సూర్యకుమార్ యాదవ్ ODI ప్రపంచ కప్ లో ఆడతాడు

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్, భారత 360-డిగ్రీల బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భారతదేశంలో జరిగే ODI ప్రపంచ కప్ కోసం భారత జట్టులో భాగమవుతాడని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 32 ఏళ్ల అతను ఇటీవల ముగిసిన వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో జట్టుపై ప్రభావం చూపలేకపోయాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు భారత జట్టుకు ఆందోళన కలిగించింది. వచ్చిన చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతను విఫలమైనందున ODI ఫార్మాట్‌లో అతని ఆట […]

Share:

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్, భారత 360-డిగ్రీల బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భారతదేశంలో జరిగే ODI ప్రపంచ కప్ కోసం భారత జట్టులో భాగమవుతాడని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 32 ఏళ్ల అతను ఇటీవల ముగిసిన వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో జట్టుపై ప్రభావం చూపలేకపోయాడు.

50 ఓవర్ల ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు భారత జట్టుకు ఆందోళన కలిగించింది. వచ్చిన చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతను విఫలమైనందున ODI ఫార్మాట్‌లో అతని ఆట తీరు గురించి చాలా చర్చలు జరిగాయి. ముంబైలో జన్మించిన ఈ బ్యాటర్ 25 మ్యాచ్‌లలో కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే సాధించాడు, అతను ఇప్పటివరకు ODIలలో యావరేజ్ ఆట ఆడినట్లు.

ప్రపంచ కప్ లో స్థానం: 

ఇండియా టుడేతో మాట్లాడిన MSK ప్రసాద్, T20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మరియు ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం ఉన్న ప్రత్యేక ఆటగాడు అయినందున సూర్యకుమార్ యాదవ్ భారతదేశంలో జరిగే ప్రపంచ కప్‌కు ఖచ్చితంగా ఉంటాడని భావిస్తున్నట్లు వ్యక్తం చేశారు. ఐపిఎల్‌లో మరియు దేశం కోసం టి20 ఫార్మాట్‌లో తన ఆటతీరు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లో అతను జట్టుకి సహాయపడతాడని, భారత క్రికెట్ టీం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

వన్డే క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు సరైన పాత్రను అందించినందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మ మరియు రాహుల్ ద్రవిడ్‌లను MSK ప్రసాద్ ప్రశంసించారు. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టుకి  ఫినిషర్‌గా రాణించడంలో అతనికి సహాయపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ముంబై బ్యాటర్ జట్టు అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయగలరని నొక్కి చెప్పారు. 

ప్రపంచ కప్ విశేషాలు: 

భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు.

అయితే మూడు క్రికెట్ బోర్డులు, వరల్డ్ కప్ షెడ్యూల్లో అడ్జస్ట్మెంట్ కోసం ఐసీసీ కి లేఖ రాసినట్లు, అందుకే ప్రస్తుతం డేట్ అలాగే టైమింగ్ లో మార్పులు వచ్చినట్లు బీసీసీఐ సెక్రెటరీ చెప్పారు. అయితే టైమింగ్ అలాగే డేట్ విషయంలో మార్పులు తర్వాత జరగబోయే మ్యాచ్ లకు మధ్యలో నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్లో మార్పుల కోసం ఐసీసీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారో వాళ్ళ వివరాలైతే బిసిసిఐ సెక్రటరీ ప్రస్తుతానికి అయితే వెల్లడించలేదు. 

అయితే క్రికెట్ వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసేందుకు నవరాత్రి పండుగ కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే అహ్మదాబాద్ లోకల్ పోలీస్ వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అక్టోబర్ 15న అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని, వారి తరఫునుంచి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 15వ రోజున నవరాత్రి పండుగ కూడా వచ్చినందువల్ల ఆరోజు రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపడి, రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 15న ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం అభిమానులు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బుకింగ్స్ చేసుకోవడం కారణంగా, ఇప్పుడు వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసిన తర్వాత అభిమానులలో కాస్త అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.