IND vs NZ Match: భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ లో బీజేపీ, కాంగ్రెస్ నేతల సందడి

భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్(IND vs NZ Match) జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్(Cricket) అభిమానులు టీమిండియా(Team india) నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukh) ప్రశంసించారు. భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023(ODI World cup 2023) జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల(Dharmashala) స్టేడియంలో ఆదివారం భారత్ – […]

Share:

భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్(IND vs NZ Match) జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్(Cricket) అభిమానులు టీమిండియా(Team india) నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukh) ప్రశంసించారు.

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023(ODI World cup 2023) జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల(Dharmashala) స్టేడియంలో ఆదివారం భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల ముఖ్యనేతలు మ్యాచ్ సందర్భంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ కనిపించారు.

నిజానికి ఎప్పుడూ ఒకరితో ఒకరు పార్టీల పరంగా విబేధించుకుంటూ ఉంటారు. కానీ ఇండియా, కివీస్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి సందడి చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukh), కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్(Anurag Thakur),  మంత్రి హర్షవర్దన్(Minister Harshavardhan), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్(Jairam Takur) కలిసి మ్యాచ్ ను వీక్షించారు. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ బిందాల్(Rajeev Bindal), ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా స్టాండ్స్‌లో టీమ్ ఇండియాను ఉత్సాహపరుస్తూ కనిపించారు.

Also Read: World Cup: న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన భారత్

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మధ్య కూర్చొని కనిపించారు. వీరంతా వీవీఐపీ(VVIP) స్టాండ్ లో కూర్చొని మ్యాచ్ వీక్షించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరు సరదాగా ముచ్చట్లు పెట్టుకోవటం కనిపించింది. వీరికి తోడు బీసీసీఐ సెక్రటరీ జేషా, ఐపీఎల్ ప్రెసిడెంట్ అరుణ్ ధమాల్ తదితరులు ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.

మ్యాచ్ విషయానికొస్తే, ఆదివారం ధర్మశాల(Dharamshala) మైదానంలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  ప్రపంచకప్ 21వ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. నంబర్-4 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ (130) సెంచరీ ఆడగా, రచిన్ రవీంద్ర (75 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 23 పరుగులు చేశాడు. మహ్మద్ షమీ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లి 104 బంతుల్లో 95 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక్కో వికెట్ సాధించారు.

ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడినప్పటికీ.. వాళ్ల ఫీల్డింగ్ ఆకట్టుకుంది. గత మ్యాచ్‌‌ల్లో లేని విధంగా భారత ఫీల్డర్లు రెండు తేలికైన క్యాచ్‌లను వదిలేయగా.. న్యూజిలాండ్ ఫీల్డర్లు మాత్రం తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. భారత ఫాస్ట్ బౌలర్లు గాయాల భయంతో.. బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపేందుకు డైవ్ చేసే సాహసం చేయలేదు. కానీ కివీస్ ఫీల్డర్లు మాత్రం ధైర్యంగా డైవ్ చేసి బంతులను ఆపారు. వరల్డ్ కప్ 2023(World Cup 2023)లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడిన మ్యాచ్‌లో.. రోహిత్ సేన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.