సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్ దూరం

వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా IPL 2023 నుండి తప్పించడం జరిగిందని.. త్వరగా కోలుకోండి “వాషీ” అని SRH గురువారం ట్వీట్టర్‌లో ట్వీట్ చేసింది. DCతో SRH యొక్క గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. సుందర్ తన చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా అతని స్థానంలో ఏ క్రికెటర్ వస్తారనేది ఇంకా ఫ్రాంచైజీ ప్రకటించలేదు. ఆల్- రౌండర్ సుందర్ SRH జట్టులో ఒక ముఖ్యమైన ఆటగాడు. […]

Share:

వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా IPL 2023 నుండి తప్పించడం జరిగిందని.. త్వరగా కోలుకోండి “వాషీ” అని SRH గురువారం ట్వీట్టర్‌లో ట్వీట్ చేసింది.

DCతో SRH యొక్క గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. సుందర్ తన చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా అతని స్థానంలో ఏ క్రికెటర్ వస్తారనేది ఇంకా ఫ్రాంచైజీ ప్రకటించలేదు.

ఆల్- రౌండర్ సుందర్ SRH జట్టులో ఒక ముఖ్యమైన ఆటగాడు. సుందర్ ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 146 పరుగులు ఇచ్చి, 8.26 ఎకానమీతో 3 వికెట్లు తీశాడు. మరోవైపు అతను అత్యధిక స్కోరు 24, 15 పరుగుల సగటుతో 60 పరుగులు చేశాడు.

కాగా ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కనీసం ఇప్పటి నుంచైనా దూకుడు పెంచాల్సిందేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకోవడంతో సన్ రైజర్స్ జట్టు కాస్త నిరాశ చెందింది. అటు ధనాధన్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. 

మొత్తం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా వాషింగ్టన్ సుందర్ గత మ్యాచ్ లోనే ఫామ్ లోకి వచ్చాడు. మొదటి ఆరు మ్యాచ్‌లలో ఫ్లాప్ అయిన అతను.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై బ్యాట్‌తోనూ, బంతితోనూ విధ్వంసం సృష్టించాడు. మొదటి ఆరు మ్యాచుల్లో ఒక వికెట్‌ కూడా పడగొట్టని ఈ స్పిన్నర్‌.. ఢిల్లీపై మూడు వికెట్లు తీశాడు. అది కూడా ఒకే ఓవర్‌లో. అనంతరం బ్యాటింగ్‌లో కూడా 15 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఇలా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఆనందం సన్‌రైజర్స్‌‌ హైదరాబాద్‌కు ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పాలి.. మోకాలి గాయంతో సుందర్‌ తప్పుకోవడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా తన తరువాతి మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే తలపడనుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా వచ్చే శనివారం (ఏప్రిల్‌ 29) ఈ మ్యాచ్‌ జరగనుంది. మరి గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమికి సన్‌రైజర్స్‌ ప్రతీకారం తీర్చుకుంటుందో? లేదో? అన్నది చూడాలి. కాగా రూ. రూ.13 కోట్లు పెట్టి మరీ కొన్న ఆ జట్టు ఓపెనర్‌ హ్యారీ బ్రూక్‌ వరుసగా విఫలమవుతూ ఉండటంతో సన్‌రైజర్స్‌ కొద్దిగా ఆందోళన చెందుతోంది. అలాగే మర్కరమ్‌ కూడా పెద్ద స్కోర్లు చేయడం లేదు. దీంతో ఆ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది.

కాగా వాషింగ్టన్ సుందర్ 5 అక్టోబర్ 1999న తమిళనాడులోని చెన్నైలో ఒక తమిళ హిందూ కుటుంబంలో జన్మించాడు. సుందర్‌కి చిన్నప్పుడి నుండే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. సుందర్ నాలుగు సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతను తన పాఠశాల విద్యను సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివాడు. అతను 6 అక్టోబర్ 2016న , 2016-17 రంజీ ట్రోఫీ సిరీస్ లో తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. అంతకు ముందు తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ లాగా, వాషింగ్టన్ సుందర్ కూడా యువ ఆటగాడిగా, బ్యాట్స్‌మెన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.