మరోమారు దాయాదుల పోరు

ఆసియా కప్ 2023 రంజుగా సాగుతోంది. ఈ టోర్నీలో దాయాదులు ఇండియా-పాకిస్తాన్ జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లో కూడా వర్షం కురిసింది. కానీ సూపర్-4 మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండడంతో పోరు అనేది నెక్ట్స్ రోజుకు వాయిదా పడింది. ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచో మ్యాచ్ ను మళ్లా కంటిన్యూ చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇండియా-పాక్ పోరంటే ఎప్పుడైనా కానీ కేవలం […]

Share:

ఆసియా కప్ 2023 రంజుగా సాగుతోంది. ఈ టోర్నీలో దాయాదులు ఇండియా-పాకిస్తాన్ జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లో కూడా వర్షం కురిసింది. కానీ సూపర్-4 మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండడంతో పోరు అనేది నెక్ట్స్ రోజుకు వాయిదా పడింది. ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచో మ్యాచ్ ను మళ్లా కంటిన్యూ చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇండియా-పాక్ పోరంటే ఎప్పుడైనా కానీ కేవలం ఈ రెండు దేశాల ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ లవర్స్ ను మునివేళ్ల మీద నిల్చోపెడుతుంది. కానీ మొన్నటి పోరు మాత్రం అంత కిక్ రాలేదు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్-4ను విక్టరీతో బోణీ కొట్టిన టీమిండియాకు తర్వాతి రోజు మ్యాచ్ లోనే లంకతో మరో విజయం లభించింది. కానీ పాక్ మీద పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయం సాధించగా… లంక మీద మాత్రం అది జరగలేదు. లంక బౌలర్ల స్పిన్ ధాటికి మన బ్యాటర్లు విలవిల్లాడారు. ఎట్ లీస్ట్ 250 పరుగులు కూడా చేయకుండానే చేతులెత్తేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ఇండియా పరాజయం చవిచూస్తుందని అంతా అనుకున్నారు కానీ బౌలింగ్ లో మనోళ్లు సత్తా చాటారు. మనోళ్లే 250 కొట్టలేదంటే బౌలింగ్ లో లంకను 200 కూడా చేయనీయలేదు. దీంతో ఇండియాకు చిరస్మరణీయ విజయం లభించింది. 

ఫైనల్ బెర్త్ కన్ఫామ్

సూపర్-4లో రెండు విక్టరీలతో టాప్ ప్లేస్ లో ఉన్న టీమిండియా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇంకో బెర్తు కోసం అటు శ్రీలంక ఇటు పాకిస్తాన్ రెండు జట్లు పోటీపడుతున్నాయి. సూపర్-4 కు అర్హత సాధించినా కానీ బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచుల్లో పరాజయం పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లా తన నామమాత్రపు మ్యాచ్ ను ఇండియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా అటు ఇండియాకు కానీ ఇటు బంగ్లాకు కానీ పెద్దగా ఒరిగేదేం లేదు. దీంతో ఈ మ్యాచ్ మీద ప్రేక్షకాభిమానులు ఎవ్వరికీ పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. 

