క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది!

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ ముస్తాబై వస్తోంది. దాదాపు 60 రోజుల పాటు సాగే ఉఈ త్కంఠభరితమైన మ్యాచ్‌లతో వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ.. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తిపోనున్నాయి. క్రికెట్ అభిమానులనుమరో పండగ రానుంది. అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ ముస్తాబై వస్తోంది. దాదాపు 60 రోజుల పాటు సాగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ.. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తిపోనున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత […]

Share:

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ ముస్తాబై వస్తోంది. దాదాపు 60 రోజుల పాటు సాగే ఉఈ త్కంఠభరితమైన మ్యాచ్‌లతో వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ.. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తిపోనున్నాయి.

క్రికెట్ అభిమానులనుమరో పండగ రానుంది. అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ మళ్లీ ముస్తాబై వస్తోంది. దాదాపు 60 రోజుల పాటు సాగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో వీక్షకుల్ని మునివేళ్లపై నిలబెడుతూ.. హిట్టర్ల సిక్సర్లు, బౌలర్ల సంబరాలతో దేశంలోని స్టేడియాలు హోరెత్తిపోనున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఫ్రాంచైజీలన్నీ కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మెగా టోర్నీ మార్చి 31న ప్రారంభంకానుంది. 2022 లో జరిగిన గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి  కప్పును కొల్లగొట్టిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. బీసీసీఐ ఈ షెడ్యూల్‌ని రూపొందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. మూడేళ్ల తర్వాత తమ ఫేవరెట్ జట్లు సొంత మైదానంలో ఆడనుండడంతో ఈ సారి ఎలాగైనా సరే అభిమాన స్టార్లను చూడొచ్చని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

గత కొన్ని సీజన్లలో తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రేమికులకు ఈసారి ఆ లోటు తీరబోతోంది. సన్ రైజర్స్ ఈసారి హోం గ్రౌండ్‌ ఉప్పల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడబోతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, తన తొలి పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. అలాగే హైదరాబాద్ మాజీ ప్లేయర్స్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మళ్లీ హోం గ్రౌండ్‌లో చూసే అవకాశం కూడా ఉంది. ఏప్రిల్ 2, 9, 18, 24, మే 4, 13, 18 తేదీల్లో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తప్ప అన్ని జట్లతోనూ హైదరాబాద్ టీం తన హోం గ్రౌండ్‌లో ఆడుతుంది. ఈ సారి సన్ ప్రాంచైజీకి కొత్త కెప్టెన్​గా సౌతాఫ్రికన్ ఆటగాడు ఎడెన్ మార్క్రమ్ వచ్చాడు. ఇక మార్క్రమ్ జట్టు ఎంత వరకు విజయతీరాలకు చేరుస్తాడో చూడాలి. సౌతాఫ్రికాలో జరిగిన టీ20 లీగ్​లో మాత్రం మార్క్రమ్ కెప్టెన్సీ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్స్ ఇనాగురల్ టైటిల్​ను కొల్లగొట్టింది. ఆ ఆశతోనే ఇక్కడ కూడా తమ రాత మారుస్తాడని సన్ యాజమాన్యం మార్క్రమ్​కు కెప్టెన్సీ ఇచ్చినట్లుగా ఉంది. ఇక కొత్త సారధితో సన్ తన సత్తాను ఎంత వరకు చూపెడుతుందో వేచి చూడాలి. అంతే కాకుండా పోయినసారి ట్రోఫీని ముద్దాడిన కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందని కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఐపీఎల్ 2023లో పోటీపడబోయే జట్లు: ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్.

లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు ఉండగా.. ఇందులో 18 డబుల్ హెడర్స్ అంటే ఒకే రోజున రెండు మ్యాచ్‌లుగా జరిగే మ్యాచులు ఉన్నాయి. ఈ మ్యాచులలో 10 జట్లు తలపడనున్నాయి. వీటిలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడవలసి ఉండగా, అవి హోమ్ గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు, బయట ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఐపీఎల్ 2023 సీజన్‌ మ్యాచ్‌లకి ఈసారి 12 వేదికలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, మొహాలి, లక్నో, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబయి, గౌహతి, ధర్మశాల.