వరల్డ్ కప్ కోసం ఐసీసీ ముందస్తు జాగ్రత్తలు

వరల్డ్ కప్ 2023 అక్టోబర్ లో ప్రారంభం అయ్యే వేల సరైన స్టేడియం కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేసింది ఐసిసి. ముఖ్యంగా బ్యాటింగ్ కి అనువుగా ఉండే పిచ్ గురించి మరింత జాగ్రత్త వహించాలని తేల్చి చెప్పింది ఐసీసీ. అయితే మ్యాచ్ జరిగిన తరువాత పిచ్ గురించి ఎటువంటి కంప్లైంట్ రాకూడదు అని ముఖ్యంగా స్టేడియం గ్రౌండ్ మీద ఉండే గ్రాస్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అండి అట్కిన్సన్ క్రికెట్ క్యూరేటర్లకు […]

Share:

వరల్డ్ కప్ 2023 అక్టోబర్ లో ప్రారంభం అయ్యే వేల సరైన స్టేడియం కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని స్పష్టం చేసింది ఐసిసి. ముఖ్యంగా బ్యాటింగ్ కి అనువుగా ఉండే పిచ్ గురించి మరింత జాగ్రత్త వహించాలని తేల్చి చెప్పింది ఐసీసీ. అయితే మ్యాచ్ జరిగిన తరువాత పిచ్ గురించి ఎటువంటి కంప్లైంట్ రాకూడదు అని ముఖ్యంగా స్టేడియం గ్రౌండ్ మీద ఉండే గ్రాస్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అండి అట్కిన్సన్ క్రికెట్ క్యూరేటర్లకు స్పష్టం చేశారు. 

అవుట్‌ఫీల్డ్ సూచనలు:

బాల్ వేగంగా వెళ్లేందుకు అణువుగా స్టేడియం గ్రౌండ్ ఉండేలా చూసుకోవాలని, ముఖ్యంగా గ్రౌండ్ లో ఉండే గ్రాఫ్ పూర్తిగా కత్తిరించకుండా అణువుగా చేయండి అని హోస్ట్ అసోసియేషన్‌లను, ఐసిసి కోరినట్లు నివేదిక పేర్కొంది. ఇక బౌండరీస్ విషయానికొస్తే, 70 గజాలు నుండి సుమారు గరిష్టంగా 80 గజాలు ఉండాలి అని స్పష్టం చేశారు. కనీసం మూడు సెంటర్-వికెట్ పిచ్‌లు సిద్ధంగా ఉండాలి అని ఐసీసీ, క్యూరేటర్లకు స్పష్టంగా తేల్చి చెప్పింది. క్రికెట్ ఆట మధ్యలో ఒకవేళ వర్షం వచ్చి అంతరాయం కలిగించిన సమయంలో ఇసుక ఆధారిత ఔట్‌ఫీల్డ్‌లు ఉండకూడదని.. వర్షం కురిస్తే గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేసేలా కవర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

మ్యాచ్లు జరిగే చోటు:

భారత్‌లోని 10 స్టేడియంలలో ఈ టోర్నీ జరగనుంది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, లక్నో, ధర్మశాల, పుణెలలో ఒక్కొక్కటి 5 మ్యాచ్‌లు, హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 

ప్రపంచ కప్ ఎప్పుడు: 

భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్, అక్టోబర్ 15 నుంచి 14 కి మారినట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు కూడా రానున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి డేట్, టైమింగ్ లో తప్పిస్తే ఇంకా వేరే వాటిలో మార్పు ఉండకపోవచ్చు అంటూ బీసీసీఐ సెక్రటరీ జె షాహ్ స్పష్టం చేశారు. 

షోపీస్ ఈవెంట్ అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. టోర్నమెంట్‌లో 44 రోజుల వ్యవధిలో 10 వేదికల్లో 48 గేమ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కప్ కోసం పోటీపడతాయి. అందుకోసమే ఇప్పటినుంచే ఐసీసీ స్టేడియంలో ఉండే పిచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

క్రికెట్ వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసేందుకు నవరాత్రి పండుగ కూడా ఒక కారణమని తెలుస్తోంది. అయితే అహ్మదాబాద్ లోకల్ పోలీస్ వారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని, అక్టోబర్ 15న అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటుందని, వారి తరఫునుంచి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్ 15వ రోజున నవరాత్రి పండుగ కూడా వచ్చినందువల్ల ఆరోజు రద్దీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఉద్దేశపడి, రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 15న ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం అభిమానులు ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బుకింగ్స్ చేసుకోవడం కారణంగా, ఇప్పుడు వరల్డ్ కప్ రీషెడ్యూల్ చేసిన తర్వాత అభిమానులలో కాస్త అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.