నా సక్సెస్ కి కారణం ఏంటంటే : యశస్వి జైస్వాల్

టీం ఇండియా ఇటీవల వెస్ట్ ఇండీస్ పర్యటన ను ముగించుకుంది, ఈ పర్యటనలో భారత్ వెస్ట్ ఇండీస్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ లు, ఐదు టీ-20 మ్యాచ్ లు జరిగాయి. ఈ సిరీస్ మొత్తం భారత్ యంగ్ ప్లేయర్ల మీదనే ఆధారపడింది. వన్డే ప్రపంచ కప్ దగ్గరలోనే ఉన్నా కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టేసి యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ లాంటి […]

Share:

టీం ఇండియా ఇటీవల వెస్ట్ ఇండీస్ పర్యటన ను ముగించుకుంది, ఈ పర్యటనలో భారత్ వెస్ట్ ఇండీస్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ లు, ఐదు టీ-20 మ్యాచ్ లు జరిగాయి. ఈ సిరీస్ మొత్తం భారత్ యంగ్ ప్లేయర్ల మీదనే ఆధారపడింది. వన్డే ప్రపంచ కప్ దగ్గరలోనే ఉన్నా కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టేసి యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ లాంటి లాంటి ప్లేయర్లతో టీ -20 మ్యాచ్ లు ఆడించారు. బౌలింగ్ విభాగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 

వెస్ట్ ఇండీస్ సిరీస్ లో రెండవ టెస్ట్ లో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్ లో అర్ధ శతకంతో అదర కొట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో కూడా కీలకమైన పరుగులు చేశాడు. ఆరంభంలోనే వికెట్ పోగొట్టు కోకుండా జట్టుకు మంచి భాగస్వామ్యం అందించాడు. అలాగే ఇదే టూర్ లో టీ -20 లలో కూడా అరంగేట్రం చేసిన జైస్వాల్ మొదటి మ్యాచ్ లో దూకుడుగా ఆడబోయి మొదటి ఓవర్ లోనే ఔట్ అయ్యాడు. మొదటి మ్యాచ్ లో నిరాశ పరిచిన జైస్వాల్ రెండవ మ్యాచ్ లో మళ్లీ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోలేదు. 51 బంతుల్లోనే 84 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. గిల్ తో 165 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండవ టీ -20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు. 

ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ సీజన్ లో కూడా యశస్వి జైస్వాల్ మంచి ఆటతీరు కనబరిచాడు. తాజాగా యశస్వి జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ కు కారణాన్ని వెల్లడించాడు. ” నేను బాగా ఆడాలి అని నేను మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటాను, దానికోసం నేను కష్టపడాలి, క్రమశిక్షణ తో ఉండాలి, బాగా తినాలి, బాగా నిద్ర పోవాలి అని నిరంతరం అనుకుంటూ ఉంటాను” అని చెప్పాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు అవసరమైన సలహాలను అందిస్తారని చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ హర్దిక్ పాండ్య లాంటి ప్లేయర్లు కూడా తనతో చాలా బాగా మాట్లాడేవారు అని వారి అనుభవం పంచుకోవడం నా ఆటతీరు మీద ప్రభావం చూపిస్తుంది అని కూడా అతను వెల్లడించాడు. 

“నా చుట్టూ అనుభవం కలిగిన ఆటగాళ్ళు ఉన్నారు, దాంతో పాటు ఉన్న సమాచారాన్ని మొత్తం ఆట మీదనే కేంద్రీకరించాలి ప్రతీ నిమిషం ఆట మీద శ్రద్ద పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, క్రికెట్ తర్వాత నేను బాగా కష్టపడుతున్నది నా ఫిట్నెస్ మీద” అని యశస్వి జైస్వాల్ తెలిపాడు. 

యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ ఇద్దరూ కలిసి ఓపెనింగ్ చేసింది రెండు మ్యాచ్ లే అయినా కూడా వీరి ఇద్దరి ఆటతీరు రోహిత్ ధావన్ భాగస్వామ్యాన్ని గుర్తు చేసింది. ఓపెనింగ్ పొజిషన్ లో శికర్ ధావన్ తర్వాత గుర్తించ దగ్గ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరూ రాలేదు. యశస్వి జైస్వాల్ అరంగేట్రం తో టాప్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రావడం జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పవచ్చు. ఆగస్టు 18 నుండి జరగనున్న ఐర్లాండ్ టూర్ కి కూడా యశస్వి జైస్వాల్ ఎంపిక అయ్యాడు. ఈ సిరీస్ కి బుమ్రా కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు.