త్వరలో 50వ పుట్టినరోజు జరుపుకోనున్న గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్

గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24వ తేదీన తన 50వ జన్మదిన పురస్కారాన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని క్రికెట్ ఆటలో గొప్ప క్రికెటర్ గా ప్రపంచం అతన్ని క్రికెట్ కి సజీవదేవుడిగా గుర్తించింది. కొంతమంది గొప్పగా పుడతారు మరికొంతమంది సామాన్యంగా జన్మించినా తమ అసమానమైన ప్రతిభతో గొప్పవారిగా మారుతారు. ఇక ఆపై వారు ఆ దశను కూడా అధిగమించి దేవతలుగా మారుతారు. ఇప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ […]

Share:

గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24వ తేదీన తన 50వ జన్మదిన పురస్కారాన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని క్రికెట్ ఆటలో గొప్ప క్రికెటర్ గా ప్రపంచం అతన్ని క్రికెట్ కి సజీవదేవుడిగా గుర్తించింది. కొంతమంది గొప్పగా పుడతారు మరికొంతమంది సామాన్యంగా జన్మించినా తమ అసమానమైన ప్రతిభతో గొప్పవారిగా మారుతారు. ఇక ఆపై వారు ఆ దశను కూడా అధిగమించి దేవతలుగా మారుతారు. ఇప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ కోవ లోకే వస్తాడు. పుష్పలంగా ప్రతిభతో జన్మించాడు. అతను కష్టపడి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

ప్రతిభ , కష్టపడే తత్వమే ఆయనను క్రికెట్ దేవుడిగా మార్చింది. ఇక గొప్ప క్రికెటర్ గా ప్రపంచం చేత గుర్తింపు పొందిన సచిన్ రమేష్ టెండూల్కర్ అన్ని రకాల క్రికెట్లలో లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక ఆయనకంటే ఎక్కువ ప్రతిభావంతుడు కష్టపడి పని చేసే వ్యక్తి అదృష్టవంతుడు మరెవరు లేరని చెప్పడంలో సందేహం లేదు. 1973 ఏప్రిల్ 24వ తేదీన ఇన్సూరెన్స్ రంగంలో పని చేసిన మరాఠీ కవి, నవల రచయిత మరియు సాహితీ వేత్త రమేష్ టెండూల్కర్ మరియు రజిని దంపతులకు జన్మించారు సచిన్ టెండూల్కర్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన క్రికెట్ అవ్వాలనే పట్టుదలతో క్రికెట్ దేవుడు అయ్యాడు. ఎందుకంటే అతని అన్నయ్య అజిత్ క్రికెట్ ఆటలో సచిన్ టెండుల్కర్ చూపే ప్రతిభను గుర్తించి సచిన్ టెండూల్కర్ ను ప్రముఖ గైడ్ అలాగే గురువు అయిన రమాకాంత్ అచ్రేకర్ వద్దకు తీసుకెళ్లాడు. సచిన్ మాత్రం ఎప్పుడూ పాఠశాలలో గొడవలు పడుతూ రౌడీలాగ బిహేవ్ చేసేవాడు. కానీ అతడిని దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా భారతీయ క్రీడా రంగానికి దేవుడిగా మార్చింది మాత్రం రమాకాంత్ అనే చెప్పాలి.

1988 సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో జరిగిన హరీష్ షీల్డ్ ఇంటర్ స్కూల్ మ్యాచ్లో సచిన్ మరియు వినోద్ కాంబ్లీ.. శారదాశ్రమ్ విద్యా మందిర్ స్కూల్ కోసం 664 పరుగులు తీసి క్రికెట్ తో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని చూపించి ప్రపంచం తన వైపు తిప్పుకునేలా చేసుకున్నాడు. ఇక ఆ మ్యాచ్లో యువ సచిన్ అజేయంగా 325 పరుగులు చేశాడు. కానీ అది సచిన్ ను తన కాలంలో గొప్ప క్రికెటర్ గా మార్చలేదు. వినోద్ కాంబ్లీ ఆ భాగస్వామ్యంలో ఎక్కువ పరుగులు చేశాడు. ఇకపోతే సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ దేవుడిగా మార్చిన అంశం ఏమిటి అంటే.. ఇదే విషయంపై వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ వంటి సహచర క్రికెటర్లు అతనిని చాలాసార్లు ప్రస్తావించారు. ఇక భారీ సంఖ్యలో పరుగుల రికార్డులు మరియు విజయాలు అసమానమైనవి. ఆటలో అత్యధిక స్థాయిలో 30 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించారు.

ఇక 24 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్ లో టెండూల్కర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు చేశాడు. అతను టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండోసారి 15921 పరుగులు చేశాడు. ఇక అత్యధిక టెస్ట్ సెంచరీలు 51 , అత్యధిక టెస్ట్ మ్యాచులు 200 ఆడి రికార్డులు సృష్టించాడు. అంతేకాదు ఆయన క్రికెట్ చరిత్రలో ఈ 2058 అత్యధిక ఫోర్లు నమోదు చేశాడు . అలాగే వేగంగా 15000 టెస్ట్ పరుగులు చేరుకున్న క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇక ఇవన్నీ ఆయనను క్రికెట్ దేవుడిగా మార్చాయి.