మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లుగా నిఖత్, లోవ్లినా

ప్రత్యర్థికి త‌న బలమైన పంచ్ చూపించిన నిఖ‌త్.. రెండుసార్లు ఆసియా క‌ప్ విజేత అయిన‌ వియ‌త్నాంకు చెందిన గుయెన్‌ థి టామ్‌‌‌ను ఫైన‌ల్లో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.   కిక్కిరిసిన KD జాదవ్ ఇండోర్ హాల్ లో తన ప్రత్యర్థికి చుక్కలు చూపించింది జరీన్. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా.. త‌న బలమైన పంచ్ చూపించిన నిఖ‌త్.. ఆసియా ఛాంపియన్‌షిప్ లో రెండుసార్లు విజేత అయిన‌ వియ‌త్నాంకు చెందిన గుయెన్‌ థి టామ్‌‌‌ను ఫైన‌ల్లో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా […]

Share:

ప్రత్యర్థికి త‌న బలమైన పంచ్ చూపించిన నిఖ‌త్.. రెండుసార్లు ఆసియా క‌ప్ విజేత అయిన‌ వియ‌త్నాంకు చెందిన గుయెన్‌ థి టామ్‌‌‌ను ఫైన‌ల్లో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.  

కిక్కిరిసిన KD జాదవ్ ఇండోర్ హాల్ లో తన ప్రత్యర్థికి చుక్కలు చూపించింది జరీన్. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా.. త‌న బలమైన పంచ్ చూపించిన నిఖ‌త్.. ఆసియా ఛాంపియన్‌షిప్ లో రెండుసార్లు విజేత అయిన‌ వియ‌త్నాంకు చెందిన గుయెన్‌ థి టామ్‌‌‌ను ఫైన‌ల్లో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.  

ఈ విజయంతో నిఖత్ జరీన్ రెండవ ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో, నిఖత్ దిగ్గజ క్రీడాకారిని MC మేరీ కోమ్ తర్వాత రెండుసార్లు ప్రతిష్టాత్మక టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారతీయురాలు.

మరోవైపు లోవ్లినా బోర్గోహైన్ కూడా ఆదివారం ఇక్కడ జరిగిన మార్క్యూ ఈవెంట్‌లో తన తొలి బంగారు పతకాన్ని సాధించింది. అదే విధంగా రెండుసార్లు కాంస్య పతక విజేత లోవ్లినా.. ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌ను 5-2తో ఓడించి తన తొలి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది.

“ముఖ్యంగా ఒలింపిక్ విభాగంలో రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది” అని గతేడాది 52 కేజీల విభాగంలో టైటిల్‌ గెలిచిన నిఖత్‌ పేర్కొంది. 

“నేటి బౌట్ నాకు కష్టమైంది, ఆమె ఆసియా ఛాంపియన్, నా తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలు, దీంతో నేను ఆమెతో మరోసారి తలపడవచ్చు, కాబట్టి నేను కష్టపడి ఆడతాను” అని నిఖత్ తెలిపారు.

తనకు ఇష్టమయిన 52 కేజీల బరువు విభాగంలో పోటీలోకి దిగిన నిఖత్, టామ్ మొదటి దాడి చేయడంతో కాస్త వెనకబడినట్టు అనిపించింది. కానీ కొన్ని సెకన్ల తర్వాత నిఖత్ ఎదురు దాడి చేసింది. 

కాగా.. ఇద్దరు ఆసియన్ల మధ్య జరిగిన తొలి బౌట్ ఉత్కంఠభరితంగా సాగింది.

ఇక ఏకగ్రీవ తీర్పు ద్వారా మొదటి మూడు నిమిషాల సమయం తీసుకున్నందున, టామ్‌కు పెనాల్టీ పాయింట్‌ను ఇచ్చారు. దీంతో ఫలితం నిఖత్‌కు అనుకూలంగా వచ్చింది. 

కానీ.. టామ్ దాడి చేయడంతో నిఖత్ తలదించి ఆడవలసి వచ్చింది, దీని వలన నిఖత్‌కూ పెనాల్టీ పాయింట్ లభించింది. దీంతో గుయెన్‌ థి టామ్‌‌‌  రౌండ్‌ను కైవసం చేసుకుంది. చివరి మూడు నిమిషాల్లో, బాక్సర్లిద్దరూ విరుచుకుపడి ఒకరిపై ఒకరు కనికరం లేకుండా దాడి చేసుకున్నారు. చివరికి జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి విజయం సాధించింది.

“నాకు, కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఈ విభాగంలో పెద్దగా పోటీ లేని మొదటి ప్రధాన పోటీ ఇది. కానీ.. ఇక్కడ, ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీ పడ్డాయి.  బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కొన్ని మ్యాచ్‌లలో నా శరీరం కొంచెం సహకరించనట్టు అనిపించింది. ఈ అనుభవాల నుండి నేను నేర్చుకుని బలంగా మారడానికి ప్రయత్నిస్తాను” అని ఇప్పటికే  ఆసియా క్రీడల కోసం అర్హత సాధించిన నిఖత్ అన్నారు.

మరోవైపు నీతూ ఘంఘాస్ (48 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) తమ తమ విభాగాల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

స్వర్ణ పతకాల పరంగా ఆతిథ్య భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపింది. 2006 లో స్వదేశంలో జరిగిన క్రీడలలో భారత్ నాలుగు స్వర్ణాలను గెలుచుకుంది, ఇప్పుడు ఒక రజతంతో పాటు, ఎనిమిది పతకాలు సాధించి మనదేశ క్రీడాకారులు ఈ క్రీడలలో ఈ సారి అత్యుత్తమ ప్రదర్శన చూపినట్లే అని చెప్పవచ్చు.