వరల్డ్ కప్.. మొదటి విజయం సాధించిన భారత్

ఎప్పుడు ఎప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూసిన వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. ఆదివారం జరిగిన భారత్ – ఆస్ట్రేలియా మొదటి ఫేస్ ఆఫ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ 41.2 ఓవర్లలో 201/4 స్కోర్ సాదించుగా, ఆస్ట్రేలియా 49.3 ఓవర్లకు గాను కేవలం 199 పరుగులు చేసి ఓడిపోయింది. మరిన్ని వరల్డ్ కప్ విశేషాలు చూద్దాం రండి.  అదరగొట్టిన  KLరాహుల్, విరాట్:  2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను […]

Share:

ఎప్పుడు ఎప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూసిన వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైంది. ఆదివారం జరిగిన భారత్ – ఆస్ట్రేలియా మొదటి ఫేస్ ఆఫ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ 41.2 ఓవర్లలో 201/4 స్కోర్ సాదించుగా, ఆస్ట్రేలియా 49.3 ఓవర్లకు గాను కేవలం 199 పరుగులు చేసి ఓడిపోయింది. మరిన్ని వరల్డ్ కప్ విశేషాలు చూద్దాం రండి. 

అదరగొట్టిన  KLరాహుల్, విరాట్: 

2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడంలో విరాట్ కోహ్లీ మరియు కెఎల్ రాహుల్ ప్రత్యేకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఆదివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా వంటి భారత బౌలర్లు, ఆస్ట్రేలియాను 199 పరుగులకే వెనుతిరిగేలా చేశారు.

అక్టోబర్ 8, ఆదివారం చెన్నైలో జరిగిన, 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో వారి ప్రారంభ మ్యాచ్‌లో భారత్‌కు సంచలన విజయాన్ని అందించారు..విరాట్ కోహ్లీ మరియు KL రాహుల్. కెఎల్ రాహుల్ 97, విరాట్ కోహ్లీ 85 పరుగులు చేయడంతో భారత్ 41.2 ఓవర్లలో 200 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. 

మొదటి మ్యాచ్ కు దూరమైన శుభ్‌మన్ గిల్: 

200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 2 వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ డెంగ్యూ కారణంగా ఆట ఆడలేకపోయాడు. అందుకే రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇషాన్ కిషన్, ప్రపంచకప్ అరంగేట్రంలోనే అంతంత మాత్రం గానీ ఆడినట్లు కనిపిస్తోంది. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడైన రోహిత్ శర్మ కూడా డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, తన మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌ను ప్రారంభించాడు కానీ స్కోర్ చేయకుండానే వెనుతిరిగాడు. మొదటిలో జరిగిన కొన్ని విషయాలు భారతదేశ అభిమానులను కలవరపరిచిందని చెప్పుకోవాలి. 

విరాట్ కోహ్లీ, KL రాహుల్ ఆస్ట్రేలియన్ పేసర్లతో తమదైన శైలిలో ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం భారతదేశంపై నాలుగు వికెట్లు తీసిన గ్లెన్ మాక్స్‌వెల్‌పై కూడా జాగ్రత్త వహించారు. కొన్ని విచిత్రమైన కారణాల వల్ల, పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా తరఫున ఏకైక లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను మ్యాచ్లో ఆలస్యంగా  పంపించినట్లు కనిపించింది. 18వ ఓవర్‌లో జంపా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు, కోహ్లీ, రాహుల్ తమ అత్యుత్తమ ఆట తీరుని చాలా బాగా ప్రదర్శించారు. తక్కువ ఓవర్ లోనే ఇద్దరు అర్థసంచరీలు చేసి అదరగొట్టారు.

199కె ఆస్ట్రేలియా అవుట్: 

కుల్దీప్ యాదవ్ ఎప్పటిలాగే తన ఆట తీరును చాలా చక్కగా చూపించాడు. ఆస్ట్రేలియాకు వెన్నుముకగా ఉండే గ్లెన్ మాక్స్‌వెల్‌ను అవుట్ చేయడంతో ఆస్ట్రేలియాను మరింత వెనక్కి నెట్టాడు. మరో ముఖ్యమైన కెమెరాన్ గ్రీన్ వికెట్‌ టి సి అదరగొట్టాడు ఆర్ అశ్విన్‌.

భారతదేశం జట్టు మొత్తం బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విషయంలో అదరగొట్టారని చెప్పుకోవాలి. బుమ్రా కూడా ఎప్పటిలాగే తన ఆట తీరును కొనసాగించారు.. ముఖ్యంగా మ్యాచ్లో అతని పేస్ ఎప్పుడూ తగ్గలేదు. చివరి దశలో హార్దిక్ పాండ్యా మరియు మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసి ఆస్ట్రేలియాను 199 పరుగులకు ఆలౌట్ చేశారు, ఇది ప్రపంచ కప్ చరిత్రలో భారతదేశంతో ఆడి ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండవ అత్యల్ప స్కోరు. ఇలాగే భారత్ తన ఆట తీరును కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు 

గ్రూప్ దశలో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి, ఒక్కో జట్టు మిగతా అందరితో ఒకసారి తలపడాల్సి ఉంది. ఈ ఏడాది టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటున్నాయి. అహ్మదాబాద్‌లో రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు మరియు ఒక కప్ ఫైనల్‌నాకౌట్ దశకు కేవలం నాలుగు జట్లు మాత్రమే చేరుకుంటాయి.