ఆసియా కప్ లో బౌలింగ్ తో సత్తా చాటిన రవీంద్ర జడేజా

ఆసియా కప్ లో ప్రస్తుతం భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తనదైన శైలిలో ఆడి అందరి ఆదరాభిమానాలను మరొకసారి సంపాదించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఆట తీరును తన సొంతం చేసుకుని, అవతల జట్టు కీలకమైన వికెట్లను కొల్లగొట్టి కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.  రికార్డ్ సృష్టించిన జడేజా:  భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా తన పేరు మీద కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మంగళవారం శ్రీలంకపై […]

Share:

ఆసియా కప్ లో ప్రస్తుతం భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తనదైన శైలిలో ఆడి అందరి ఆదరాభిమానాలను మరొకసారి సంపాదించుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఆట తీరును తన సొంతం చేసుకుని, అవతల జట్టు కీలకమైన వికెట్లను కొల్లగొట్టి కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 

రికార్డ్ సృష్టించిన జడేజా: 

భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌గా తన పేరు మీద కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. మంగళవారం శ్రీలంకపై 2/33తో క్లెయిమ్ చేసిన జడేజా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో మొత్తం 18 మ్యాచ్‌లో నుండి 24 వికెట్లు పడగొట్టాడు, ఇర్ఫాన్ పఠాన్ 12 గేమ్‌లలో 22 వికెట్ల స్కోరును అధిగమించి ఒక కొత్త రికార్డ్స్ సృష్టించాడు.

41 పరుగుల దగ్గర ధనంజయ డి సిల్వా వికెట్‌ను కైవసం చేసుకున్నాడు. నిజానికి అవతల జట్టులో ఉన్న ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలగేతో కలిసి 63 పరుగులు చేసి భారతీయులను భయపెట్టాడు. అటువంటి ఆటగాడు వికెట్ కొల్లగొట్టడం మామూలు విషయం కాదు.. అది జడేజా వల్లే సాధ్యమైంది.

ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ కూడా శ్రీలంక మరియు పాకిస్థాన్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లను కైవసం చేసుకుని, 10 గేమ్‌లలోగాను మొత్తం 19 వికెట్లతో అద్భుతమైన స్కోర్‌తో జడేజాకు దగ్గరగా ఉన్నాడు. మొత్తంమీద ఇప్పటివరకు, ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 24 మ్యాచ్‌లలో 30 వికెట్లతో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచారు, లసిత్ మలింగ (14 గేమ్‌లలో 29 వికెట్లు), అజంతా మెండిస్ (8 గేమ్‌లలో 26 వికెట్లు), పాకిస్థాన్‌కు చెందిన సయీద్ అజ్మల్ (12 గేమ్‌లలో 25 వికెట్లు). 

ఇటీవల మరొకరి రికార్డు సొంతం చేసుకున్న జడేజా: 

ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్ లో కూడా జడేజా సత్తా చాటాడు. రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్ సృష్టించిన రికార్డు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. వెస్టిండీస్ కి భారత్ కు మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో, భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవులు ఆటను మరింత రసవత్రంగా మార్చారు. తమ ఆట తీరుతో గ్రౌండ్లో అదరగొట్టారు. సుమారు వీళ్లిద్దరూ కలిసి ఏడు వికెట్లు తీయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆటలో కుల్దీప్ యాదవ్, 3 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు, రవీంద్ర జడేజా విషయానికి వస్తే 6 ఓవర్లలో మూడు వికెట్లు తీయగలిగారు. ఈ ఘనత, రవీంద్ర జడేజా అలాగే కుల్దీప్ యాదవ్లకే దక్కిందని చెప్పుకోవాలి. నిజానికి వీరిద్దరూ కూడా స్పీడ్ బౌలింగ్ లో ఆరితేరిన వాళ్ళు. వీరిద్దరూ కలిసి వన్డే మ్యాచ్ లో వారి ఆటతీరుతో అలరించారు. 7 వికెట్లు తీసిన ఘనతను దక్కించుకున్నారు వీరిద్దరూ. 

అయితే ఆట అనంతరం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తమ ఆట తీరు గురించి మాట్లాడుతూ, నిజంగా ఈ ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉందని, అంతేకాకుండా వెస్టిండీస్ గ్రౌండ్ పై తమకు చాలా అనుకూలంగా ఆడే విధానం నచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ, వెస్టిండీస్ మైదానంలో తాము తీసిన ఏడు వికెట్ల గురించి మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. వారి స్పిన్ బౌలింగ్ తమకు కలిసి వచ్చిందని అందుకే ఈజీగా ఏడు వికెట్లు సాధించగలిగామన్నారు. ముఖ్యంగా వారి రిథం మీద దృష్టి పెట్టి ఆటను ఈజీగా ఆడినట్లు తెలిపారు. దృష్టి పెట్టి వికెట్లు పడగొట్టాలని మంచి దృష్టితో ఆడినందువల్లే ఏడు వికెట్లు తీగలిగామని చెప్పకొచ్చారు. అయితే తనకు చాహల్ ద్వారా లభించిన సలహాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి అన్నారు కుల్దీప్ యాదవ్. తమతో పాటు ఆడిన ముఖేష్ కుమార్, శార్దూల్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు అని మెచ్చుకున్నారు. అయితే ముఖ్యంగా, కుల్దీప్ యాదవ్ అలాగే రవీంద్ర జడేజాలు కలిసి వెస్టిండీస్ పైన విజయం సాధించడంలో తమ వంతు కృషి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.