కోహ్లి కాదు వరల్డ్ కప్‌ గెలిపించేది అతడే

కోహ్లి కాదు వరల్డ్ కప్‌ గెలిపించేది అతడే అంటూ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్ లో తమకు హార్దిక్ పాండ్యా ఫామ్ చాలా కీలకమని రోహిత్ అనడం విశేషం. వరల్డ్ కప్ 2023 ఇండియా గెలవాలంటే ఎవరిది కీలక పాత్ర కానుంది? ఈ ప్రశ్న ఏ క్రికెట్ అభిమానిని అడిగినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రాలాంటి వాళ్ల పేర్లు చెబుతారు. కానీ కెప్టెన్ రోహిత్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. […]

Share:

కోహ్లి కాదు వరల్డ్ కప్‌ గెలిపించేది అతడే అంటూ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్ లో తమకు హార్దిక్ పాండ్యా ఫామ్ చాలా కీలకమని రోహిత్ అనడం విశేషం. వరల్డ్ కప్ 2023 ఇండియా గెలవాలంటే ఎవరిది కీలక పాత్ర కానుంది? ఈ ప్రశ్న ఏ క్రికెట్ అభిమానిని అడిగినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రాలాంటి వాళ్ల పేర్లు చెబుతారు. కానీ కెప్టెన్ రోహిత్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఈ వరల్డ్ కప్ లో తమకు హార్దిక్ పాండ్యా ఫామ్ కీలకమని చెప్పడం విశేషం. ఈ ఆల్ రౌండర్ పర్ఫార్మెన్సే తమను గెలిపిస్తుందని చెప్పాడు.

ఐసిసి ట్రోఫీని సాధించాలనే తపనతో హార్దిక్ పాండ్యా ఫామ్ యొక్క ప్రాముఖ్యతను భారత కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం నొక్కి చెప్పాడు . ప్రపంచ కప్‌కు వెళ్లే జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించబడిన ప్రముఖ ఆల్ రౌండర్, వివిధ స్థాయిలలో నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో, మూడో వన్డేల సందర్భంగా రోహిత్‌కు విశ్రాంతి లభించకపోవడంతో పాండ్యా ఇటీవల భారత జట్టుకు బాధ్యతలు చేపట్టారు.

వరల్డ్ కప్ కోసం ఇండియా మంగళవారం (సెప్టెంబర్ 5) 15 మందితో టీమ్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మరియు అక్షర్ పటేల్ సహా నలుగురు ఆల్‌రౌండర్లుగా ఉన్నా ఈ 15 మందిలో హార్దిక్ పాండ్యానే తమకు కీలకం కాబోతున్నాడని మీడియాతో మాట్లాడుతూ రోహిత్ అన్నాడు. అతడు చెప్పినదాంట్లోనే నిజం లేకపోలేదు. ఆసియా కప్ లో పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ లోనూ కష్టాల్లో ఉన్న టీమ్ ను ఇషాన్ కిషన్ తో కలిసి హార్దిక్ ఆదుకున్నాడు.

హార్దిక్ ఫామ్ కీలకం

“హార్దిక్ ఫామ్ మాకు చాలా కీలకం. అతడు రెండు పనులూ (బ్యాటింగ్, బౌలింగ్) చేయగలడు. అది చాలా ముఖ్యం. ఏడాది కాలంగా అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ కూడా బాగుంది. అది మాకు చాలా ముఖ్యం” అని రోహిత్ అన్నాడు. ఈ సందర్భంగా గతవారం పాకిస్థాన్ తో మ్యాచ్ లో 

భారతదేశం 66/4కి తగ్గిన తర్వాత పాండ్యా పాకిస్తాన్‌పై 90 బంతుల్లో 87 పరుగులు చేశాడు మరియు ఇది అతని పరిపక్వతను ప్రతిబింబించే నాక్ అని హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ను కూడా రోహిత్ గుర్తు చేశాడు. 

“పాకిస్థాన్ తో మ్యాచ్ లో హార్దిక్ క్వాలిటీ ఎలా ఉందో మనం చూశాం. ఇషాన్, హార్దిక్ ఆదుకున్నారు. ఎలాగూ బౌలింగ్ కూడా అతడు గొప్పగా వేస్తున్నాడు. గత ఏడాదిన్నర కాలంగా బాగా బౌలింగ్ చేశాడు. గత మ్యాచ్ లో అతడు బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే మంచి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇది మాకు చాలా మంచి సంకేతాలు” అని రోహిత్ స్పష్టం చేశాడు.

నేపాల్ తో జరిగిన రెండో మ్యాచ్ లో హార్దిక్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే బౌలింగ్ లో మాత్రం హార్దిక్ రాణించాడు. 8 ఓవర్లలో కేవలం 34 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ లో విఫలమైన ఓపెనర్లు రోహిత్, గిల్ నేపాల్ పై చెలరేగడంతో కోహ్లి సహా ఎవరికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 10) మరోసారి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.