ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా పెరిగిన హోటల్ రేట్స్

అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో జరగనున్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనౌన్స్ వేసిన తర్వాత, అక్కడ హోటల్ రేట్స్ అనేవి గణనీయంగా పెరిగాయి. ఏకంగా లక్ష రూపాయలు వరకు హోటల్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 15న గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగే  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఫిక్చర్ ప్రకటించినప్పటి నుండి, నగరంలో హోటల్ గదుల ధరలు దాదాపు పది రెట్లు పెరిగాయి అని పలు […]

Share:

అక్టోబర్ 15న అహ్మదాబాద్ లో జరగనున్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనౌన్స్ వేసిన తర్వాత, అక్కడ హోటల్ రేట్స్ అనేవి గణనీయంగా పెరిగాయి. ఏకంగా లక్ష రూపాయలు వరకు హోటల్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 15న గుజరాత్‌ అహ్మదాబాద్‌లో జరిగే 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఫిక్చర్ ప్రకటించినప్పటి నుండి, నగరంలో హోటల్ గదుల ధరలు దాదాపు పది రెట్లు పెరిగాయి అని పలు వార్తలు ప్రకటించాయి. 

హోటల్ రూమ్ రెంట్ లక్ష రూపాయలు:

అక్టోబర్ 15న నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రత్యర్థులయిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న క్రమంలో వివిధ హోటల్ బుకింగ్ వెబ్‌సైట్‌లలోని డిమాండ్ కారణంగా, ప్రస్తుతం హోటల్ రూమ్ రెంట్స్ అత్యధికంగా పెరిగాయని భావిస్తున్నారు.  నగరంలోని కొన్ని లగ్జరీ హోటళ్లు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి అంటే డిమాండ్ ఎంతవరకు ఉందో మనం గమనించొచ్చు. అయితే ఇది ఇలా ఉండగా, సాధారణ రోజుల్లో విలాసవంతమైన హోటళ్లలో రూమ్ రెంట్ సుమారు రూ.5,000 నుండి రూ.8,000 వరకు ఉంటుంది.

ఫైనల్‌తో సహా ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ స్టేడియం అనేది ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలో తక్కువ వ్యవధిలోనే ఇటువంటి భారీ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

అయితే లక్ష మంది కూర్చునే నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను చూడటానికి 40,000 మంది అభిమానులు నగరానికి వస్తారని అంచనా. కానీ ప్రస్తుతానికి అతిథుల కోసం దాదాపు 10,000 రూమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడున్న బుకింగ్స్ డిమాండ్ కారణంగా నగరంలోని కొన్ని లగ్జరీ హోటళ్లలో అక్టోబర్ 15న అయితే రూమ్స్ అనేవి అందుబాటులో లేవు. 

లగ్జరీ హోటల్ రూమ్ రేట్స్ ఎందుకు పెరిగాయి:

గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని మాట్లాడుతూ, పెద్ద ఈవెంట్కి సంబంధించి కొంత కోటాను బ్లాక్ చేసుకున్నందుకు కారణంగా, ధరల పెంపు అనేది కేవలం విలాసవంతమైన హోటళ్లకు మాత్రమే పరిమితమైందని అన్నారు. 

ఏదిఏవైనప్పటికీ సాధారణ ప్రజలు మాత్రం హోటల్ బుక్ చేసుకుని ఆ రోజున పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూడడం కాస్త కష్టమే అని చెప్పుకోవాలి. గణనీయంగా పెరిగిన రూమ్ రెంట్స్ కారణంగా, అక్టోబర్ లో మ్యాచ్ చూడ్డానికి రానున్న 40 వేల మంది కోసం కేవలం 10 వేల రూమ్స్ మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అక్టోబర్ 15న ఉండటానికి కనీసం రూమ్స్ కూడా అందుబాటులో లేవని లగ్జరీ హోటల్స్ ప్రకటించాయి. 

చివరిసారిగా జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్:

పాకిస్థాన్ చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన 2019 ప్రపంచ కప్ సందర్భంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి ODI ఎన్‌కౌంటర్ ఇది, ఆ సమయంలో భరత్ పాకిస్తాన్ మీద భారీ విజయాన్ని సాధించింది. 

అయితే ఇప్పుడు అక్టోబర్లో జరుగుతున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కూడా కచ్చితంగా పాకిస్తాన్ మీద ఇండియా అత్యధికంగా రన్స్ చేసి విజయం సొంతం చేసుకుంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని బయటపెడుతున్నారు. అయితే అక్టోబర్లో జరగనున్న మ్యాచ్ కోసం ఇప్పటినుంచే క్రికెటర్లు కసరత్తుల మొదలుపెట్టారు. అహ్మదాబాద్ లో జరగనున్న మ్యాచ్ చూడటానికి కనీసం లక్షలకు పైగా అభిమానులు రానున్నట్లు తెలుస్తుంది.