సన్ రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాదులో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూశారు. అంతే కాదు, పెద్ద ఎత్తున కోట్లల్లో బెట్టింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఆటగాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే ఇలా అడ్డంగా ట్రోల్స్ కి గురి కావాల్సి ఉంటుంది. ఇకపోతే ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.  అందులో ఒకరు సన్‌రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ కూడా […]

Share:

ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాదులో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూశారు. అంతే కాదు, పెద్ద ఎత్తున కోట్లల్లో బెట్టింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఆటగాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే ఇలా అడ్డంగా ట్రోల్స్ కి గురి కావాల్సి ఉంటుంది. ఇకపోతే ముంబై, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.  అందులో ఒకరు సన్‌రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ కూడా ఒకరు. కీలకమైన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజ్ లోకి వచ్చిన ఇతడు జట్టును గెలిపించాలని కసిగా ఆడినట్లు ఏమాత్రం కనిపించలేదు . దీంతో సన్‌రైజర్స్ అభిమానులు అబ్దుల్ సమద్‌ను  దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ ఖాతాలో మరొక ఓటమి చేరిపోయింది మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దాదాపు 14 పరుగులు తేడాతో హైదరాబాదులో ఓడించి.. ఇక ముంబై విసిరిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 178 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం గమనార్హం. ఇకపోతే ఆఖరి 5 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ విజయానికి 60 పరుగులు కావాలి. 

ఇకపోతే రోహిత్ సేన విధించిన టార్గెట్‌ను.. ఒకానొక దశలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఛేదించేలా కనిపించారు. కానీ కీలకమైన సమయంలో క్లాసెన్, మయాంక్ అగర్వాల్ అవుట్ కావడంతో. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు అబ్దుల్ సమద్. అయితే ఇతడు బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రదర్శన కనబరచలేకపోయాడు. బౌండరీలు కొట్టాల్సిన సమయంలో డాట్ బాల్స్, సింగిల్స్ తీయడం ఉప్పల్లో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కోపం తెప్పించాయి.

12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా ఏమాత్రం ధాటిగా ఆడలేకపోయాడు. 13 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే.. అంతేకాదు అందులో ఒకే ఒక్క బౌండరీ మాత్రమే.. అతడిలో జట్టును గెలిపించాలని ఆసక్తి ఏమాత్రం కనిపించలేదు. అతడి కన్నా ఆల్ రౌండర్లు జానేసన్ (13), సుందర్ (10) వందరెట్లు బెటర్ అని చెప్పాలి. వాళ్ళు ఉన్న కాసేపు అయినా సరే ఆటలో తమ వంతు న్యాయం చేశారు కానీ ఆఖరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్న అబ్దుల్ సమద్ మాత్రం అవసరం లేని పరుగుకు ప్రయత్నించి రన్ అవుట్ గా నిలిచాడు. దారుణ ప్రదర్శన కనబరిచిన అబ్దుల్ సమద్‌పై సన్రైజర్ అభిమానులు మండిపడుతున్నారు. అతని వల్లే మ్యాచ్ ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫాన్స్ అతడిని దారుణంగా విమర్శిస్తున్నారు. అంతేకాదు నీకో దండం రా అయ్యా.. ఇంకోసారి బ్యాట్ పట్టకు.. వెళ్లి గల్లీలో క్రికెట్ ఆడుకో.. నీలాంటి వాళ్ల కోసం అక్కడ గల్లీలు ఎదురు చూస్తున్నాయి!” అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది “సమద్ ఎవరు నువ్వు.. బౌలర్‌వా లేక బ్యాటర్ వా” అంటూ రకరకాలుగా కామెంట్లు చేయడం గమనార్హం.  ఇంత ఘోరంగా ఐపీఎల్ లో ట్రోల్స్ ఎదుర్కొన్న బ్యాటర్ సమద్ ఒక్కడేనేమో అన్నంతగా కసి తీరా ట్రోల్స్ చేశారు హైదరాబాద్ ఫ్యాన్స్!