World Cup: న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన భారత్

భారత్  (India) క్రికెట్ (Cricket) జట్టు వరల్డ్ కప్  (World Cup) మ్యాచ్  (Match)లలో తమదైన శైలిలో ఆడి అదరగొడుతుంది. అక్టోబర్ 22 మధ్యాహ్నం మొదలైన భారత్ – న్యూజిలాండ్ (India Vs New zealand) మధ్య పోటీ ఆసక్తిగా మారింది. కచ్చితంగా న్యూజిలాండ్  (New Zealand) మీద విజయం  (Win)‌ సాధించడం కోసం భారత జట్టు తనదైన శైలిలో కృషి చేయడానికి సిద్దమైన వేళ.. టాస్ గెలుచుకున్న భారత్  (India), ఫీల్డింగ్ ఎంచుకోగా. న్యూజిలాండ్  (New […]

Share:

భారత్  (India) క్రికెట్ (Cricket) జట్టు వరల్డ్ కప్  (World Cup) మ్యాచ్  (Match)లలో తమదైన శైలిలో ఆడి అదరగొడుతుంది. అక్టోబర్ 22 మధ్యాహ్నం మొదలైన భారత్ – న్యూజిలాండ్ (India Vs New zealand) మధ్య పోటీ ఆసక్తిగా మారింది. కచ్చితంగా న్యూజిలాండ్  (New Zealand) మీద విజయం  (Win)‌ సాధించడం కోసం భారత జట్టు తనదైన శైలిలో కృషి చేయడానికి సిద్దమైన వేళ.. టాస్ గెలుచుకున్న భారత్  (India), ఫీల్డింగ్ ఎంచుకోగా. న్యూజిలాండ్  (New Zealand) మొదటి బ్యాటింగ్ చేస్తూ, తన ఆట తీరును కొనసాగించింది. భారత్ – న్యూజిలాండ్ (India Vs New zealand) మ్యాచ్  (Match) మీద ఆశలు పెట్టుకున్న భారత జట్టు తనదైన శైలిలో ఆడి, సొంత గడ్డమీద న్యూజిలాండ్  (New Zealand)‌ మీద ఘన విజయం  (Win)‌ సాధించింది. 

రెండు రోజులు ధర్మశాలలో భారత్ జట్టు: 

న్యూజిలాండ్  (New Zealand)‌‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌ (World cup)లో తమ విజయాల పరంపరను కొనసాగించింది. రోహిత్ శర్మ  (Rohit Sharma)‌ కెప్టెన్సీలో భారత్ క్రికెట్ (Cricket) జట్టు తదుపరి అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌లతో తమ ప్రచారాన్ని పునఃప్రారంభించే ముందు ఒక వారం సెలవు ఉంటుంది.

Also Read: India Vs New zealand: న్యూజిల్యాండ్‌పై గెలిచేనా?

జట్టు న్యూజిలాండ్  (New Zealand)‌ పై ఘన విజయం  (Win)‌ సాధించుకుని, మ్యాచ్  (Match)‌ ముగిసిన ఒక రోజు తర్వాత, ఎటువంటి ప్రయాణాలను చేసేందుకు, భారత క్రికెట్ (Cricket) జట్టు ఇష్టపడట్లేనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి రెండు రోజులు తిరిగి ధర్మశాల (Dharamsala) లో ఉండాలని నిర్ణయించుకున్నారు భారత క్రికెటర్లు. లక్నోలో తదుపరి ఆట కోసం సన్నాహాలు ప్రారంభమయ్యే ముందు భారత క్రికెట్ (Cricket) జట్టు విశ్రాంతి తీసుకుంటారని జట్టు షెడ్యూల్ గురించి తెలిసిన BCCI అధికారి క్రికెట్ (Cricket) నెక్స్ట్‌తో చెప్పారు. 

న్యూజిలాండ్- భారత్ మ్యాచ్: 

న్యూజిలాండ్  (New Zealand)‌పై భారత్  (India)‌కు 58-50 హెడ్-టు-హెడ్ రికార్డ్ ఉంది, కానీ ICC ఈవెంట్‌ల విషయానికి వస్తే, భారత్  (India) కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2003 ప్రపంచ కప్‌  (World Cup)లో విజయం  (Win)‌ సాధించిన తర్వాత ప్రారంభమైన ICC ఈవెంట్‌లో భారత్  (India) న్యూజిలాండ్‌ (India Vs New zealand)ను ఓడించి 20 సంవత్సరాలు అయ్యింది. ఓవరాల్‌గా వన్డే ప్రపంచకప్‌ (World cup)లో భారత్‌ (India) పై న్యూజిలాండ్  (New Zealand) 5-3 ఆధిక్యంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ, భారత జట్టు విజయం  (Win)‌పై దృష్టి సారించిన జట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తాము అనుకున్నట్లుగా భారత్ జట్టు తమ మంచి ఆట తీరును ఘనపరిచారు.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)‌ లేనప్పటికీ న్యూజిలాండ్ (New Zealand)‌ జట్టుపై ఘన విజయం  (Win)‌ సాధించడం, నిజంగా భారత క్రికెట్ (Cricket) జట్టు గొప్పతనం. 

కెప్టెన్ రోహిత్ శర్మ  (Rohit Sharma)‌, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత బ్యాటింగ్ లైనప్ లెక్కకు మిక్కిలిగా ఉంది. ప్రస్తుతం రోహిత్ శర్మ  (Rohit Sharma)‌ 265 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, 259 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరుతో పాటు, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్  (Match)లలో చూసుకుంటే, భారత బ్యాటింగ్ లైనప్ నిలకడగా రాణిస్తోంది, బ్యాటర్లు సగటున 100కు పైగా కొట్టారు. వారి ఆధిపత్యం ఏమిటంటే, వారు ప్రతి గేమ్‌లో 42 ఓవర్లలోపు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించగలిగారు. అక్టోబర్ 22న జరిగిన, భారత న్యూజిలాండ్ మ్యాచ్  (Match)‌లో అదే విధంగా ప్రతి ఒక్కరూ మంచి స్కోర్ సాధించారు. 50 ఓవర్లలో న్యూజిలాండ్ 273 పరుగులు చేయగా, 48 ఓవర్లలోనే భారత్ 274 పరుగులు సాధించి విజయాన్ని దక్కించుకుంది.