చాహల్‌ ను జట్టులోకి తీసుకోకపోవడంపై హర్బజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు!

కీలక లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను వన్డే వరల్డ్‌కప్‌ కోసం తీసుకోకపోవడంపై మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో తనకు అర్థం కావడం లేదని, అతడు ఎవరితోనైనా గొడవపడి ఉంటాడా? అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌లో సాధించిన విజయంతో వన్డే వరల్డ్‌కప్‌నకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది టీమిండియా. మరో రెండు వారాల్లో ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో ఆస్ట్రేలియాతో ఓ చిన్న సిరీస్ […]

Share:

కీలక లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను వన్డే వరల్డ్‌కప్‌ కోసం తీసుకోకపోవడంపై మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో తనకు అర్థం కావడం లేదని, అతడు ఎవరితోనైనా గొడవపడి ఉంటాడా? అని అనుమానం వ్యక్తం చేశాడు.

ఆసియా కప్‌లో సాధించిన విజయంతో వన్డే వరల్డ్‌కప్‌నకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది టీమిండియా. మరో రెండు వారాల్లో ప్రపంచ కప్ సమరం ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో ఆస్ట్రేలియాతో ఓ చిన్న సిరీస్ ఆడనుంది. అయితే ఇటీవల ముగిసిన ఆసియాకప్, వచ్చే వన్డే వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన జట్ల విషయంలో మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను తీసుకోకపోవడాన్ని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ స్పందించాడు. 

ఎవరితోనైనా గొడవ పడ్డాడా?

ఆస్ట్రేలియాతో సిరీస్, ప్రపంచకప్‌నకు చాహల్‌ను ఎంపిక చేయకపోవడాన్ని హర్బజన్ తప్పుబట్టాడు. చాహల్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. టీమ్‌లో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాళ్లలతో అతడూ ఒకడని చెప్పాడు. తన యూట్యూబ్ చానల్‌లో హర్బజన్ మాట్లాడుతూ.. ‘‘యజువేంద్ర చాహల్ జట్టులో ఉండుంటే బాగుండేది. కానీ అతడికి చాన్స్ ఇవ్వడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అతడు ఎవరితోనైనా గొడవపడి ఉంటాడు! లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పి ఉంటాడు! కానీ ఇవేమీ తెలియడం లేదు. బయటి విషయాలు పక్కన పెడితే.. నైపుణ్యం పరంగా చాహల్ టీమిండియాలో ఉండాల్సిన వాడు. ప్రస్తుతం చాలా మంది సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా.. కనీసం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు అయినా అతడిని ఎంపిక చేయాల్సింది” అని అభిప్రాయపడ్డాడు. 

ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు!

టీమ్‌లోకి వాషింగ్టన్ సుందర్, రవిచందర్ అశ్విన్‌ను ఎంపిక చేయడంపైనా బజ్జీ ప్రశ్నలను లేవనెత్తాడు. సుందర్, అశ్విన్‌ను అసలు టీమ్‌ ప్రణాళికలో భాగమే కాదని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆఫ్ స్పిన్నర్ కోసం మేనేజ్‌మెంట్ చూస్తోందని అర్థమవుతోందని అభిప్రాయపడ్డాడు.

‘‘అసలు ఆసియా కప్ జట్టులో లేని వాషింగ్టన్ సుందర్‌‌ను అక్కడికి పిలిచారు. తర్వాత ఈ సిరీస్‌లోకి రెండో ఆటగాడిని చేర్చారు. అతడే అశ్విన్. దీన్ని బట్టి చూస్తే ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెతుకుతోంది. ఆఫ్ స్పిన్నర్‌‌ను ఎంపిక చేయకపోవడం వల్ల పొరపాటు జరిగిందని టీమ్ మేనేజ్‌మెంట్ గ్రహించినట్లుగా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నప్పుడు మన బౌలర్లు ఇబ్బంది పడుతారని గుర్తించి ఉండొచ్చు. అసలు ఎందుకు ఇదంతా? నాకు అర్థమైనది ఏంటంటే.. వాళ్లు ఒక తప్పును సరిదిద్దేందుకు ఇంకో తప్పు చేస్తున్నారు” అని విమర్శలు చేశాడు. 

జట్టు బలహీనంగా కనిపిస్తోంది

మరోవైపు ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టు అంత గొప్ప లేదని బజ్జీ అన్నాడు. కాస్త బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోందని చెప్పాడు. ‘‘స్వదేశమైనా, విదేశమైనా ఆస్ట్రేలియాను ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం” అని చెప్పాడు.

వన్డే వరల్డ్ కప్ 13వ ఎడిషన్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. నవంబర్ 19 దాకా కొనసాగనుంది. నిజానికి ఫిబ్రవరి– మార్చి 2023లో జరగాల్సి ఉండగా.. కరోనా తదనంతన పరిణామాలతో వాయిదా పడింది. తొలిసారి పూర్తిగా ఇండియానే ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచులన్నీ ఇండియాలోనే జరగనున్నాయి. నవంబర్ 19న గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక టీమిండియా తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తలపడనుంది. ఇక హైదరాబాద్‌లో 9, 10 తేదీల్లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. 9న న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, 10న పాకిస్తాన్ వర్సెస శ్రీలంక మ్యాచ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయి.