‘చీప్’గా పదవి పోగొట్టుకున్న చీఫ్

ప్రపంచ క్రికెట్​ను శాసిస్తున్న బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి పెద్దగా ఉన్న చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నోరు జారారు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్​లో ఆయన అడ్డంగా దొరికిపోయారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో చేతన్ శర్మ పదవికి ఎసరు వచ్చింది. ఇంటా బయటా చేతన్ శర్మ మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన తన చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషాకు తన రాజీనామా లేఖను […]

Share:

ప్రపంచ క్రికెట్​ను శాసిస్తున్న బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి పెద్దగా ఉన్న చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నోరు జారారు

ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్​లో ఆయన అడ్డంగా దొరికిపోయారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో చేతన్ శర్మ పదవికి ఎసరు వచ్చింది. ఇంటా బయటా చేతన్ శర్మ మీద తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన తన చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషాకు తన రాజీనామా లేఖను పంపారు. అలా చేతన్ రాజీనామాను పంపగానే బీసీసీఐ బాస్​గా ఉన్న జైషా దానిని అప్రూవ్ చేశారు. దీంతో చేతన్ చీఫ్​ సెలెక్టర్ చీప్​గా పోయింది.

మనోళ్లు ఫిట్​నెస్ కోసం అదే చేస్తారు

ఇండియన్ క్రికెటర్ల ఫిట్​నెస్ లెవెల్స్ ఒక రేంజ్​లో ఉంటాయని అందరికీ తెలిసిందే. అటువంటి విషయంలో చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఆటగాళ్లు ఫిట్​నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని ఆయన అన్నట్లు స్టింగ్ ఆపరేషన్​లో బయటపడింది. అసలు ఆయన ఇలా అనడం పెద్ద దుమారాన్నే లేపింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్​–3 ర్యాంకుల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. అసలు ఇండియన్ క్రికెటర్ల స్టాండర్డ్ ఎంత అని చాలా మందికి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక అంతే కాకుండా కోహ్లీ మనస్తత్వం పైనా చేతన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ తనకు తాను బాగా ఊహించుకుంటాడని, తనే సర్వస్వం అని, బోర్డు కన్నా కూడా తనే ఎక్కువ అనే భావన కోహ్లీకి ఉంటుందని ఆయన తెలిపాడు. 

ఇక టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమ్​లో రెండు వర్గాలను నడుపుతున్నారని కూడా చేతన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల మీద టీమిండియా క్రికెట్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఒక బోర్డుకు చీఫ్ సెలెక్టర్​గా ఉన్న వ్యక్తి ఆటగాళ్ల ఫిట్​నెస్ మీద, వారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

చేతన్​కు అంత సీన్ లేదులే!

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కూడా చేతన్ పలు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, దాదా గంగూలీకి మధ్య గొడవలున్నాయని, తన కెప్టెన్సీ పోయేందుకు సౌరవ్​ గంగూలీయే కారణం అని కోహ్లీ భావించాడని ఆయన తెలిపాడు. గంగూలీ పరువు తీసేందుకే కోహ్లీ మీడియా ముందు అబద్దాలు చెప్పాడని ఆయన పేర్కొన్నాడు. ఇక దీనిపై కొంత మంది బీసీసీఐ అధికారులు స్సందిస్తూ… చేతన్​కు అంత సీన్ లేదు.. టీమ్​లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు ఎక్కడ కూడా చేతన్​తో ప్రైవేటుగా మాట్లాడరు. అంతే కాకుండా చేతన్ గంగూలీతో మాట్లాడినట్లు ఎక్కడ కూడా బయటకు కనిపించలేదు. ఆయన టోర్నీలకు వెళ్లినా ఎక్కడో ఒక మూలన కూర్చుంటాడని వారు పేర్కొన్నారు. చేతన్ శర్మ ఆరోపణల్లో నిజాల కంటే అబద్దాలే ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. 

అయితే ఏదేమైనా కానీ లూజ్ టాక్ వల్ల చీఫ్ సెలెక్టర్ అయిన చేతన్ శర్మ చాలా చీప్​గా తన పదవిని పోగొట్టుకున్నాడు. అందుకే పెద్దలంటారు… నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని..