అప్పుడు నాలుగో ప్లేస్‌లో ఆడమని కోహ్లీకి చెబుదామనుకున్నా

రాబోయే ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌లో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌‌పై భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో కోహ్లీ ఒక్కోసారి తగ్గాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. 2019లో జరిగిన చివరి వన్డే ప్రపంచ కప్‌లో మిడిలార్డర్‌‌ను బలోపేతం చేసే ఉద్దేశంతో విరాట్‌  కోహ్లీని నంబర్‌‌ 4 లో బ్యాటింగ్‌ చేయాలని అడుగుదామనుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుత వన్డే జట్టులో కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్ గురించి చర్చిస్తున్న సమయంలో శాస్త్రి ఈ […]

Share:

రాబోయే ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌లో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌‌పై భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో కోహ్లీ ఒక్కోసారి తగ్గాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. 2019లో జరిగిన చివరి వన్డే ప్రపంచ కప్‌లో మిడిలార్డర్‌‌ను బలోపేతం చేసే ఉద్దేశంతో విరాట్‌  కోహ్లీని నంబర్‌‌ 4 లో బ్యాటింగ్‌ చేయాలని అడుగుదామనుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుత వన్డే జట్టులో కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్ గురించి చర్చిస్తున్న సమయంలో శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వన్డేలలో నంబర్‌‌ 3 స్థానంలో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దానికి పైగా అతను ఇండియా తరఫున ఇదే స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. వన్డేల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కోహ్లీ సగటు 60గా ఉంది. అతను మూడో నంబర్‌‌లో బ్యాటింగ్‌ చేసినప్పుడు 46 సెంచరీల్లో 39 చేశాడు. 

కానీ, వచ్చే ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టుకు అవసరమైతే కోహ్లీ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌‌ను మార్చుకుంటాడని అనుకుంటున్నాను. కీపర్‌‌, ఓపెనర్‌‌గా ఇషాన్‌ కిషన్‌ ఫస్ట్‌ ఛాయిస్‌, ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఆ తర్వాత కోహ్లీ వస్తే బాగుంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

‘‘రోహిత్‌ టాప్‌ ఫోర్‌‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగలడు. మిడిల్‌ ఆర్డర్‌‌లో గిల్‌ను సర్దుబాటు చేయడం అంత సులువు కాదు. కాబట్టి కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలడు. ఇషాన్‌ కిషన్‌ టాప్‌లో బ్యాటింగ్‌ చేయాలి. కెప్టెన్‌గా రోహిత్‌కు చాలా అనుభవం ఉంది. అతను మూడు, నాలుగు స్థానాల్లో ఎందులోనైనా ఆడగలడు. శుభ్‌మన్‌ గిల్‌ను టాప్‌ ఆర్డర్‌‌లో కాకుండా మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయమని అడిగితే అతను ఫీల్ అవుతాడా? లేకపోతే బ్యాటింగ్‌ చేయనని అంటాడా.. కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే, జట్టు కోసం కచ్చితంగా ఆ ప్లేస్‌లో ఆడతాడు” అని శాస్త్రి చెప్పాడు.

‘‘ఇంగ్లండ్‌లో గత ఎడిషన్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా తాను టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే ఆర్డర్‌‌ గురించి ఆలోచించాను. గత రెండు ప్రపంచ కప్‌లలో కూడా ఈ విషయంపై ఆలోచన చేశాను. కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించే విషయంలో ఎమ్మెస్కేతో కూడా నేను చర్చించాను” అని రవిశాస్త్రి తెలిపాడు.

ఈ విషయంపై సెలక్టర్ల చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా రవిశాస్త్రితో ఏకిభవించాడు. కోహ్లీని నంబర్‌‌ 4లో బ్యాటింగ్‌ చేయాలని శాస్త్రి నిజంగానే అనుకున్నాడని చెప్పాడు. అయితే, అప్పుడు జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ తనకు నచ్చిన మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంతో అది జరగలేదని ఎమ్మెస్కే పేర్కొన్నాడు. 

కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో మాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌ టాప్ ఆర్డర్‌‌లో పరిగెత్తడంతో భారత మిడిల్‌ ఆర్డర్‌‌లో లోపం బయటపడింది. 

నాలుగో స్థానంలో కోహ్లీ రికార్డును పరిశీలిస్తే చాలా బాగుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అతను ఆ స్థానానికి సరైన వాడేనని అనిపించిందన్నాడు. నాలుగో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌లో బెస్ట్‌ రికార్డ్‌ లు ఉన్నాయని తెలిపాడు. ఈ స్థానంలో కోహ్లీ 39 మ్యాచుల్లో  55 సగటుతో పాటు ఏడు సెంచరీలు కూడా చేశాడు. వన్డే మ్యాచుల్లో మూడో స్థానంలో కాకుండా కోహ్లీ నాలుగో స్థానంలో చేసిన సెంచరీలు ఇవీ..

50  ఓవర్ల మ్యాచుల్లో కోహ్లీ ఛాంపియన్‌గా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అతను తన ఆటను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ విషషంలో జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ లాంటి ఆటగాళ్లను చూసి స్ఫూర్తి పొందాలని సూచించాడు. ‘‘ఎంత పెద్ద ఆటగాడైనా గేమ్‌లో ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ ఉండాలి. అది కోహ్లీకి కూడా వర్తిస్తుంది” అని శాస్త్రి పేర్కొన్నాడు.