ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే ఇండియన్ విరాట్ కోహ్లీ

సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తొచ్చేవి వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటివే ముందు గుర్తొస్తాయి. తమకు నచ్చిన సెలబ్రిటీలను సోషల్ మీడియాల్లోనే అనుసరిస్తుంటారు అభిమానులు. సెలబ్రిటీలు సైతం తమకు అభిప్రాయాలను వీటి ద్వారానే అభిమానులతో పంచుకుంటారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీలు చేసే ఒక్కో పోస్టుకు కోట్లు ఛార్జ్ చేస్తుంటారు విరాట్ కోహ్లీ కి సోషల్ మీడియా లో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వింటే క్రికెట్ అభిమానుల్లో […]

Share:

సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తొచ్చేవి వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటివే ముందు గుర్తొస్తాయి. తమకు నచ్చిన సెలబ్రిటీలను సోషల్ మీడియాల్లోనే అనుసరిస్తుంటారు అభిమానులు. సెలబ్రిటీలు సైతం తమకు అభిప్రాయాలను వీటి ద్వారానే అభిమానులతో పంచుకుంటారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీలు చేసే ఒక్కో పోస్టుకు కోట్లు ఛార్జ్ చేస్తుంటారు

విరాట్ కోహ్లీ కి సోషల్ మీడియా లో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వింటే క్రికెట్ అభిమానుల్లో పూనకాలు వచ్చినట్లే. విరాట్ గ్రౌండ్ లోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. ప్రపంచ టాప్ బ్యాటర్లలో ఒకడిగా పేరు గడించిన కోహ్లీకి అభిమానులు ఎక్కువే అని చెప్పాలి 

తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. టీమిండియా లో టాప్ బ్యాటర్‌ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కింగ్‌ కోహ్లీనే. కేవలం ఆట పరంగానే కాదు సంపాదనలోనూ అతను కింగే. క్రికెట్‌ ద్వారానే కాకుండా యాడ్స్‌, ఇతర బిజినెస్‌ల ద్వారా కోహ్లీ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ద్వారా కూడా భారీగానే ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.

సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తొచ్చేవి వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటివే ముందు గుర్తొస్తాయి. తమకు నచ్చిన సెలబ్రిటీలను సోషల్ మీడియాల్లోనే అనుసరిస్తుంటారు అభిమానులు. సెలబ్రిటీలు సైతం తమకు అభిప్రాయాలను వీటి ద్వారానే అభిమానులతో పంచుకుంటారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీలు చేసే ఒక్కో పోస్టుకు కోట్లు ఛార్జ్ చేస్తుంటారువిరాట్ కోహ్లీకి సోషల్ మీడియా లో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండియన్ సెలబ్రిటీస్ లో పెట్టే ప్రతి పోస్ట్ కి టాప్ మోస్ట్ అమౌంట్ తీసుకునే వ్యక్తి భారత్ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతని ఇన్స్టా అకౌంట్లో 256 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కోహ్లీ పెట్టిన ఏ పోస్ట్ అయినా సరే వితిన్ సెకండ్స్ వైరల్ అవుతుంది. కోహ్లీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ లిస్ట్ ఇండియాలో మరి ఏ ఇతర సెలబ్రిటీకి లేదు … ప్రతి స్పాన్సర్డ్‌ పోస్ట్‌కి కోహ్లీ రూ.కోట్లల్లో ఛార్జ్‌ చేస్తున్నాడు.

2023లో ప్రముఖ ఫొటో, వీడియో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్‌ 20 స్టార్స్‌ జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో  అగ్రస్థానంలో నిలిచాడు. అతను ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 3.23 మిలియన్ల భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాడు. అంటే ఇది దాదాపుగా రూ.26.75 కోట్లకు సమానం. ఇక రొనాల్డో తర్వాత లియోనెల్‌ మెస్సీ  తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు 2.56 మిలియన్లువసూలు చేస్తున్నాడు. అంటే రూ.21.49 కోట్లన్నమాట.

ఇక ఈ జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు 1.38 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తేలింది. అంటే ఒక్కో పోస్ట్‌కు కోహ్లీ సంపాదన రూ.11.45 కోట్లన్న మాట. భారత్‌ నుంచి కోహ్లీకి ఒక్కడికే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 29 స్థానంలో ఉన్న ప్రియాంక.. ఒక్కపోస్టు ద్వారా రూ.4.40 కోట్లు వస్తాయట. అయితే తాజాగా విడుదలైన జాబితాలో తొలి రెండు స్థానాల్లో క్రీడాకారులు ఉండటం గమనార్హం