ఐసీసీ కొత్త టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా అండర్సన్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫిబ్రవరి 22న టెస్టు ఫార్మాట్‌లో ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ నంబర్ వన్ స్థానానికి ఎదగడం ప్రధాన మార్పులలో ఒకటి. దీంతో జేమ్స్ ఆండర్సన్ 87 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇందులో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించిన అతి పెద్ద వయసు ఆటగాడిగా నిలిచాడు. జేమ్స్ ఆండర్సన్ కంటే ముందు.. ఈ రికార్డు […]

Share:

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫిబ్రవరి 22న టెస్టు ఫార్మాట్‌లో ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ నంబర్ వన్ స్థానానికి ఎదగడం ప్రధాన మార్పులలో ఒకటి. దీంతో జేమ్స్ ఆండర్సన్ 87 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇందులో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించిన అతి పెద్ద వయసు ఆటగాడిగా నిలిచాడు.

జేమ్స్ ఆండర్సన్ కంటే ముందు.. ఈ రికార్డు ఆస్ట్రేలియన్ మాజీ వెటరన్ ప్లేయర్ క్లారీ గ్రిమ్‌మెంట్ పేరు మీద ఉంది. అతను 1936 సంవత్సరంలో అతి పెద్ద వయసు ఆటగాడిగా నంబర్-1 ర్యాంకింగ్ ప్లేయర్ అయ్యాడు. ఆండర్సన్ కంటే ముందు పాట్ కమిన్స్ నంబర్ వన్ బౌలర్. కమిన్స్ 1,466 రోజుల పాటు టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు, తాజా ఐసిసి ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతే, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్‌పై తన పూర్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు అతను నంబర్ 1 బౌలర్ స్థానం నుంచి నంబర్ త్రీ బౌలర్ అయ్యాడు.

ప్రస్తుతం పాట్ కమిన్స్ 858 రేటింగ్ పాయింట్లతో ఉండగా, భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 864 రేటింగ్ పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆలీ రాబిన్సన్ నాలుగో స్థానంలో ఉన్నారు. భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా 5వ స్థానంలో నిలిచాడు. ఇది కాకుండా పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ అఫ్రిది 6వ స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబడా 7వ స్థానంలో ఉండగా, కైల్ జామిసన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ ర్యాంక్‌ను నిలుపుకోవడంలో సఫలమయ్యాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి 2 టెస్టుల్లో బంతితో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 7 స్థానాలు దాటి 763 పాయింట్లతో నేరుగా 9వ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మళ్ళీ టాప్ 10లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ 10వ స్థానంలో ఉన్నాడు.

పాట్ కమిన్స్ 1466-రోజుల రికార్డును బద్దలుకొట్టిన అండర్సన్

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత.. జేమ్స్ ఆండర్సన్ వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రగామిగా నిలిచాడు. కివీస్‌పై 1 మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో 40 ఏళ్ల ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్, పాట్ కమిన్స్ 1466 రోజుల రికార్డుని బద్దలుకొట్టి, మళ్ళీ నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 25.94 సగటుతో 685 వికెట్లు తీశాడు. ఈ సమయంలో, అతను తన కెరీర్‌లో 32 సార్లు ఐదు వికెట్లు మరియు మూడుసార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు.

35 ఏళ్ల తర్వాత 202 వికెట్లు

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్. అయితే 40 ఏళ్ల వయసులో కూడా నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. లేట్ ఏజ్‌లో జేమ్స్ ఆండర్సన్ 35 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తరఫున 53 టెస్టులు ఆడాడు. అందులో అతను 20.56 సగటుతో 202 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతను 10 సార్లు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐసీసీ కొత్త టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆండర్సన్ నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. కానీ, ఇప్పుడు ఈ రికార్డుని నిలబెట్టుకోవాల్సి వస్తే, ముందు జరిగే టెస్టుల్లోనూ తన అత్యుత్తమ ప్రదర్శనను అందించాల్సి ఉంటుంది.