Hasan Raza: టీమిండియాపై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Hasan Raza: డీఆర్ఎస్‌(DRS)నూ తారుమారు చేస్తున్నారు అంటూ టీమిండియా(Team India)పై మరోసారి నోరు పారేసుకున్నాడు పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా(Hasan Raza). ఇండియన్ బౌలర్లకు వేరే బాల్ ఇస్తున్నారని, దానిని చెక్ చేయాలని ఈ మధ్యే అతడు చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. టీమిండియా(Team India)పై మరోసారి నోరుపారేసుకున్నాడు పాకిస్థాన్(Pakistan) మాజీ క్రికెటర్ హసన్ రజా. ఈసారి ఇండియన్ టీమ్ డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)నూ తారుమారు చేస్తున్నారని అతడు అనడం గమనార్హం. సౌతాఫ్రికా(South […]

Share:

Hasan Raza: డీఆర్ఎస్‌(DRS)నూ తారుమారు చేస్తున్నారు అంటూ టీమిండియా(Team India)పై మరోసారి నోరు పారేసుకున్నాడు పాక్ మాజీ క్రికెటర్ హసన్ రజా(Hasan Raza). ఇండియన్ బౌలర్లకు వేరే బాల్ ఇస్తున్నారని, దానిని చెక్ చేయాలని ఈ మధ్యే అతడు చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

టీమిండియా(Team India)పై మరోసారి నోరుపారేసుకున్నాడు పాకిస్థాన్(Pakistan) మాజీ క్రికెటర్ హసన్ రజా. ఈసారి ఇండియన్ టీమ్ డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)నూ తారుమారు చేస్తున్నారని అతడు అనడం గమనార్హం. సౌతాఫ్రికా(South Africa)ను ఇండియా చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత రజా తన అసహనాన్ని ఇలా వెల్లగక్కాడు. సౌతాఫ్రికా బ్యాటర్ వాండెర్ డుసెన్(Vander Dussen) ఔటైన తీరును అతడు ప్రశ్నించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో జడేజా 5 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. అతని బౌలింగ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ వాండెర్ డుసెన్ (నిజానికి అది క్లాసెన్ వికెట్) ను ఎల్బీడబ్ల్యూగా(Ibw) ఔట్ ఇచ్చిన విధానాన్ని హసన్ రజా తప్పుబట్టాడు. లెఫ్టామ్ స్పిన్నర్ వేసిన బాల్ లెగ్ స్టంప్ పై పడి మళ్లీ ఆఫ్ స్టంప్ కు ఎలా తగులుతుందని రజా అన్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ డిబేట్(Debate)లో అతడు మాట్లాడాడు.

అంతకు ముందు ముంబై మ్యాచ్‌లో లంకను టీమిండియా(Team India) బౌలర్లు 55 పరుగులకే కుప్పకూల్చడం చూసి మైండ్ బ్లాంక్ అయ్యిందేమో.. మ్యాచ్ తర్వాత హసన్ రజా కాంట్రవర్సీ కామెంట్స్(Controversial Comments) చేశాడు. టీమిండియా బౌలర్ల ప్రదర్శనను తక్కువ చేసేలా హసన్ రజా ఓ షోలో వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) కలిసి ఇండియా బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారని హసన్ రజా ఆరోపించాడు. ఈ స్పెషల్ బాల్స్ సాయంతోనే ఇండియా బౌలర్లు స్వింగ్, సీమ్ రాబట్టగలుగుతున్నారంటూ తన కడుపుమంట బయటపెట్టుకున్నాడు. 

ఇతర జట్ల కంటే టీమిండియా బౌలర్లు మంచి స్వింగ్, సీమ్‌తో బౌలింగ్ చేయడానికి ఈ ప్రత్యేకమైన బాల్స్ కారణమంటూ హసన్ రజా(Hasan Raza) ఆరోపించాడు. డీఆర్ఎస్ నిర్ణయాలు కూడా టీమిండియాకు అనుకూలంగా వస్తున్నాయని ఆరోపించాడు. తాజా డిబేట్ లో సదరు ఛానెల్ యాంకర్ ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు. బాల్ చెక్ చేయాలని మీరు అంటే ఎవరూ సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీ వెంటే ఉన్నదని ఆ యాంకర్.. రజాతో అన్నాడు.

అప్పుడే రజా డీఆర్ఎస్(DRS) గురించీ ప్రస్తావించాడు. “జడేజా(Jadeja) ఐదు వికెట్లు తీశాడు. ఇది అతని కెరీర్ బెస్ట్. టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే డీఆర్ఎస్(DRS) విషయంలోనూ అవకతవకలు జరిగాయి. వాండెర్ డుసెన్(Vander Dussen) ఎల్బీడబ్ల్యూ(Ibw) విషయంలో బాల్ లెగ్ స్టంప్ పై పడి ఆఫ్ స్టంప్ కు తగులుతున్నట్లుగా చూపించారు. అది ఎలా సాధ్యం? ఇంపాక్ట్ ఇన్‌లైన్లోనే ఉన్నా బాల్ లెగ్ స్టంప్ బయటకు వెళ్తున్నట్లు కనిపించింది. అందరిలాగే నా అభిప్రాయం చెబుతున్నాను. అలాంటి విషయాలను చెక్ చేయాలి. డీఆర్ఎస్ తారుమారు చేశారు. అది స్పష్టంగా కనిపిస్తోంది” అని రజా అన్నాడు. 

పాకిస్థాన్(Pakistan) ఇదే సౌతాఫ్రికాతో ఆడుతున్నప్పుడు తబ్రేజ్ షంసీ(Tabraiz Shamsi)ని నాటౌట్ గా ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రజా గుర్తు చేశాడు. డీఆర్ఎస్ తారుమారు చేయడం ఇదే తొలిసారి కాదని, పాక్, సౌతాఫ్రికా మ్యాచ్ సందర్భంగా ఇలాగే జరిగినా కనీసం క్షమాపణలు చెప్పలేదని అన్నాడు. స్వదేశంలో ఆడటం ఎలాంటి లబ్ధి చేకూరుస్తుందనడానికి ఇదే నిదర్శనం అని రజా అనడం గమనార్హం.