తండ్రయిన జ‌స్ప్రీత్ బుమ్రా

టీమిండియా ఆటగాడు జ‌స్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. తన భార్య సంజన గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ హ్యాపీ మూమెంట్ ను స్టార్ క్రికెటర్ బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మా కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైందని బుమ్రా వెల్లడించారు. ఇన్నాళ్లూ స్టార్ బౌలర్ గా టీమిండియాకు సేవలందించిన బుమ్రా ఇప్పుడు తండ్రిగా కూడా క్రూషియల్ రోల్ పోషించనున్నాడు. అతడు బుల్లి బుమ్రా పేరును కూడా రివీల్ […]

Share:

టీమిండియా ఆటగాడు జ‌స్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. తన భార్య సంజన గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ హ్యాపీ మూమెంట్ ను స్టార్ క్రికెటర్ బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మా కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైందని బుమ్రా వెల్లడించారు. ఇన్నాళ్లూ స్టార్ బౌలర్ గా టీమిండియాకు సేవలందించిన బుమ్రా ఇప్పుడు తండ్రిగా కూడా క్రూషియల్ రోల్ పోషించనున్నాడు. అతడు బుల్లి బుమ్రా పేరును కూడా రివీల్ చేశాడు. 

పేరు కూడా చెప్పేసిన బుమ్రా

పండంటి మగ బిడ్డ పుట్టిన తర్వాత బుమ్రా తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చాడు. తన కుమారుడి పేరును కూడా ప్రకటించేశాడు. ఆ లిటిల్ బాయ్ కి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని నామకరణం చేసినట్లు ఈ స్టార్ వెల్లడించాడు. తన బిడ్డ పుట్టినపుడు తన భార్య పక్కన ఉండాలనే కారణంతో బుమ్రా ఆసియా కప్ మధ్యలో నుంచి ఇండియాకు తిరిగొచ్చేశాడు. పాక్ తో మ్యాచ్ తర్వాత బుమ్రా స్వదేశానికి పయనమయ్యాడు. బుమ్రా స్వదేశానికి వచ్చినట్లు ప్రకటించేసిన జట్టు యాజమాన్యం అతడు ఎందుకు వచ్చాడో మాత్రం ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ ఏమై ఉంటుందా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఈ విషయం బయటపడడంతో అంతా బుమ్రా దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ విష్ చేస్తున్నారు. 

ఈ మధ్య ప్రమోషన్

బుమ్రా గత కొద్ది రోజుల నుంచి గాయంతో ఎన్సీఏ లో చికిత్స పొందుతున్నాడు. ఈ గాయం వలన అతడు కొన్ని సిరీస్ లకు కూడా దూరం అయ్యాడు. దీంతో అతడి ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బుమ్రా త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. అందరి పూజల ఫలితంగా బుమ్రా అనుకున్నదాని కంటే ముందుగానే కోలుకున్నాడు. దీంతో అంతా రిలాక్స్ అయ్యారు. బుమ్రాను రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి రావడంతోనే బీసీసీఐ కెప్టెన్ గా ప్రమోట్ చేసింది. ఐర్లాండ్ తో టీ20లకు బుమ్రాను కెప్టపెన్ గా సెలెక్ట్ చేసింది. చాలా రోజుల నుంచి జాతీయ జట్టుకు ఆడని బుమ్రా ఒకేసారి కెప్టెన్ గా ప్రమోట్ కావడంతో అసలు బుమ్రా ఎలా పర్ఫామ్ చేస్తాడో అని అంతా ఎదురు చూశారు. కానీ బుమ్రా మాత్రం ఈ సిరీస్ లో బౌలర్ గా అదరగొట్టాడు. తొలి స్పెల్ వేస్తూ ఐరిష్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ బంతులేశాడు. దీంతో ఐరిష్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. 

వరల్డ్ కప్ లో కీలకం

బుమ్రా వరల్డ్ కప్ లో కీలకం కాబోతున్నాడు. అతడిని బీసీసీఐ వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసింది. కేవలం వరల్డ్ కప్ కు మాత్రమే కాకుండా త్వరలో పాక్ తో జరిగే ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ కు కూడా బుమ్రా కీలకం కానున్నాడు. సూపర్ -4 మాత్రమే కాదు ఆసియా కప్ గెలిచేందుకు కూడా బుమ్రా ఎంతో కీ రోల్ పోషించనున్నాడు. బౌలింగ్ దళాన్ని లీడ్ చేసుకుంటూ తనదైన శైలిలో బంతులేస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే బుమ్రా ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని అంతా విష్ చేస్తున్నారు. 2021లో ఓ ఇంటి వాడైన బుమ్రా రెండు సంవత్సరాల్లో పండంటి బాబుకు జన్మనిచ్చాడు. దీంతో అందరూ అతడిని విష్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేశన్ ఒక టీవీ హోస్ట్. ఆమె పలు చానళ్లలో హోస్ట్ గా సేవలందించారు.