సేమ్ స్కోర్ చేసినా శ్రీలంక ఎలా గెలిచింది?

ఆసియా కప్ లో భాగంగా జరిగిన సూపర్-4 మ్యాచులో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచులో అసలంక విన్నింగ్ రన్స్ కొట్టి లంకను ఫైనల్ కి చేర్చాడు. అయితే, ఈ మ్యాచ్‍లో 42 ఓవర్లలో ఇరు జట్లు సేమ్ స్కోర్స్ చేసినా లంకనే గెలిచింది. అందుకు కారణం ఏంటంటే.. ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 కీలక మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై శ్రీలంక ఉత్కంఠ విజయం […]

Share:

ఆసియా కప్ లో భాగంగా జరిగిన సూపర్-4 మ్యాచులో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచులో అసలంక విన్నింగ్ రన్స్ కొట్టి లంకను ఫైనల్ కి చేర్చాడు. అయితే, ఈ మ్యాచ్‍లో 42 ఓవర్లలో ఇరు జట్లు సేమ్ స్కోర్స్ చేసినా లంకనే గెలిచింది. అందుకు కారణం ఏంటంటే..

ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్-4 కీలక మ్యాచ్‍లో పాకిస్థాన్‍పై శ్రీలంక ఉత్కంఠ విజయం సాధించింది. కొలంబో వేదికగా గురువారం జరిగిన పోరులో పాక్‍పై 2 వికెట్లతో తేడాతో చివరి బంతికి గెలిచిన శ్రీలంక ఫైనల్ చేరింది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 42 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసి విజయం సాధించింది. సేమ్ స్కోరు చేసినా ఈ మ్యాచ్‍లో శ్రీలంక ఎందుకు గెలిచిందంటే..

శ్రీలంక, పాకిస్థాన్ మధ్య గురువారం జరిగిన ఈ మ్యాచ్‍కు ఆరంభంలోనే వర్షం ఆటంకం కలిగించింది. దీంతో ఈ మ్యాచ్‍ను 45 ఓవర్లకు కుదించారు అంపైర్లు. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. కాసేపు విరామం వచ్చింది. దీంతో మరింత సమయం వృథా కావటంతో ఆటను 42 ఓవర్లకు అంపైర్లు తగ్గించారు. దీంతో, 42 ఓవర్లు ఆడిన పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అయితే, ఆట మధ్యలో ఓవర్లు కుదించడం వల్ల డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకకు టార్గెట్‍ను సర్దుబాటు చేశారు అంపైర్లు. దీంతో లంక ముందు 252 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది లంక. అత్యంత ఉత్కంఠ మధ్య 8 వికెట్లు కోల్పోయి 42 ఓవర్లలో 252 పరుగులు చేసి శ్రీలంక విజయం సాధించింది. దీంతో సేమ్ స్కోర్ చేసినా డీఎల్ఎస్ పద్ధతిలో లంక గెలిచింది.

ఒకవేళ వర్షం అంతరాయం కలిగించకపోతే పాక్ స్కోరు కూడా అదే కాబట్టి.. లంక 253 పరుగులు చేస్తే గెలిచేది. కానీ పలుమార్లు వర్షం పడడంతో డీఎల్ఎస్ లంక టార్గెట్ ని 252 గా నిర్ణయించారు. కాబట్టి డీఎల్ఎస్ నిర్ణయం ఫైనల్ కావడంతో ఈ విషయంపై ఎవరూ ఏమి చేయలేరు. సాధారణ మ్యాచ్ అయితే మ్యాచ్ సూపర్‌ ఓవర్‌కు వెళ్లాల్సింది. కానీ డీఎల్ఎస్ విధానం వల్ల మ్యాచ్ శ్రీలంక సొంతమైంది.

చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంక (49 నాటౌట్) ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. చివరి రెండు బంతులకు ఆరు పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి ఫోర్, చివరి బంతికి రెండు పరుగులు సాధించి లంకకు విజయాన్ని కట్టబెట్టాడు. అంతకు ముందు లంక బ్యాటర్లు కుషాల్ పెరీరా (91), సదీర్ సమరవిక్రమ (48) రాణించారు.

అంతకు ముందు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసింది పాకిస్థాన్. స్టార్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ (86 నాటౌట్) ఓపెనర్ అబ్దుల్ షఫీక్ (52) అర్ధ శతకాలతో అదరగొట్టడంతో పాకిస్థాన్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 252 రన్స్ చేసింది. చివర్లో మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమైన ఇఫ్తికార్ అహ్మద్ (47) రాణించి.. రిజ్వాన్‍కు సహకరించటంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేసింది. అయితే, శ్రీలంక అద్భుత పోరాటంతో గెలిచింది. ఆసియాకప్ 2023 ఫైనల్‍లో సెప్టెంబర్ 17న భారత్‍తో తలపడనుంది శ్రీలంక.