తిలక్ వర్మ హాఫ్ సెంచరీని చెడగొట్టాడు  హార్దిక్

హైదరాబాద్ కుర్రోడు, యువ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. తనదైన శైలిలో తిలక్ వర్మ ప్రతిభను ఘనపరచాడని చెప్పాలి. ముందు జరిగిన రెండు సిరీస్ మ్యాచ్లలో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి గురైన టీం రేటును పెంచేందుకు కృషి చేశాడు తిలక్ వర్మ. ప్రస్తుతం జరిగిన మూడు మ్యాచ్లలో కూడా అతని స్కోర్ బోర్డు 39, 51, 49 నాట్ అవుట్ గా స్కోర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు తిలక్ వర్మ. […]

Share:

హైదరాబాద్ కుర్రోడు, యువ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రస్తుతం ప్రస్తావన నడుస్తోంది. తనదైన శైలిలో తిలక్ వర్మ ప్రతిభను ఘనపరచాడని చెప్పాలి. ముందు జరిగిన రెండు సిరీస్ మ్యాచ్లలో ఓటమి అనంతరం తీవ్ర ఒత్తిడికి గురైన టీం రేటును పెంచేందుకు కృషి చేశాడు తిలక్ వర్మ. ప్రస్తుతం జరిగిన మూడు మ్యాచ్లలో కూడా అతని స్కోర్ బోర్డు 39, 51, 49 నాట్ అవుట్ గా స్కోర్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు తిలక్ వర్మ. అయితే టి20 వెస్టిండీస్ తో తలపడిన మూడో మ్యాచ్లో అతను 49 పరుగులు చేయగా, కేవలం ప్రతి ఒక్కరూ హార్థిక్ పాండ్యా చివరి బంతికి కొట్టిన సిక్సర్ మీద దృష్టి పెట్టడం ప్రస్తుతం చేర్చనీయాసంగా మారింది. యువతను ఎంకరేజ్ చెయ్యకపోవడంతో హార్దిక్ పాండ్యా తన సెల్ఫిష్నెస్ బయట పెట్టాడని ప్రతి ఒక్కరూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇండియా కెప్టెన్ గా ఉంటున్న హార్దిక్ పాండ్యా ధోని అంతా మంచి కెప్టెన్ అయితే కాలేడు అని నొక్కి చెప్తున్నారు నెటిజన్లు.

హార్థిక్ నేతృత్వంలో మొదటి విజయం: 

టెస్ట్‌లు మరియు ODIలలో ఆధిపత్యం చెలాయించిన తర్వాత, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ల కంటే మెరుగైన హెడ్-టు-హెడ్ రికార్డ్ ఉన్నప్పటికీ, T20Iలలో వెస్టిండీస్‌ తమకి ఒక పెద్ద సవాలుగా ఉన్నట్లు భారత్ గుర్తించింది. మొదట రెండు మ్యాచ్లలో ఏవైతే తప్పులు చేసామో అవి సరిదిద్దుకోవాలి అనుకున్నారు ఆటగాళ్లు. అయితే ప్రస్తుతం కీలకంగా మారిన మూడో T20I మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 17.1 ఓవర్లలో మొత్తం 164 పరుగులు చేసి, విజయం సాధించింది ఇండియా క్రికెట్ జట్టు. అయితే ప్రస్తుతం అయిదు టి20 సిరీస్ లో 2-1తో వెస్టిండీస్, మన భారత్ నిలిచాయి అని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే శనివారం నాలుగో టి20 మ్యాచ్ ఫ్లోరిడా లోని లాండర్ హిల్ ప్రాంగణంలో జరగనుంది. 

మూడో మ్యాచ్ హైలెట్స్: 

టాప్ ఆర్డర్ లో ఉన్న ఆటగాళ్ల ఆట అంతంత మాత్రమే ఉండడం వల్ల, సంజూ శాంసన్ మరియు రూకీ తిలక్ వర్మ వంటి వారిపై అదనపు ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ప్రపంచ కప్ సంవత్సరంలో ODIలపై దృష్టి సారించడంతో, ఆగస్టు 31 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో గిల్, కిషన్ మరియు సూర్యకుమార్ మరిన్ని కసరత్తులు చేస్తున్నారు.

ఆదివారం గయానాలో రెండు వికెట్ల పరాజయం తర్వాత, బ్యాటర్లకు హార్దిక్ పాండే తనదైన శైలిలో మెసేజ్ అందించడు. కచ్చితంగా బ్యాటర్లు మరింత బాధ్యత వహించాలని కోరాడు. సైడ్ బ్యాలెన్స్‌ను కాపాడుకోవడానికి ఏడు పరుగుల వద్ద అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయడం జరిగింది. భారత ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బొటనవేలు నొప్పి కారణంగా ఆదివారం ఆటకు దూరమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన మూడో టెస్ట్ లో మాత్రం కుల్దీప్ తన సత్తా చాటాడనే చెప్పాలి.

హార్దిక్ మరియు అర్ష్‌దీప్ సింగ్ రెండవ గేమ్‌లో కొత్త ఆట తీరుని ఘనపరిచారు, అదే ఆట తీరని మూడో మ్యాచ్లో కూడా చూపించారు. రెండు నెలల విరామం తర్వాత ఆడుతున్న చాహల్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. బిష్ణోయ్ తరచుగా చేసే గూగ్లీలు, అవతల జట్టు మీద ఒత్తిడి తీసుకురాలేకపోయాయి అనే చెప్పుకోవాలి. వెస్టిండీస్ తో తలపడిన మూడో మ్యాచ్లో అతను 49 పరుగులు చేయగా కేవలం ప్రతి ఒక్కరూ హార్థిక్ పాండ్యా చివరిగా కొట్టిన సిక్సర్ మీద దృష్టి పెట్టడం ప్రస్తుతం చేర్చనీయాసంగా మారింది. యువతను ఎంకరేజ్ చేయడంలో హార్దిక్ పాండ్యా తన సెల్ఫిష్నెస్ బయట పెట్టాడని ప్రతి ఒక్కరూ ఫైర్ అవుతున్నారు.

భారత్ తరఫున అత్యధిక పరుగులను చేసే పేసర్ ముఖేష్ కుమార్ స్థానంలో మరొకరు ఆడగా, ప్రస్తుతం మూడు మ్యాచ్లలో భారత్ ఒక మ్యాచ్ విజయం సాధించింది. ఈ వారంలో శనివారం నాలుగోవ టి20 మ్యాచ్ జరగనుంది.