IPL: వచ్చే సీజన్‌లో వీరు ఆడకపోవచ్చు

ఇక ఇది పక్కన పెడితే  తమ అభిమాన క్రికెట్ స్టార్ల భవిష్యత్తు గురించి ఫ్యాన్స్ తెగ భయపడిపోతున్నారు. కారణం.. అత్యుత్తమ ప్రదర్శనలో క్షీణతతో పాటు వయస్సు కూడా ప్రధాన కారణం. వారికి దాదాపు ఇదే ఐపీఎల్ చివరిది కావచ్చు.  చాలా మంది ఆటగాళ్లు వయసు, ఫామ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు.. వీడ్కోలు పలికినా కూడా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఇప్పడు ఐపీఎల్‌లో కూడా వీడ్కోలు పలికే సమయం ఆసన్నమయింది. ఆ లిస్ట్‌లో ముందు వరసలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.  […]

Share:

ఇక ఇది పక్కన పెడితే  తమ అభిమాన క్రికెట్ స్టార్ల భవిష్యత్తు గురించి ఫ్యాన్స్ తెగ భయపడిపోతున్నారు. కారణం.. అత్యుత్తమ ప్రదర్శనలో క్షీణతతో పాటు వయస్సు కూడా ప్రధాన కారణం. వారికి దాదాపు ఇదే ఐపీఎల్ చివరిది కావచ్చు. 

చాలా మంది ఆటగాళ్లు వయసు, ఫామ్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు.. వీడ్కోలు పలికినా కూడా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఇప్పడు ఐపీఎల్‌లో కూడా వీడ్కోలు పలికే సమయం ఆసన్నమయింది. ఆ లిస్ట్‌లో ముందు వరసలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. 

5.    అంబటి రాయుడు

ఐపీఎల్‌లో అంబటి రాయుడి ప్రదర్శన అద్భుతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఇండియా క్రికెట్ వీడ్కోలు పలికిన అంబటి.. ఐపీఎల్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. 

అతను ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆడిన 179 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ  మరియు 22 అర్ధ సెంచరీలతో 4250 పరుగులు చేశాడు. అతను అనేక సందర్భాల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను  గెలిపించాడు. 

హార్డ్ హిట్టింగ్‌కు పేరుగాంచిన అంబటి రాయుడు.. గత ఐపీఎల్ సీజన్‌లో రిటైర్మెంట్ గురించి ట్వీట్ చేశాడు ( కాకపోతే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు). అయితే ఆ ట్వీట్ పరిగణలోకి తీసుకుంటే కచ్చితంగా రిటైర్మెంట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

4.    అమిత్ మిశ్రా

ప్రస్తుతం IPL 2023లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న అమిత్ మిశ్రా వయసు దాదాపు 40 సంవత్సరాలు. గ్రేట్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత  భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ లెగ్ స్పిన్నర్లలో మిశ్రా ఒకడు. 156 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 7.35ఎకానమీతో 169 వికెట్లు పడగొట్టి గొప్ప IPL కెరీర్‌ను కలిగి ఉన్నాడు.

అమిత్ మిశ్రా.. సాంప్రదాయ లెగ్ స్పిన్, గూగ్లీలు, ఫ్లైడెడ్ డెలివరీలు వెయ్యగల సమార్థుడు. కొన్నిసార్లు తన కళాత్మక లెగ్ స్పిన్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను బోల్తా కొట్టిస్తాడు. అయితే అతను తన IPL కెరీర్‌లో ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) తరపున ఆడాడు.

అతను ఇప్పటికే 40 ఏళ్ల వయసులో ఉన్నాడు. అందుకే అమిత్ మిశ్రాకు ఇదే చివరి IPL తన అభిమానులు అనుకుంటున్నారు.

3. దినేష్ కార్తీక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి ప్రవేశించిన తర్వాత దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్‌ మారిపోయింది అని చెప్పవచ్చు. అతడు కళాత్మక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గతంలో అతని ఆటతీరుతో ఏకంగా ఆస్ట్రేలియాలో T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో తిరిగి చోటు సంపాదించింది.

ఇక నిదాహాస్ ట్రోఫీ ఫైనల్‌లో అతని ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు, అక్కడ అతను.. ఓటమి అంచుల్లో ఉన్న ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఆరు పరుగులు అవసమయిన సమయంలో ఎక్స్‌ట్రా కవర్‌లో సిక్స్ అదరహో అనిపించక మానదు. కాగా.. అతను ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సహా అనేక IPL జట్ల తరపున ఆడాడు.

అతను ముఖ్యంగా ఢిల్లీ ఫ్రాంచైజీలో ఉన్నప్పుడు హార్డ్ హిటింగ్ నాక్‌లను ఆడాడు, కెకెఆర్ జట్టుకు కొంతకాలం కెప్టెన్‌గాను వ్యవహరించాడు. ఇక అతని అంతర్జాతీయ కెరీర్‌కు పునరాగమనంపై ఆశలు సన్నగిల్లినందున ఈ సీజన్ తర్వాత అతను IPL నుండి రిటైర్ అయ్యే అవకాశం ఉంది.

2. ఇషాంత్ శర్మ

ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియన్లు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఇషాంత్ శర్మ తెరపైకి వచ్చాడు. అతను తన ఇన్ స్వింగింగ్ డెలివరీతో రికీ పాంటింగ్‌ను బోల్తాకొట్టించాడు. కాగా అతను 19 ఏళ్ల వయస్సులో ఆస్ట్రేలియాను వణికించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

IPLలో  93 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 72 వికెట్లు పడగొట్టాడు. కేవలం 12 రన్స్  మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన అత్యుత్తమ గణాంకాలను కలిగి ఉన్నాడు. అతనికి 100 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. 

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 20 ఓవర్ల మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడానికి ఇషాంత్ శర్మ కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. అతను తన చక్కటి షార్ట్ డెలివరీలతో ఇంపార్టెంట్ వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే గత కొన్నేళ్లుగా అతను సైడ్‌లైన్‌లో ఉన్నందున, అతను త్వరలో IPL నుండి రిటైర్ అయ్యే అవకాశం ఉంది.

1. ధోనీ

ధోనీ అంటే ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు.  హెలికాఫ్టర్ షాట్స్‌తో పాటు, మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు ధోనీ.. 40 ఏళ్ల వయసులోనూ వికెట్ల మధ్యలో  చిరుతలా పరుగెత్తుడం అతని ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే.. కీపింగ్ చేస్తూ మిల్లీ సెకండ్లలో స్టంప్ అవుట్ చెయ్యగల సమర్థుడు.  DRS అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది.. ధోనీ రివ్యూ సిస్టమే.

IPLలో 239 మ్యాచులాడిన ధోనీ 39.75 సగటు, 135. స్ట్రైక్‌రేట్‌తో 5037 పరుగులు చేశాడు. 

కాగా.. 41 ఏళ్ళ వయసున్న ధోనీకి ఇదే చివరి IPL కావచ్చని అందరూ భావిస్తున్నారు.