కొంచెం ఎక్కువైంది అంటున్న హ‌ర్భ‌జ‌న్ సింగ్

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, అనుకున్న స్థాయికి లేదని భావించిన లెజెండరీ సునీల్ గవాస్కర్‌తో సహా రోహిత్ శర్మ అభిమానుల నుంచి అదే విధంగా మాజీ క్రికెటర్ల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. హర్భజన్ సింగ్ మంచితనం:  ప్రజలు అతని కెప్టెన్సీపై విమర్శలు కురిపిస్తున్న వేళ, స్పిన్ గ్రేట్ హర్భజన్ సింగ్కు వ్యక్తిగతంగా తెలిసిన రోహిత్ శర్మ గురించి మాట్లాడడం జరిగింది. ఇటీవల, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ […]

Share:

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ, అనుకున్న స్థాయికి లేదని భావించిన లెజెండరీ సునీల్ గవాస్కర్‌తో సహా రోహిత్ శర్మ అభిమానుల నుంచి అదే విధంగా మాజీ క్రికెటర్ల నుండి చాలా విమర్శలు ఎదుర్కోవడం జరిగింది.

హర్భజన్ సింగ్ మంచితనం: 

ప్రజలు అతని కెప్టెన్సీపై విమర్శలు కురిపిస్తున్న వేళ, స్పిన్ గ్రేట్ హర్భజన్ సింగ్కు వ్యక్తిగతంగా తెలిసిన రోహిత్ శర్మ గురించి మాట్లాడడం జరిగింది. ఇటీవల, ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో అతని నాయకత్వం సరైన స్థాయిలో లేదని భావించిన లెజెండరీ సునీల్ గవాస్కర్‌తో సహా భారత కెప్టెన్ అభిమానులు మరియు మాజీ క్రికెటర్ల నుండి చాలా విమర్శలు అయితే వినిపించాయి. అయితే రోహిత్ శర్మ కాప్టెన్సీ పైన వినిపిస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, ప్రతి మనిషికి మనిషి గౌరవించుకోవడం రోహిత్ శర్మ ఎంతగానో పాటిస్తాడని అదే ఇతరుల ద్వారా కోరుకుంటాడని మరోసారి గుర్తు చేశాడు

అంతేకాకుండా క్రికెటర్లకు మరో క్రికెటర్ల నుంచి విమర్శలు వినిపించడం అనేది ఒక అసాధారణ విషయం అంటూ, టీమిండియా క్రికెట్లో క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం సాటి క్రికెట్కి ఉన్న మంచి విషయం అని హెర్బజన్ సింగ్ ఎత్తిచూపారు. క్రికెటర్లకు టీం లో ఉండే ప్రోత్సాహం ఎంతో ధైర్యాన్ని బలాన్ని అందిస్తుంది అన్నారు. 

‘డబ్ల్యూటీసి ఫైనల్ లో టీం ఇండియా సరిగా ఆడకపోవడం నిజమే దాన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ, కేవలం కెప్టెన్ గురించి తక్కువ చేసి మాట్లాడటం అనేది ఒప్పు కాదు. కెప్టెన్ రన్స్ చేయట్లేదు అంటూ, క్యాప్టెన్ సరిగా వ్యవహరించట్లేదు అంటూ ఎత్తి చూపించడం సరైన పద్ధతి కాదు’ అని హర్భజన్ సింగ్ తన మనసులో మాటను బయటపెట్టారు. రోహిత్ నాయకత్వ సామర్థ్యంపై విశ్వాసం చూపించాల్సిన అవసరం ఉంది అని హర్భజన్ మరోసారి గుర్తు చేశారు. రోహిత్‌కి కూడా మునుపటి ఉన్న కెప్టెన్స్లాగే బీసీసీఐ నుంచి మద్దతు లభిస్తుందని హర్భజన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘బీసీసీఐ సపోర్ట్‌ ఉంటే స్వేచ్ఛగా పని చేయవచ్చు.. కేవలం ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లి మాత్రమే కాదు.. కాస్త వెనక్కి వెళితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుల నుంచి చాలా మంది కెప్టెన్లు సపోర్ట్‌ను పొందారు. రోహిత్‌కు బీసీసీఐ నుంచి తప్పక మద్దతు లభిస్తోంది. అతనికి ఆ రకమైన మద్దతు ఉంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో అతనికి సహాయపడుతుంది’ అంటూ రోహిత్ కు తన వంతు సపోర్ట్ ఇచ్చారు హర్భజన్ సింగ్. 

జట్టు నుంచి పూజారే అవుట్: 

సౌరాష్ట్ర వ్యక్తి పట్ల “గౌరవం” లేకపోవడం మరియు పర్ఫామెన్స్ ని బట్టి మాట్లాడడం అనేది ప్రతి సీనియర్ ఆటగాడికి ఒకేలా ఉండకపోవడం పట్ల హర్భజన్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

పూజారేకి ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, మరియు అతను జట్టు నుండి తొలగించబడిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించిందని. ఎందుకంటే మొత్తం టీమ్ లో ఉన్న వారిలో అతను పరుగులు చేయని ఏకైక వ్యక్తి కాదు. ఇతరులు కూడా ఉన్నారని హర్భజన్ అన్నాడు.

అయితే ప్రస్తుతానికి రోహిత్ శర్మ కాప్టెన్సీ గురించి వారి టీంలో ఉన్న వారి నుంచే విమర్శలు రావడం హర్భజన్ సింగ్కు నచ్చని విషయం. అదే విధంగా అభిమానుల నుంచి వస్తున్న విమర్శలు కాస్త అతిగానే ఉన్నాయి అన్ని ఆయన ఉద్దేశపడ్డారు. అంతేకాకుండా పూజారే విషయంలో కూడా కాస్త అన్యాయం జరిగిందని ఆయన ఉద్దేశం పడ్డారు.