World Cup Final: ఫైనల్ మ్యాచ్ కు పిచ్ ఎలా ఉండబోతుందంటే..

అహ్మదాబాద్ లో పోరుకు అంతా సిద్ధం

Courtesy: Twitter

Share:

World Cup Final: కేవలం 140 కోట్ల మంది భారతీయులు (Indians) మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు (Sports Lovers) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోరుకు సమయం సిద్ధమైంది. ఇంకా కొద్ది సేపట్లో అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా ఈ పోరు జరగనుంది. వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం (Ready) అయిపోయింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందా? అన్న క్యూరియాసిటీ (Curiocity) అందరిలో మొదలయిపోయింది. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలిచి సత్తా చాటాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. 

అప్పటి ఓటమికి బదులు తీర్చుకునేనా? 

2003 వరల్డ్ కప్ ఫైనల్లో (World Cup Final) ఆస్ట్రేలియా (Australia) జట్టు టీమిండియాను ఘోరంగా ఓడించింది. ఆనాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (Sachin), సెహ్వాగ్ వంటి వారు ఉన్నా కానీ మనోళ్లు మ్యాచ్ గెలవలేకపోయారు. ఏదేమైనా ఈ రోజు మాత్రం మ్యాచ్ గెలవాలని యావత్ టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలిచి 20 సంవత్సరాల పగకు రివేంజ్ (Revenge) తీర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సారి జరిగిన లీగ్ మ్యాచ్ లో కూడా ఇండియా జట్టు ఆస్ట్రేలియా మీద గెలవడం మనకు కలిసొచ్చే అంశం. కావున ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

పిచ్ పరిశీలించిన అట్కిన్సన్..

ఇక అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుందా? అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పిచ్ (Pitch) ఎలా బిహేవ్ చేస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ (Captain) ఏం తీసుకుంటాడనే విషయంపై అనేక మంది సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇలా చేస్తే విజయం (Win) సాధించడం సులభం అవుతుందని చెబుతున్నారు. ఇలా చేయకపోతే కష్టపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పిచ్. క్యూరేటర్ తపోష్ ఛటర్జీ నేతృత్వంలో గ్రౌండ్స్ మెన్ పిచ్ ను సిద్దం చేశారు. ప్రపంచ కప్ పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్ (Atkinson) సన్నాహాలు మరియు పిచ్‌ను పరిశీలించడానికి వచ్చే ముందు గ్రౌండ్ సిబ్బంది తమ పనిని కొనసాగించారు. హాజరైన సిబ్బంది మరియు క్యూరేటర్‌ లందరినీ అభినందించిన తర్వాత, అట్కిన్సన్ 22 గజాలలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి పిచ్ మొత్తాన్ని ఒక సారి తనిఖీ చేశాడు. ఈ పరిశీలన సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను అట్కిన్సన్ పంచుకున్నాడు. అట్కిన్సన్ దాదాపు 30 నిమిషాల పాటు పిచ్ ను తనిఖీ చేశాడు. అంతే కాకుండా పిచ్ క్యూరేటర్ (Curator) ఛటర్జీతో చర్చలు కూడా జరిపారు. అనంతరం అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు. ఇక అట్కిన్సన్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత పిచ్ కు సంబంధించిన సన్నాహకాలు మళ్లీ మొదలు పెట్టి గ్రౌండ్ సిబ్బంది (Ground Staff) వాటిని పూర్తి చేశారు. 

పాట్ కమిన్స్ చెప్పిందిదే.. 

మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) పిచ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో ఆయన మాట్లాడుతూ.. నేను గొప్ప పిచ్ రీడర్ కాదు, కానీ పిచ్ చాలా దృఢంగా కనిపించింది. గ్రౌండ్స్ మెన్ ఇప్పుడే నీరు పోశారు.. కాబట్టి మరో 24 గంటలు చూడాలి అని అన్నాడు. ఇది చాలా మంచి వికెట్ లాగా ఉందని పేర్కొన్నాడు. ఈ పిచ్ ఇది వరకే వాడారా అని రిపోర్టర్లు (Reporters) కమిన్స్ ను ప్రశ్నించినపుడు ఇండియా-పాక్ మ్యాచ్ కోసం దీని ఒక స్ట్రిప్ ను ఉపయోగించారని వెల్లడించారు. ఇది చాలా మంచి వికెట్ అని మరోసారి చెప్పారు.పాకిస్తాన్ (Pakistan) అక్కడ ఆడిందని నేను అనుకుంటున్నానని కమిన్స్ తెలిపాడు. 

కివీస్ తో మ్యాచ్ పిచ్ పై

మనం సెమీఫైనల్లో (Semifinal) కివీస్ మీద గెలిచిన నుంచి పిచ్ మీద ఒకటే చర్చ జరుగుతోంది. పిచ్ ఇండియాకు అనుకూలించేలా తయారు చేశారని అందుకే ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించిందని చెబుతున్నారు. పిచ్ ను అలా ఒక జట్టుకు ఫేవరేట్ గా తయారు చేయడం సాధ్యం కాని విషయం అని తెలిసినా కానీ చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా కొందరైతే మరో అడుగు ముందుకేసి ముంబై (mumbai) మ్యాచ్ లో టాస్ కూడా ఫిక్స్ అయిందని ఆరోపిస్తున్నారు. అందుకోసమే రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ కాయిన్ వారు ఉన్న దగ్గరి నుంచి దూరంగా వేశాడని అంటున్నారు. ఏదేమైనా కానీ ఇండియా సెమీఫైనల్ గెలిచి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇండియా ఫైనల్ ఆడేందుకు సిద్దం అయినా కానీ ఆ మ్యాచ్ మీద ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ఈ విషయం మీద ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. ఇది రెండు జట్లకు ఒకటే. మీరు సొంత దేశంలో మీ వికెట్‌ పై ఆడటం వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించాడు. మా జట్టు ఇక్కడ చాలా క్రికెట్ ఆడింది కావున మాకు కూడా ఇది సొంత వికెట్ లాగే ఉంటుందని తెలిపాడు. ఇంకాసేపట్లో పోరు మొదలు కానుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు పట్టు సాధిస్తారో ఎవరు విజేతగా అవతరిస్తారో..