ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌పై గౌత‌మ్ గంభీర్ మండిపాటు

టీమిండియా క్రికెట‌ర్ల‌పై మండిప‌డ్డారు గౌత‌మ్ గంభీర్ఇం. డియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదో ప్రపంచ యుద్ధంలా ఫీలవుతుంటారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే ఏకంగా వారు ఎలా వరల్డ్ వార్ లా ఫీలవుతున్నారో ఆటగాళ్లు కూడా అలాగే ఫీల్ కావాలని కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఆటగాళ్ల మీద కామెంట్లు చేస్తుంటారు. అందుకోసమే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ […]

Share:

టీమిండియా క్రికెట‌ర్ల‌పై మండిప‌డ్డారు గౌత‌మ్ గంభీర్ఇం. డియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదో ప్రపంచ యుద్ధంలా ఫీలవుతుంటారు. కొంత మంది ఫ్యాన్స్ అయితే ఏకంగా వారు ఎలా వరల్డ్ వార్ లా ఫీలవుతున్నారో ఆటగాళ్లు కూడా అలాగే ఫీల్ కావాలని కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఆటగాళ్ల మీద కామెంట్లు చేస్తుంటారు. అందుకోసమే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక టెన్షన్ వాతావరణంలో ఉంటారు. వారి బిహేవియర్ కూడా చాలా సందర్భాల్లో అలాగే ఉంటుంది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ఆటగాళ్లు ఆలోచించే విధానంలో పూర్తి మార్పు వచ్చింది. ఇండియా-పాక్ మ్యాచ్ అంటే అదేదో ప్రపంచ యుద్ధంలా చూడకుండా అది కూడా సాధారణ మ్యాచ్ అనే ఫీలవుతున్నారు. అందుకోసమే పాక్ ఆటగాళ్లతో కూడా జోవియల్ గా ఉంటూ జోకులేసుకుంటున్నారు. తనివితీరా ఆటను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ విషయం కొంత మంది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు కొంత మంది మాజీ క్రికెటర్లు కూడా వీరి ఫ్రెండ్షిప్ మీద పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే చాలా కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మ్యాచ్ మధ్యలో 

మొన్న జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్ కు వరణుడు ఆటంకం కలిగించాడు. దీంతో రెండు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోనే గడపాల్సి వచ్చింది. ఈ సందర్భంలో రెండు జట్ల ఆటగాళ్లు కొందరు జోకులేసుకుంటూ జోవియల్ గా మాట్లాడుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ ఫొటోల మీద ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. వివిధ జట్ల ఆటగాళ్ల మధ్య స్నేహం సహజమే అయినప్పటికీ, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్ల మధ్య అలాంటి స్నేహం కనిపించకూడదని భారత మాజీ క్రికెటర్ తెలిపాడు. ఇతడు ఇప్పుడు కేవలం క్రికెటర్ మాత్రమే కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ కూడా. ఓ స్పోర్ట్స్ చానల్ లో మ్యాచ్ మధ్యలో మాట్లాడేందుకు వచ్చిన గౌతీ ఇలా మాట్లాడాడు. మీరు 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మీరు స్టేడియం బయట ఎలా ఉన్నా కానీ స్టేడియం లోపల మాత్రం అలా చేయడం బాగోలేదని తెలిపాడు. 

మీరు ఆడేది జాతీయ జట్టుకు

మీరు జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు గ్రౌండ్ లోపల స్నేహం విడిచిపెట్టాలని గౌత‌మ్ గంభీర్ సూచించాడు. ఓ స్పోర్ట్స్ చానల్ లో ఆయన మాట్లాడుతూ… ‘గేమ్ ఫేస్ హోనా జరూరీ హై.. దోస్తీ బహార్ రెహ్ని చాహియే అని అన్నాడు. అంతే కాకుండా మీరు మ్యాచ్ తర్వాత ఎంతైనా స్నేహపూర్వకంగా ఉండడండి కానీ మ్యాచ్ సమయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. మీరు ఇండియన్ టీంకు ఆడుతున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని తెలిపాడు. ప్రస్తుత రోజుల్లో క్రికెటర్లు మరో జట్టు క్రికెటర్లతో ఫ్రెండ్షిప్ చేయడం కామన్ అయిపోయింది. కనుక అటువంటి రిలేషన్స్ మెయింటేన్ చేసినా కానీ గ్రౌండ్ లో మాత్రం వారితో మాట్లాడడం నవ్వడం చేయకూడని గౌతీ తెలిపాడు. 

స్లెడ్జింగ్ చేయండి కానీ

రు స్లెడ్జింగ్ అనేది నేటి రోజుల్లో చాలా కామన్ గా మారిపోయింది. ఇది ఫన్ గా ఉంటుంది. కానీ తరచూ మీరు స్లెడ్జింగ్ చేయకూడని గౌతీ అన్నాడు. స్లెడ్జింగ్ విషయంలో కుటుంబ సభ్యులను లాగడం మంచిది కాదని తెలిపాడు. ఇండియా-పాక్ క్రికెటర్లు మ్యాచ్ మధ్యలో ఇలా జోవియల్ గా ఉండడాన్ని మాజీ క్రికెటర్ గౌతీ మాత్రమే కాకుండా కొంత మంది ఫ్యాన్స్ కూడా తప్పుబుడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇది మంచి పరిణామం అని చెబుతున్నారు. మీ రాజకీయాలను క్రికెటర్ల మీద రుద్దకండని అంటున్నారు. ఇలా గంభీర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఎప్పుడూ ఇండియన్ క్రికెట్ ను టార్గెట్ చేసే గంభీర్ మరోసారి ఇండియన్ క్రికెటర్ల మీద వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లు జోవియల్ గా  ఉంటే తప్పేంటని కొంత మంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్ మాత్రం గౌతం గంభీర్ కు సపోర్ట్ చేస్తున్నారు.