నేడే అస్సలు పోరు.. ఇలా జరిగితేనే పాక్ ఫైనల్ కు

ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను మరోమారు ఇండియాతో మ్యాచ్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఇలా పెద్ద టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడేలా ఐసీసీ ప్లాన్ చేస్తోంది. తద్వారా టోర్నీకి మంచి మైలేజ్ వస్తుందని ఐసీసీ భావిస్తోంది. ఇక పాకిస్తాన్ సూపర్-4లో భాగంగా ఆడిన రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. రెండో ప్లేస్ లో ఉన్న లంక కూడా సేమ్ ఒక్క మ్యాచే గెలిచింది కానీ నెట్ రన్ రేట్ తేడా వల్ల పాకిస్తాన్ మూడో ప్లేస్ కు పరిమితం అయింది. ఇండియా మీద ఘోరంగా ఓడిపోవడంతో పాక్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. అదే సమయంలో శ్రీలంక మాత్రం ఇండియా మీద తక్కువ మార్జిన్ తో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా కానీ పాక్ కంటే మెరుగైన రన్ రేట్ కారణంగా రెండో ప్లేస్ దక్కించుకుంది. ఇక నేడు పాక్-శ్రీలంక అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఇవాళ్టి మ్యాచ్ గెలవడం పాకిస్తాన్ ఇటు శ్రీలంకకు మరీ ముఖ్యం. ఎందుకంటే ఇవాళ్టి మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఇండియాతో టోర్నీ ఫైనల్ ఆడనుంది. ఇండియా పాక్ పోరు చూసేందుకు తహతహలాడుతున్న అభిమానులు ఈ రోజు పోరులో పాక్ గెలవాలని కోరుకుంటున్నారు. ఒక వేళ పాక్ గెలవకుండా ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే మాత్రం పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకోసమంటే ఒక వేళ మ్యాచ్ రద్దయితే నిర్వాహకులు ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఇలా అయినా కానీ పాక్ ఫైనల్ కు చేరడం కుదరదు. కేవలం పాక్ ఈ మ్యాచ్ లో గెలిస్తేనే రన్ రేట్ తో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. అలా కాకుండా మ్యాచ్ రద్దైనా కానీ మ్యాచ్ లో శ్రీలంక గెలిచినా కానీ పాక్ అన్నీ సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే. 

జోరు మీద లంక.. ఢీ లా పడ్డ పాక్

కీలకమైన సూపర్-4 మ్యాచ్ కు ముందు శ్రీలంక జోరు మీద ఉంది. గత మ్యాచ్ లో లంక ఇండియా మీద ఓడినా కానీ గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు యువ స్పిన్నర్ వెల్లలాగే తన పర్ఫామెన్స్ తో అందరి హృదయాలను గెల్చుకున్నాడు. పాక్ కూడా వెల్లలాగేను ఇంత వరకు సరిగ్గా ఎదుర్కోలేదు కాబట్టి వారు కూడా తికమక పడే అవకాశం లేకపోలేదు. అదీ కాకుండా గత ఏడాది టీ20 ఫార్మాట్ లో నిర్వహించిన ఆసియా కప్‌ ను శ్రీలంక కైవసం చేసుకున్న  సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ నసీమ్ షా గాయంతో టోర్నీ మొత్తానికే దూరం అయ్యాడు. అతనితో పాటు మరో స్టార్ బౌలర్ హరిస్ రౌఫ్ కూడా నేటి మ్యాచ్ ఆడడం లేదు. భారత్‌ తో జరిగిన మ్యాచ్‌లోనే ఈ స్టార్ పేస్ ద్వయం గాయపడడి.. బ్యాటింగ్‌ కు రాలేకపోయారు. పాకిస్తాన్ జట్టు వారికి బ్యాకప్ లను పిలిచింది. ఈ ఇద్దరు మాత్రమే కాకుండా పాక్ టీంలో మొత్తం 5 మార్పులు చేశారు. దీంతో కీలకమైన నేటి మ్యాచ్ లో వారు ఏ మేరకు పర్ఫామ్ చేస్తారో అని జట్టు మేనేజ్ మెంట్ తో పాటు ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. ఆసియా కప్ విషయానికి వస్తే ఇండియా జట్టు వన్డే ఫార్మాట్ లో అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకుంది. ఇప్పటికే ఇండియా 6 సార్లు టైటిల్‌ ను ఎగరేసుకుపోయింది. అది మాత్రమే కాకుండా పాకిస్తాన్ రెండుసార్లు టోర్నీని కైవసం చేసుకుంది. అదే సమయంలో శ్రీలంక వన్డే ఫార్మాట్ ఆసియా కప్‌ ను 5 సార్లు గెలుచుకుంది.