Bumrah: బుమ్రా బౌలింగ్ పడట్లేదా?

ప్రస్తుతం రన్ అవుతున్న ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా (India) పేస్ విభాగం పటిష్టంగానే కనబడుతోంది. ఇప్పటికే మనం ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఓటమన్నదే లేకుండా పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్నాం. ఇంతకు ముందు కూడా టీమిండియా విజయాలు సాధించినప్పటికీ మనోళ్లకు బౌలింగ్ (Bowling) అనేది సమస్యగా ఉండేది. మరీ ముఖ్యంగా పేస్ (Pace) బౌలింగ్ విభాగం మనకు వణుకు పుట్టించేది కానీ కొద్ది రోజులుగా మన పేస్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతోంది. మరీ […]

Share:

ప్రస్తుతం రన్ అవుతున్న ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా (India) పేస్ విభాగం పటిష్టంగానే కనబడుతోంది. ఇప్పటికే మనం ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఓటమన్నదే లేకుండా పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్నాం. ఇంతకు ముందు కూడా టీమిండియా విజయాలు సాధించినప్పటికీ మనోళ్లకు బౌలింగ్ (Bowling) అనేది సమస్యగా ఉండేది. మరీ ముఖ్యంగా పేస్ (Pace) బౌలింగ్ విభాగం మనకు వణుకు పుట్టించేది కానీ కొద్ది రోజులుగా మన పేస్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతోంది. మరీ ముఖ్యంగా షమీ, బుమ్రా (Bumrah) ఇద్దరూ మన పేస్ బౌలింగ్ కు రెండు స్తంబాలుగా మారిపోయారు. నిన్నటికి నిన్న మనం ఇంగ్లండ్ మీద ఆడిన మ్యాచులోనే మన బౌలర్ల సత్తా ఏంటో బయటపడింది. మన బ్యాటర్లు కేవలం 229 పరుగులు మాత్రమే చేసినా ఆ లో టార్గెట్ ను కూడా మన బౌలర్లు (Bowlers) కాపాడారు. 

ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు

మన పేస్ బౌలర్లు (Bowlers) ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. పిచ్ (Pitch) తో సంబంధం లేకుండా నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నారు. ఒక్కరి మీదే ఆధారపడకుండా అందరూ రాణిస్తున్నారు. ఇలా అందరూ రాణించడంతో మన ఇండియాకు (India) గెలుపు మరింత సులభం అయింది. ఒక్కోసారి మనం 350+ రన్స్ చేసినా గెలుస్తామా లేదా అనే సందేహంలో జట్టు ఉండేది. అప్పుడు మన బౌలింగ్ అంత తీసికట్టుగా ఉండేది. కానీ గత కొద్ది రోజులుగా మనోళ్లు స్ట్రాంగ్ (Strong) గా తయారవుకుంటూ వస్తున్నారు. నిన్న మాజీ చాంపియన్ అయిన ఇంగ్లండ్ ను (England) కూడా మనోళ్లు మూడు చెరువుల నీళ్లు తాగించారు. దీంతోనే మనోళ్ల సత్తా ఏంటో అర్థం అవుతోంది. మన బ్యాటర్లు ఆఫ్ కలర్ లో ఉన్నా కానీ బౌలర్లు మేమున్నామంటూ జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు. 

షమీ రాకతో.. 

ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ (World Cup) వంటి మెగా టోర్నీలో టీమిండియా తన స్పీడ్ గన్ అయిన షమీ (Shami) ని మొదటి నాలుగు మ్యాచులు బెంచ్ కే పరిమితం చేసింది. అంటే జట్టులో స్థానం కోసం ఎంతలా పోటీ ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఐదో మ్యాచ్ లో షమీ (Shami)కి స్థానం దొరికింది. ఇండియన్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Pandya) గాయపడడంతో బౌలింగ్ ఆప్షన్ గా ఇండియన్ టీం జట్టులోకి షమీని తీసుకొచ్చింది. రావడంతో షమీ తన విలువేంటో చాటి చెప్పాడు. కివీస్ మీద మ్యాచ్ లో రావడంతో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 

వస్తూనే కివీస్ నడ్డి విరిచాడు.. 

కివీస్ (Kiwis) తో మ్యాచ్ కు షమీ జట్టులోకి వచ్చాడు. అంతకు ముందు నాలుగు మ్యాచ్ లు మేనేజ్ మెంట్ అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. కానీ ఇలా వస్తూనే అలా కివీస్ నడ్డి విరిచాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. తాను ఇండియన్ బౌలింగ్ కు ఎంత విలువైన ఆస్తో మరోసారి చాటి చెప్పాడు. కివీస్ తో మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ తో మ్యాచ్ కు కూడా హార్దిక్ పాండ్యా (Pandya) అందుబాటులోకి రాకపోవడంతో మేనేజ్ మెంట్ లాస్ట్ మ్యాచ్ లో ఆడించిన జట్టునే ఆడించింది. దీంతో మరోసారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ ముందు 230 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. అటుపక్క చూస్తేనేమే అరవీర భయంకర బ్యాటర్లు ఉన్నారు. ఈ సమీకరణం చూసి ఇంగ్లండ్ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అలాగే ఇన్నింగ్స్ కూడా మొదలయింది. ఓపెనింగ్ వేసిన సిరాజ్ (Siraj) పెద్దగా ఎఫెక్ట్ చూపెట్టలేదు. దీంతో కెప్టెన్ రోహిత్ సిరాజ్ స్థానంలో షమీకి బంతిని అప్పగించాడు. దీంతో షమీ నిప్పులు చెరగడం స్టార్ట్ చేశాడు. 

అదే హైలెట్ 

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో మహమ్మద్ షమీ (Shami) 4 వికెట్లతో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్ లో షమీ తీసుకున్న 4 వికెట్లను చూసుకుంటే అతడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ స్టోక్స్ ను ఔట్ చేసిన విధానం హైలెట్. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ షమీ(Shami) మాత్రం నిన్నటి మ్యాచ్ లో హైలెట్. మొదటి 4 మ్యాచులలో స్థానం దక్కకపోయినా బెంచ్ మీద ఎదురు చూస్తూ అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న షమీ(Shami)ని క్రికెట్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో పొగుడుతున్నారు. ఇన్నాళ్లూ బుమ్రానే నిప్పులు చెరుగుతాడని అనుకుంటే ఇప్పుడు బుమ్రాకు షమీ తోడయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇండియా ఆల్ మోస్ట్ సెమీ ఫైనల్ కు రీచ్ అయింది. ఇప్పటికి 6 మ్యాచెస్ ఆడిన టీమిండియా ఆరింట ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. 

డ్యూ వచ్చినా కానీ.. 

టీమిండియా ఈ టోర్నీలో మొదటి ఐదు మ్యాచ్ లు గెలిచింది ఒక లెక్క. నిన్నటి ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచింది ఒక లెక్క. లో స్కోరింగ్ గేమ్ లో మన బౌలర్లు పర్ఫామ్ చేసిన విధానం సో గ్రేట్. అంతే కాకుండా మనది సెకండ్ బౌలింగ్ అంటే నైట్ (Night) బంతులేయాలి.. నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యూ (మంచు) (Dew) కూడా వచ్చింది. అయినా కానీ మనోళ్ల డెలివరీలకు ఇంగ్లండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో ఇంగ్లండ్ (England) కేవలం 129 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ (Allout) చేసి మనోళ్లు సగర్వంగా ఆరవ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.