నేను అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్

ఎం స్ ధోని.. భార్య సాక్షి ఒక ఈవెంట్ లో తనకి అల్లు అర్జున్ మూవీస్ అంటే చాల ఇష్టం అని ఆయన చేసిన మూవీస్ అన్ని హిందీ లో డబ్ అవుతాయి అని అవి చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను  అని చెప్పుకొచ్చారు….  పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాఫ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోయిందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్‌లో పుష్ప అంత పెద్ద హిట్ అవ్వడం బన్నీకి బాగా కలిసొచ్చింది. అటు […]

Share:

ఎం స్ ధోని.. భార్య సాక్షి ఒక ఈవెంట్ లో తనకి అల్లు అర్జున్ మూవీస్ అంటే చాల ఇష్టం అని ఆయన చేసిన మూవీస్ అన్ని హిందీ లో డబ్ అవుతాయి అని అవి చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను  అని చెప్పుకొచ్చారు…. 

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాఫ్ ఏ రేంజ్‌కు వెళ్లిపోయిందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్‌లో పుష్ప అంత పెద్ద హిట్ అవ్వడం బన్నీకి బాగా కలిసొచ్చింది. అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య చూస్తే దిమ్మతిరిగిపోద్ది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళ మరియు ఉత్తర భారతదేశంలో భారీ అభిమానులను సంపాదించుకున్నారు  అల్లు అర్జున్. ఇటీవలే జరిగిన తన తొలి ప్రొడక్షన్ వెంచర్ ప్రమోషనల్ ఈవెంట్‌లో, ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తాను అల్లు అర్జుకు అభిమానినని చెప్పారు..

ఎంఎస్‌ ధోని ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై సాక్షి ధోని నిర్మాత….

టీమిండియా లెజెండ్ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తమిళంలో ఎల్‌జీఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రమేష్‌ తమిళమణి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హరీష్‌ కల్యాణ్‌, నటి ఇవాన జంటగా నటించిన ఈ చిత్రంలో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌కు ధోని భార్య, చిత్ర నిర్మాత సాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

మీరు తెలుగు హీరోల సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించగా.. సాక్షి బదులిచ్చింది. తాను ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు చూశానని..నేను అల్లు అర్జున్ సినిమాలన్నీ చూసేశాను. ఆ టైమ్‌లో ఓటిటి లాంటివి లేవు. యూట్యూబ్‌లోఒక   ఛానెల్‌లోనే సినిమాలన్నీ చూశాను. వాళ్లు తెలుగు సినిమాలన్నింటినీ హిందీలోకి అనువాదం చేశారు. కాబట్టి అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ నేను పెరిగాను. ఆయనకు నేను చాలా పెద్ద అభిమానిని’ అని సాక్షి వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా థియేటర్‌లో అరుపులు, కేకలు వినిపించాయి ఈ సమాధానం చెప్పాగానే ఫ్యాన్స్ పెద్దఎత్తున సందడి చేశారు. ప్రస్తుతం సాక్షి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైరల్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ రాబోయే సినిమాలు 

బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన రన్ తర్వాత, అల్లు  అర్జున్  పుష్ప: ది రూల్, పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వం లో కనిపించనున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, సుకుమార్ మాట్లాడుతూ  సినిమా త్వరలో విడుదలయ్యేలా చిత్రీకరణ పూర్తవుతుందని తాను ఆశిస్తున్నాను అని చెప్పారు .

 2019లో తన 36వ పుట్టినరోజున ఈ చిత్రం గురించి ప్రకటన చేశారు. పుష్ప: ది రూల్‌పై నిర్మాణాన్ని ముగించిన తర్వాత, అల్లు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఐకాన్‌లో కనిపిస్తాడు. MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) మరియు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ఆ తరువాత తెలుగు సూపర్ స్టార్ హిట్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మళ్లీ జతకట్టనున్నారు, రాబోయే సోషల్ థ్రిల్లర్ కోసం AA 22 అని తాత్కాలికంగా పేరు పెట్టారు.