తిల‌క్ వ‌ర్మ‌కు వ్య‌తిరేకంగా దిగ్గ‌జాలు

హైదరాబాద్ కుర్రోడు, యువ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. తనదైన శైలిలో తిలక్ వర్మ ప్రతిభను ఘనపరచాడని చెప్పాలి. ముందు జరిగిన రెండు సిరీస్ మ్యాచ్లలో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి గురైన టీం రేటును పెంచేందుకు కృషి చేశాడు తిలక్ వర్మ. ప్రస్తుతం జరిగిన T20I మ్యాచ్లలో కూడా అతని స్కోర్ బోర్డు 39, 51, 49 నాట్ అవుట్ గా స్కోర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు తిలక్ వర్మ. […]

Share:

హైదరాబాద్ కుర్రోడు, యువ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. తనదైన శైలిలో తిలక్ వర్మ ప్రతిభను ఘనపరచాడని చెప్పాలి. ముందు జరిగిన రెండు సిరీస్ మ్యాచ్లలో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి గురైన టీం రేటును పెంచేందుకు కృషి చేశాడు తిలక్ వర్మ. ప్రస్తుతం జరిగిన T20I మ్యాచ్లలో కూడా అతని స్కోర్ బోర్డు 39, 51, 49 నాట్ అవుట్ గా స్కోర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు తిలక్ వర్మ. ఇప్పుడు తాను సాధించిన విజయాలకు ప్రతిఫలంగా ఏషియా కప్ ఆటలో చోటు దక్కించుకుని తనదైన ఆట తీరు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. 

తిలక్ వరల్డ్ కప్ లో ఆడకపోవడమే మంచిది అంటున్న క్రిస్ శ్రీకాంత్:

మరోపక్క, 1983 వరల్డ్ కప్ భారతదేశానికి దక్కేలా చేసిన క్రిస్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ Cheeky Cheeka ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన క్రికెటర్ తిలక్ వర్మ ముందు ఆడిన సీరియస్ లో బాగా ఘనపరిచినప్పటికీ, ఇంత పెద్ద వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంటులలో అప్పుడే అవకాశం ఇవ్వకపోవడం మంచిది అని శ్రీకాంత్ తన భావనను వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా వరల్డ్ కప్ ఆటగాళ్లలో తిలక్ వర్మ పేరు చూసిన తర్వాత ఒకింత సంతోషం వ్యక్తపరచినప్పటికీ, తన గొప్ప ఆటగాడు కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చింది అంటూ తను భావించినప్పటి,కీ వరల్డ్ కప్ ఆడే ముందు తను కచ్చితంగా వండే సిరీస్ లో పాల్గొనడం మంచిదని క్రిస్ శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆసియా కప్ 2023 భారత జట్టు: 

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్, కుల్‌దీప్ ప్రసిద్ధ్ కృష్ణ, మరియు సంజు శాంసన్ (బ్యాక్ అప్). 

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ  ద్వారా ఆగస్టు మూడో వారంలో, న్యూఢిల్లీలో ఆసియా కప్ జట్టుపై చర్చించి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యారు. భారత జట్టు తమ కీలక ఆటగాళ్ల గాయంపై ఆందోళనలు.. ముఖ్యంగా ఆసియా కప్ కోసం తమ జట్టును ఆలస్యంగా ప్రకటించడానికి కారణాలు. పాకిస్తాన్, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే తమ ఆసియా కప్ జట్టులను ప్రకటించాయి.

ఆసియా కప్ 2023 షెడ్యూల్:

30 ఆగస్టు 2023: పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో, పాకిస్థాన్ vs నేపాల్

31 ఆగస్టు 2023: శ్రీలంకలోని క్యాండీలో, బంగ్లాదేశ్ vs శ్రీలంక

2 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని క్యాండీలో, పాకిస్థాన్ vs భారత్

3 సెప్టెంబర్ 2023: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో, బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్

4 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని క్యాండీలో, భారత్ vs నేపాల్

5 సెప్టెంబర్ 2023: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో, ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక 

సూపర్ 4లు:

6 సెప్టెంబర్ 2023: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో, A1 vs B2

9 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, B1 vs B2

10 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A1 vs A2

12 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A2 vs B1

14 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A1 vs B1

15 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో, A2 vs B2 

చివరి మ్యాచ్:

17 సెప్టెంబర్ 2023: శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్ మ్యాచ్