అట్టహాసంగా ప్రారంభమయిన IPL 2023 ప్రారంభ వేడుకలు

IPL 2023 ప్రారంభ వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు నటి మందిరా బేడీ దిగ్గజ ప్రదర్శనతో వైభవంగా ప్రారంభమయ్యాయి.  టాలీవుడ్ తారలు రష్మికా మందాన, తమన్నా భాటియా తమ స్టెప్పుతో అదరగొట్టగా.. ఇక బాలీవుడ్ సింగర్ అర్జిగ్ సింగ్ తమ మధుర గానాలతో అభిమానులను ఉర్రుతలూగించారు. హీరో సిద్దార్థ్‌తో కలిసి నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం […]

Share:

IPL 2023 ప్రారంభ వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు నటి మందిరా బేడీ దిగ్గజ ప్రదర్శనతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 

టాలీవుడ్ తారలు రష్మికా మందాన, తమన్నా భాటియా తమ స్టెప్పుతో అదరగొట్టగా.. ఇక బాలీవుడ్ సింగర్ అర్జిగ్ సింగ్ తమ మధుర గానాలతో అభిమానులను ఉర్రుతలూగించారు.

హీరో సిద్దార్థ్‌తో కలిసి నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటూ కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టడం మొదలుపెట్టిన ప్రారంభించిన తమన్నా.. ఈ వేడుకల్లో తన స్టెప్పులతో తెగ అదరగొట్టింది. తాను వేసిన స్టెప్పులతో అభిమానులను కూడా స్టెప్పులు వేయించింది. తమిళంలో విశాల్ నటించిన ఎనిమి సినిమా టమ్‌ టమ్‌ అనే ట్రెండింగ్‌ పాటకు కూడా డాన్స్ చేయడంతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఇక తగ్గేదేలే అంటూ బాగా ట్రెండ్ అయిన పుష్ప సినిమాలోని ఊ..  అంటావా.. మావా.. ఉఉ అంటావా మావా.. అంటూ క్రికెట్ అభిమానులను క్రికెట్ మరిచిపోయేలా చేసింది. 

గీత గోవిందంతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించిన రష్మిక మందాన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది. ఇక ఈ రోజు IPL ఆరంభ వేడుకల్లో సందడి చేసింది. పుష్ప మూవీలోని సామీ.. సామీ.. పాటకు తనదైన స్టయిల్ లో డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించింది. అంతే కాదు.. ఆస్కార్ అవార్డు పొందిన RRR మూవీలోని నాటు నాటు పాటకు కూడా డాన్స్ చేసి అదరహో అనిపించింది. ఈ పాటకు క్రికెటర్లు కూడా కాళ్లు కదపలేకుండా ఉండలేకపోయారు. ఇక ఈ నటులతో పాటు బాలీవుడ్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌.. బాలీవుడ్ పాటలతో అభిమానులని డాన్స్ చేయించాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే..  నటి మందిరా బేడి IPLలో యాంకర్‌ పాత్ర చేసింది. ఇక వీరితో పాటు మరికొందరు కూడా ఆరంభ వేడుకలకు హాజరయ్యి ప్రేక్షకులను అలరించారు.

IPL ఆరంభ వేడులకు BCCI ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ, సెక్రటరీ జై షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఆరంభ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనుండగా..  వారికి మద్దతుగా వచ్చిన అభిమానులతో నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. కాగా 2018 తర్వాత ఐపీఎల్‌లో ఈ రోజు ప్రారంభోత్సవం జరగడం ఇదే తొలిసారి.

ఇక టాస్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బోలింగ్ ఎందుకుంది.  

ఈ మ్యాచ్ లో ఆడుతున్న ప్లేయర్స్:


CSK: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, అజింక్యా రహానే, సుభ్రాంషు సేనాపతి, ఎన్ షైకాంత్ రషీద్ సింధు, మిచెల్ సాంట్నర్, భగత్ వర్మ, తుషార్ దేశ్‌పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ సింగ్

GT: అభినవ్ మనోహర్, శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(c), రాహుల్ తెవాటియా, మాథ్యూ వాడే(w), రషీద్ ఖాన్, శివం మావి, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్, శ్రీకర్ భరత్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, ఉర్విల్ పటేల్, విజయ్ శంకర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఓడియన్ స్మిత్, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, ప్రదీప్ సాంగ్వాన్

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతు రాజ్ గైక్వాడ్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. అతను 50 బంతుల్లోనే 9 సిక్సులు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు. ఇక 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ కు శుభ్‌మన్‌ గిల్ కేవలం 36 బంతుల్లోనే 3 సిక్సులు, 6 ఫోర్లతో  60 పరుగులు చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు. చివరికి తేవాటియా, రషీద్ ఖాన్ కలిసి మ్యాచ్ గెలిపించారు. 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.