స్టార్ మీద పంచ్ వేసిన ధోని

ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు వినగానే లెజెండరి క్రికెటర్ అని ఎవరైనా చెప్పేస్తారు. ఆయన జీవితంలో ఎన్నో మైళ్ళ రాళ్లు. తన జీవితాన్ని ఒక సినిమా రూపంగా తీశారంటే ఆయన జీవితం ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో అందరూ ఊహించగలరు. ఒక క్రికెటర్ గానే కాకుండాఒక మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి ధోని. ధోనిని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ర్లగా మారిన ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. మనలో కూడా […]

Share:

ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు వినగానే లెజెండరి క్రికెటర్ అని ఎవరైనా చెప్పేస్తారు. ఆయన జీవితంలో ఎన్నో మైళ్ళ రాళ్లు. తన జీవితాన్ని ఒక సినిమా రూపంగా తీశారంటే ఆయన జీవితం ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో అందరూ ఊహించగలరు. ఒక క్రికెటర్ గానే కాకుండాఒక మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి ధోని. ధోనిని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ర్లగా మారిన ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. మనలో కూడా చాలామంది ధోని అంతటి వారం అవ్వాలని కలలు కంటూ ఉంటాం అన్నడంలో కూడా సందేహం లేదు

కూల్ కెప్టెన్: 

ఆయన సింప్లిసిటీ కి హ్యుమానిటీకి పెట్టింది పేరు. 42 సంవత్సరాల ధోని ఒక కూల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా, వారి టీం మెంబెర్స్ ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచలేదు ఎంఎస్ ధోని. అయితే ప్రస్తుతం సీఎస్కే టీం మెంబెర్గా ఉన్న యంగ్ టాలెంట్ దీపక్ గురించి క్రికెటర్ ఎంఎస్ ధోని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన దీపక్ చహార్ ఒక యంగ్ బౌలర్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ధోని సహకారంతో ఒక గొప్ప బౌలర్ గా ఎదిగాడు. 

సినిమా ప్రొడక్షన్ లో బిజీ: 

ఇటీవల ధోని నిర్మాణ చిత్రం LGM ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో, CSK కెప్టెన్ చాహర్‌తో తనకు ఉన్న మంచి స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. అంతేకాకుండా తను ఒక మందు లాంటివాడని తెలిపిగా మాట్లాడాడు.

దీపక్ తో ఉన్న పరిచయం: 

“దీపక్ చాహర్ ఒక మందు లాంటివాడు, అతను అక్కడ లేకపోతే, అతను ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచిస్తాము – అతను మన పక్కనే ఉంటే, అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని మీరు ఆలోచిస్తారు – కాకపోతే అతను చిన్నవాడు కాబట్టి, కాస్త పెద్దవాడిలా ఆలోచించడానికి టైం పడుతుంది, నా జీవితకాలంలో, దీపక్ ని పెద్దవాడిలా చూస్తానో లేదో నాకు తెలీదు,” అని ధోని నవ్వుతూ తన టీం మెంబెర్ అయిన చహార్ గురించి మాట్లాడాడు.

2016లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌తో ధోనీని చేర్చుకున్నప్పుడు చాహర్ మొదటిసారిగా పరిచయమయ్యాడు. 2017 సీజన్ ముగిసిన తర్వాత టోర్నమెంట్‌లో RPS బస ముగిసిన తర్వాత, తిరిగి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌తో చాహర్‌ని చేర్చుకున్నారు.  2018లో, CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సీజన్ ప్రారంభం నుండి, తనని ఆడనిచ్చేందుకు ఇష్టపడలేదని చాహర్ వెల్లడించాడు. కానీ, ధోనీ సీమర్‌కు మొత్తం 14 గేమ్‌లు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాడు.

“ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రాక్టీస్ మ్యాచ్‌లో నేను ఐదు సిక్సర్లు కొట్టిన తర్వాత ఫ్లెమింగ్ నా బౌలింగ్ కంటే నా బ్యాటింగ్ కోసం నన్ను ఎంచుకున్నాడు. దురదృష్టవశాత్తు, నా దెబ్బ కారణంగా నేను మ్యాచ్ నుంచి తప్పుకున్నాను. అంతేకాకుండా, 2016 సీజన్‌లో చాలా వరకు బయట కూర్చోవలసి వచ్చింది” అని చాహర్ బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్‌లో చెప్పాడు. .

IPL 2023లో, చాహర్ 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా దీపక్ చహర్ కొన్ని మ్యాచ్‌లలో చాలా గాయాలు పాలయ్యాడు.