భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ ఇకలేరు..‌

టీమిండియా వెటర్న్ క్రికెటర్, ఓపెనర్ సుధీర్ నాయక్ (78). బుధవారం కన్నుమూశారు. 1974 – 75 మధ్యకాలంలో భారతదేశ తరపున మూడు టెస్టులు, రెండు వన్డేలు ఆడిన నాయక్ దాదర్ లోని తన నివాసంలో కాలుజారి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న నాయక్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ముంబై జట్టు 1970- 71లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు కెప్టెన్ గా సారాధ్యం వహించారు‌. ముంబై […]

Share:

టీమిండియా వెటర్న్ క్రికెటర్, ఓపెనర్ సుధీర్ నాయక్ (78). బుధవారం కన్నుమూశారు. 1974 – 75 మధ్యకాలంలో భారతదేశ తరపున మూడు టెస్టులు, రెండు వన్డేలు ఆడిన నాయక్ దాదర్ లోని తన నివాసంలో కాలుజారి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న నాయక్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ముంబై జట్టు 1970- 71లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు కెప్టెన్ గా సారాధ్యం వహించారు‌. ముంబై తరఫున 85 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఆడిన నాయక్ 7 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో సహా మొత్తం 4,376 పరుగులు చేశారు. 1970- 71లో ముంబై జట్టు రంజి ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  ఆ తర్వాత కాలంలో ముంబై జట్టు అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్ నేతృత్వంలో వెస్టిండీస్ పై చారిత్రక చారిత్రాత్మక సిరీస్ గెలుపులోను పాలుపంచుకున్నారు.

1974 భారత్ తరపున మూడు టెస్టులు ఆడిన మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సుధీర్ నాయక్ కొంతకాలం అనారోగ్యంతో బుధవారం ముంబైలోని ఆసుపత్రిలో మరణించారు. అతని మరణాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధ్రువీకరించాయి. అతనికి 78 సంవత్సరాలు. ఒక కూతురు ఉంది. నాయక్ ముంబై క్రికెట్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి.  రంజి ట్రోఫీ విజేత కెప్టెన్ ఆ సీజన్లో సునీల్ గవాస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ సర్దేశాయ్, అశోక్ మన్కడ్ వంటి పెద్ద పెద్ద ఆటగాళ్లు లేకుండానే ముంబై రంజి ట్రోఫీని గెలుచుకోవడంలో నాయక్ నాయకత్వం ఎంతో ప్రశంసనీయం. 

1972 రంజీ సీసన్ ప్రారంభమైనప్పుడు ప్రధాన బ్యాట్స్మెన్ తిరిగి జట్టులోకి రావడంతో నాయక్ ప్లేయింగ్ నుంచి తొలగించబడ్డాడు అతను 1974లో ఇంగ్లాండ్ పర్యటనలో బర్నింగ్ హం టెస్ట్‌లో అరంగేట్రం చేశాడు అక్కడ అతను 77 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ఓటమిలో తన ఏకైక అర్థసెంచరీని సాధించాడు. ఈయన 85 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడడు 35 కంటే ఎక్కువ సగటుతో 4376 పరుగులు చేశారు. జహీర్ ఖాన్ కెరియర్‌లో పెద్ద పాత్ర పోషించాడు. అతను క్రికెట్ ఆడటానికి జహీర్‌ను ముంబైకి తీసుకువచ్చి కోచింగ్ ఇచ్చాడు. ముంబై సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు. తర్వాత అతను వాంఖడే స్టేడియం  క్యూరేటర్‌గా పనిచేశారు. 

సుధీర్ నాయక్ మరణం పట్ల బీసీసీఐ సంతాపం తెలిపింది దశాబ్దాలుగా ఆయన చేసిన ఘనమైన సహకారం క్రీడలో పాల్గొనాలనుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బన్నీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పలువురు క్రికెట్ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.