె మిశ్రా భారతదేశం యొక్క రెండవ కాంస్యాన్ని గెలుచుకుంది.