రాజస్థాన్‌పై పంజా విసిరిన పంజాబ్: 5 పరుగుల తేడాతో గెలుపు

ఐపీఎల్‌లో మరో ధమాకా మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్ 34 బంతుల్లో 7 ఫోరులు, 3 సిక్సర్ల సహాయంతో 60 పరుగులు చెయ్యగా, శిఖర్ ధవన్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 86 (నాటౌట్) పరుగుల ప్రదర్శనతో 197 పరుగుల భారీ స్కోరు చేసింది. […]

Share:

ఐపీఎల్‌లో మరో ధమాకా మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్ 34 బంతుల్లో 7 ఫోరులు, 3 సిక్సర్ల సహాయంతో 60 పరుగులు చెయ్యగా, శిఖర్ ధవన్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 86 (నాటౌట్) పరుగుల ప్రదర్శనతో 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఆరంభం నుంచి పంజాబ్ బ్యాటర్స్ దూకుడుగా ఆడటం చూస్తుంటే.. 200లకు పైగా పరుగులు చేస్తారేమో అనిపించింది.

అయితే మధ్య ఓవర్ల నుండి రాజస్థాన్ బౌలర్లు పంజాబ్‌ను కట్టడి చేసేందుకు పదునైన బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్.. ఆ జట్టుకు బలమైన స్కోరు అందించారు. అనంతరం లక్ష్య ఛేదన చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ బాటర్స్ తడబడ్డారు. ఆశ్చర్యంగా రాజస్థాన్..  రవిచంద్రన్ అశ్విన్‌ను ఓపెనర్‌గా పంపించి అభిమానులను ఆశ్యర్యానికి గురిచేసింది. అయితే ఈ ప్లాన్ ఆ టీమ్‌కి అంతగా వర్క్ అవుట్ కాలేదు. సున్నా పరుగులతో పెవిలియన్ బాట పట్టాడు.

అశ్విన్ కంటే ముందుగానే పెద్ద షాట్లకు ప్రయత్నించిన యశస్వి జైస్వాల్  కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో జట్టు కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ (19 పరుగులు), సంజూ శాంసన్ (42 పరుగులు) విజయం కోసం గట్టిగానే పోరాడి అవుటయ్యారు. దేవదత్ పడిక్కల్ 21 పరుగులు, రియాన్ పరాగ్ 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ 18 బంతుల్లో 3 సిక్సర్లు ఒక ఫోర్ సహాయంతో 36 పరుగులు, ధ్రువ్ జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 30 పరుగులతో మెరుపులు మెరిపించినా.. రాజస్థాన్ రాయలు జట్టు ఐదు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.

ఐపీఎల్‌ ఎనిమిదో మ్యాచ్‌కి రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లను బుధవారం ప్రకటించారు. ఎలాంటి మార్పు లేకుండా జట్లు మ్యాచ్‌కి వెళ్తాయని టాస్ ముగిసిన తర్వాత ఇరు సారథులు తెలియజేశారు. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆట యొక్క రెండవ ఇన్నింగ్స్‌లో మంచు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, అయితే జట్టు ఒత్తిడిలో ఆడటం అలవాటు చేసుకున్నదని శిఖర్ ధవన్ అన్నాడు.

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్.. ఈ  జట్లు తమ  మొదటి మ్యాచుల్లో గెలిచి ఆత్మవిశ్వాసంతో  ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి అడుగుపెట్టాయి. ముఖ్యంగా ఈ రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బాగానే ఉంది.

రెండు జట్లూ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌లను ప్రకటించాయి. రాజస్థాన్ రాయల్స్‌కు, ఎం అశ్విన్, డి ఫెరీరా,  కె యాదవ్‌లు మరియు ఎ వశిష్ట్, ఎంపిక కాగా, పంజాబ్ కింగ్స్ కి హెచ్ సింగ్, ఆర్ ధావన్, ఎం రాథీ, ఎ టైడ్, ఎం షార్ట్, ఎంపికయ్యారు.

RR vs PBKS స్క్వాడ్‌లు

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(సి), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), భానుక రాజపక్సే, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కుర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్