కేఎల్ రాహుల్ ఆడకపోతే..?

2014లో అరంగ్రేటం చేసిన కేఎల్ రాహుల్..  ఆరంభంలో అదరగొట్టాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోయాడు. అనతికాలంలోనే టీమిండియా వైస్ కెప్టెన్ వరకు ఎదిగాడు.  అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం అతడు వరుస పెట్టి గాయాల బారిన పడుతున్నాడు. గతేడాది స్పోర్ట్స్ హెర్నియా కారణంగా కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇక ఈ ఏడాది తొడ కండరాల గాయం కారణంగా నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఒక మ్యాచ్ లో అదరగొట్టడం.. ఆ […]

Share:

2014లో అరంగ్రేటం చేసిన కేఎల్ రాహుల్..  ఆరంభంలో అదరగొట్టాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోయాడు. అనతికాలంలోనే టీమిండియా వైస్ కెప్టెన్ వరకు ఎదిగాడు.  అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం అతడు వరుస పెట్టి గాయాల బారిన పడుతున్నాడు. గతేడాది స్పోర్ట్స్ హెర్నియా కారణంగా కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇక ఈ ఏడాది తొడ కండరాల గాయం కారణంగా నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఒక మ్యాచ్ లో అదరగొట్టడం.. ఆ తర్వాత వరుస పెట్టి విఫలం అవ్వడం కేఎల్ రాహుల్ కు అలవాటు. 

గతేడాది జరిగిన ఆసియాకప్, టి20 ప్రపంచకప్ లలో కేఎల్ రాహుల్ దారుణంగా వైఫల్యం చెందాడు.నాణ్యమైన బౌలర్లు వేసే బంతులను ఆడలేడనే అపవాదును కూడా ఎదుర్కొంటున్నాడు. స్వింగ్ అయ్యే బంతులను ఆడలేడు. పసికూనలపై అదరగొట్టే కేఎల్ రాహుల్ బలమైన జట్లపై మాత్రం చేతులెత్తేస్తాడు. కీలక మ్యాచ్ ల్లో విఫలమవుతూ టీమిండియా చోకర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ టెస్టు బ్యాటింగ్ తో విసిగించేశాడు. 

గుజరాత్ టైటాన్స్ పై సులభంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ వరకు ఉన్న కేఎల్ రాహుల్ లక్నోను గెలిపించలేకపోయాడు. కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతున్నా.. అతడిపై టీమిండియా మాత్రం నమ్మకం కోల్పోవడం లేదు. వరుసగా అవకాశాలను ఇస్తూనే ఉంది. పూర్తిగా ఫిట్ నెస్ సాధించకపోయినా ఆసియా కప్ కోసం ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఉన్న ఫామ్, ఫిట్ నెస్ తో అయితే అతడు టీమిండియాకు అనర్హుడనే చెప్పాలి. అతడి కంటే ట్యాలెంట్ ఉన్న ప్లేయర్లు ఎందరో ఉన్నారనేది వాస్తవం. 

కేఎల్ రాహుల్ పై బీసీసీఐ చూపిస్తున్న అతి నమ్మకం ఏదో ఒకరోజు టీమిండియా కొంప ముంచేలా కనిపిస్తుంది.కేఎల్ రాహుల్ కారణంగా సంజూ సామ్సన్ బ్యాకప్ ప్లేయర్ గా మారాడు. 2014 నుంచి టీమిండియాలో ఉన్న కేఎల్ రాహుల్ 47 టెస్టులు.. 54 వన్డేలు.. 72 టి20లు ఆడాడు. టెస్టుల్లో రాహుల్ సగటు 33.44 కాగా.. వన్డేల్లో 45.. టి20ల్లో 37.75.

ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంక చేరుకుంది భారత జట్టు. సెప్టెంబర్ 2న కెండీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడే టీమిండియా, సెప్టెంబర్ 4న నేపాల్‌తో తలబడుతుంది. అయితే మొదటి రెండు మ్యాచుల్లో కెఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించాడు. కెఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియాకి కొత్త తలనొప్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా టీమ్ కాంబినేషన్‌ని కొనసాగించడం చాలా కష్టంగా మారుతుంది. 

కొన్నాళ్లుగా రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ ఆడని మ్యాచుల్లో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కి మంచి రికార్డు ఉంది. వెస్టిండీస్ టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓపెనర్‌గా వచ్చి హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదాడు ఇషాన్ కిషన్.. వన్డేల్లో ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదిన తర్వాత కూడా శుబ్‌మన్ గిల్ కారణంగా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు ఇషాన్ కిషన్. 

కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్‌ని తప్పక ఆడించాల్సిన పరిస్థితి..‘కెఎల్ రాహుల్, మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో నాకైతే ఐదు ప్రశ్నలు వెంటాడుతున్నాయి? ఇషాన్ కిషన్‌ ఓపెనింగ్ చేస్తాడా? అలా అతను ఓపెనర్‌గా వస్తే, శుబ్‌మన్ గిల్ ఏ ప్లేస్‌లో ఆడతాడు? ఒకవేళ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసి, ఇషాన్ కిషన్‌ని వన్‌డౌన్‌లో పంపిస్తారా? అలా చేస్తే విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించాల్సి వస్తుంది. 

ఆటోమేటిక్‌‌గా అక్కడ బ్యాటింగ్ చేసే శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానానికి వెళ్తాడు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసి, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో పంపి, శ్రేయాస్ అయ్యర్ తర్వాత ఐదో స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఆడిస్తారా? లేక శుబ్‌మన్ గిల్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, తిలక్ వర్మ లేదా సూర్యకుమార్ యాదవ్‌ని ఐదో స్థానంలో ఆడిస్తారా?’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.